Sunday, November 25, 2012

పాఠం పూర్తయ్యాకా....

ఒకోసారి 
అలసిన మనసుకి ఆలంబనవై
మరోసారి 
అమరిన అనుబంధాలకు విఘాతమై
యాభై ఎనిమిదో ఏట 
ఆహ్వానించని అతిధిలా వస్తావు 
ఎపుడొస్తావో తెలుసు అయినా
మరికొంత ఆలశ్యమవాలని...

హాజరు పుస్తకం లో నా చివరి సంతకం 
వేల ప్రశ్నలని సంధిస్తుంది 
రెక్కలుడిగిన నాకు 
పిల్లలు కొత్తరిక్కలు తొడిగి 
తమతో పాటు ఎగరమంటారు
సహకరించని మనసు 
ససేమిరా అంటుంది 

పదవీ విరమణ అంటే 
జీవితపు చరమాంకమనీ
విశ్రాంత యానమని అంటారు 
కానీ నాకు మాత్రం 
జీవితం లో చేయాల్సిన 
నేక పనుల్లో ఒక పని పూర్తయి 
మరో పనిలోకి వెల్తున్నట్లే
ఒక పాఠం పూర్తయ్యాకా
మరో పాఠం నేర్చుకోవడమే..
 
ఇపుడు నాకోసం నేను 
నా సృష్టి కర్తతో 
సంభాషించుకునే అవకాశం 
అతని సన్నిధిలో సేదతీర్చుకునే భాగ్యం 
పదవీ విరమణ ఎవరికేమయినా
నాకు మాత్రం ఓ వరం ...

Sunday, November 18, 2012

కార్డుకధల పోటీ - సృజన..విశాఖ

వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో ప్రతినెలా మూడవ ఆదివారం సాహితీ ప్రియులను ఎంతగానో అలరిస్తోన్న సంస్థ ...విశ ్గ్షికో్స ంద్భంగా  పోస్టు కార్డు కధల పోటీ ని నిర్వహిస్తూంది.

ఇతివృత్తం మీ ఇష్టం.  కధ పోస్టుకార్డుకి ఒక వైపుని మాత్రమే వ్రాయాలి.  వెనుకవైపు క్లుప్తంగా హామీపత్రం, చిరునామా మరియు ఫోను నెంబరు పేర్కొనాలి.  ఒకరు ఒక కధ మాత్రమే పంపించాలి.

బహుమతుల వివరాలు :  పోటీకి పంపిన వాటిలో ఉత్తమ మైన మూడు కధలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి.

జనవరి 2013 ఆఖరి  వారం లో జరుగు మా సంస్థ నాలుగవ వార్షికోత్సవ సభలో విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేయడం జరుగుతుంది.

పోస్టుకార్డు కధలు మాకు చేరాల్సిన ఆఖరు తేది: 20.12.2012. మీ రచనలు పంపాల్సిన చిరునామా:

గుండాన జోగారావు,                                          బొల్లోజు దుర్గాప్రసాదు,
అధ్యక్షులు, సృజన....విశాఖ                                కార్యదర్శి , సృజన....విశాఖ
6-242, శ్రీ సాయి నగర్                                        సెకండ్ ఫ్లోర్ 303, సాయి బాలాజీ హోంస్
సింహాచలం పోస్టు                                               చినముషిడివాడ, సుజాతనగర్ పోస్టు
విశాఖపట్నం - 530 028                                    విశాఖపట్నం - 530 051
సెల్ నెం. 94901 85708                                     సెల్ నెం. 98492 74738