Tuesday, December 29, 2009

ఎందుకని...?

ఈ బాధని, వేదనని
ఎందుకు నింపుతావు నాలో
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే..

ఎందుకు నాకళ్ళని వర్షిస్తావు
నీ విరహపుటెడారులు నాలో
విహరిస్తున్నయనా

క్షమించు ప్రియా నిను
ప్రేమిస్తున్నానని అనలేను
ఎందుకంటే..అది
నీకు తెలియంది కాదు..

నిను చుంబించానని అనలేను
ఎందుకంటే..
చూడలేనంతగా నాకళ్ళు
మూతలు పడిపోయాయి.

నాకు తెల్సు
నను పొగడ్తలలో
ముంచెత్తినపుడు
నిజం చెప్పటం లేదని..

అయ్యో..
నీ తలపుల్లో
కాలం వేలి కొనలనుండి
జారి పోయిందే....

విడిపోదామనుకునే కొలదీ
బలపడి పోతూంది.
ఎందుకంటే..
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే...
Tuesday, December 22, 2009

పెళ్ళి పుస్తకం - 11హిందూ వివాహ ప్రాశస్త్యము
పదకొండవ భాగము
తలంబ్రాలు:

పెళ్ళిళ్ళలో చిన్నలకు పెద్దలకు వేడుకగా కనపడే
తలంబ్రాలు కార్యక్రమం వెనుక ఎంత రహస్యం దాగి ఉందో
అప్పుడు చెప్పే మంత్రాలను చూస్తే మనకు తెలుస్తుంది.

తలంబ్రాలు పోసుకునేటప్పుడు వరుడు ఈ క్రింది మంత్రం చెప్పి
ముందు వధువు నెత్తిపై తలంబ్రాలు పోస్తాడు.

1. " ప్రజావే కామస్స వృధ్యతాం "
' నేను కోరిన సంతానము సమృధ్ధిగా నుండుగాక '

తరువాత వధువు ఈ క్రింది మంత్రాలు చెప్పి వరుని నెత్తిపై
తలంబ్రాలు పోస్తుంది.

2. " పశవో మే కామస్స మృధ్యతాం "
' నాకిష్టమైన పాడి పంటలు సమృధ్ధిగా నుండుగాక '

వరుడు ఈ క్రింది మంత్రాన్ని చెప్పి వధువు నెత్తిపై
రెండవ సారి తలంబ్రాలు పోస్తాడు.

3. " యజ్ఞోమే కామస్సమృధ్యతాం "
' నాకిష్టమయిన త్యాగం సమృధ్ధిగా నుండుగాక '

తరువాత ఇద్దరూ ఈ క్రింది మంత్రం చెప్పి తలంబ్రాలు
పోసుకుంటారు.

4. " శ్రియోమే కామస్సమృధ్యతాం "
' మాకు కావల సిన ధనం సమృధ్ధిగా నుండుగాక '

బ్రహ్మగ్రంధ్రి లేదా బ్రహ్మముడి :

హోమసమయమ్లో దంపతులిరువురు విడిపోకుండాను,
దూరం కాకుండాను పురోహితుడు ఇరువురి కొంగులను ముడి వేస్తూ
ఈ మంత్రమును చదువుతాడు.

" ధృవంతే రాజ వరుణో ధ్రువంతెనో బృహస్పథి:
ధ్రువంచ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర ధారయతాంధ్రువం "

ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు రాజగు
వరుణుడు,దేవుడగు బృహస్పతి, ఇంద్రుడు
అగ్ని స్థ్రిరత్వమును కలుగుజేయుదురుగాక!

" గృహ పత్నీ హధా సోవశినీత్వం విదధం ఆవదాసి "

' ఇంటి యజమానురాలుగా సర్వమునకు పెత్తనము వహించి
తీర్చిదిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము '
అని వరుడు వధువు చేయి పట్టుకొం టాడు.

పాణి గ్రహణము మరో టపాలో

కొసమెరుపు:

1. Women are unpredictable. Before marriage,

she expects a man, after
marriage she suspects

him, and after death she respects him.


2. "What's the matter, you look depressed."

"I'm having trouble with my wife."


"What happened?" "She said she wasn't

going to speak to me for 30 days.


" But that ought to make you happy."

"It did, but today is the last day."Sunday, December 20, 2009

పెళ్ళిపుస్తకం-10హిందూ వివాహ ప్రాశస్త్యము
పదవ భాగము
బండికాడి:

దీనికొక కధ ఉంది. అపాల అను ఒక అవివాహిత
యువతికి వళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చి ఎవరూ
వివాహము చేసికొనలేదు. ఇంద్రుని గూర్చి యాగము చేసిన
అది తగ్గి పోవును. కాని వివాహము కానిది ఆ యాగము
చేయరాదు. అందుకు ఆమె విచారించుచు ఒక నదిలో
స్నానము చేయుచూ - ప్రవాహమున కొట్టుకొని
పోవుచుండగా సోమలత ఒకటి ఆమె దగ్గరికి కొట్టుకుని
వచ్చింది. ఆమె దానిని పళ్ళతో నమిలి ఇంద్రుని ఉద్దేశించి
నోటితో విడిచి పెట్టింది.
ఇంద్రుడు ఆ రసమును గ్రహించి జలమును తన రధము కాడి
రంధ్రము గుండా పోనిచ్చి ఆ జలమును ఆమెపై చల్లుతాడు.
రోగవిముక్తురాలైన ఆమెకు సూర్య వర్చస్సు వస్తుంది.
ఈ సంప్రదాయం లో
ఉత్తర దక్షిణముగా కాడిని పట్టుకొంటారు.
దక్షిణమున ఉన్న రంధ్రము గుండా వరుడు
నీటిని చల్లుతాడు. ఈ పవిత్ర జలములచే
వధువు పవిత్ర రాలగుతుంది.

"అవీరఘీ: ఉదచంతు అత:"

వీరులైన సంతతికి అరిస్టము కులుగకుండ
ఈ జలములు క్షాళనముచేయు గాక !

"ఖేఅనవ: ఖేరద: ఖేయుగస్య శచీపతే
అఫాలాం ఇంద్రత్రి: పూర్త్యకరత్ సూర్యవర్చసవ "

గగనమున పోల్చలేని రధమును నడుపు ఓ శచీపతి!
అపాలా(ఎవరి పాలనలో లేని) అయిన ఈమెను సూర్యుని
తేజస్సుగల దానినిగా మూడు మార్లు చేయుగాక.
తరువాత కాడి రంధ్రము గుండా బంగారము
(మంగళ సూత్రము) పోనిచ్చి నీరు చల్లుతూ

"శనై హిరణ్యం సము వంతు ఆప:
శనై మేధ భవంతు"

బంగారు వెలుగులు మెల్లగా జలమును
చేరి సారవంతముగాక .
మిగతా మంత్రములు వధువుని నూరు రెట్లు
పవిత్రురాలగుటకు, శాంతి నివ్వగలందులకు చెప్పును.

యోక్త్ర ధారణ : ( వధువును త్రాటితో చుట్టుట )

"ఆశాసానా సౌమనసం ప్రణాం సౌభాగ్యం తనుం
అగ్నే రనూరతా భూత్వాసన్న హ్యేనుకృతాయకం"

మచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని
మంచి తనువును కలిగి ఉండి అగ్నిహోత్రమున
నాకు సహచారిణివై సత్కా ర్య ములకు సంసిధ్ధువు కమ్ము.

మంగళ సూత్రధారణ:

వరుడు సంకల్పించి మాంగళ్యదేవతను ఆహ్వానించి
షోడశోపచారాలతో మంగళసూత్రమును పూజించును.
సభలోని వారిచే దానిని సృశింప చేస్తారు.
తరువాత వరుడు ఈ మంత్రం
చెపుతూ సూత్రమును కట్టును.

"మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి శుభగేత్వం జీవ శరదశ్శతం "

నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము
చేత నేను కంఠమున మాంగల్యమును కట్టుచున్నాను.
నూరు సం వత్సరములు జీవించుము.

తలంబ్రాలు మరో టపాలో.......

కొసమెరుపు:
1. In the first year of marriage,
the man speaks and the woman listens.
In the second year, the woman speaks and the man listens.
In the third year, they both speak and the neighbors listen.

2. Love is blind but marriage is an eye-opener.

Tuesday, December 15, 2009

అసలు కెసిఆర్ తెలంగాణా వాడేనా ?

నాబ్లాగులో అసలు రాజకీయాలగురించి చర్చించకూడదనుకున్నాను.
కాని వేడెక్కుతున్న రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే
ఒక తెలుగుజాతి బిడ్డగా
నాకు తెలిసిన విషయాలను
ప్రస్తావించడం నా కనీస ధర్మం అనిపించిది.

ఒక పార్టీలో తన అస్ఠిత్వాన్ని ఉనికిని కోల్పోయి తన
స్వార్ధ ప్రయోజనాల కోసం తె.రా.స.అనే ముసుగేసుకుని 2001 ఏప్రిల్ 27 న
ప్రజలలో లేని ఉద్యమ స్ఫూర్తి ని(1969 లోనే సమసిపోయింది)
రగిలించడానికి వచ్చిన కె.సి.ఆర్ ని పాపం తెలంగాణా ప్రజలు
గుడ్డిగానమ్మి గెలిపించి....మోసపోయి....ఓడించారు.
తెలంగాణా గురించి ఒక్కడుకూడా లేకపొతే ఎలా
అని సానుభూతి
చూపించి బొటాబొటి మార్కులతో పాస్ చేసారు.
తె.రా.సా. రాజకీయ పార్టీ కాదని , ఒక ఉద్యమ పార్టీ అని తనే ప్రకటించుకొన్నాడు.
కానీ ఈ రోజు ఏం జరుగుతున్నదేమిటి? దీనికాయనిచ్చే సమాధానం ఏమిటి?
దేశం లో ఏ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో అంటూ లేకుండా గెలిచిన ఏకైక పార్టీ తె.రా.స.
అధికార వ్యామోహమే తప్ప ఒక ఎం.పి. నిధులతో
ఒక్క సామోజిక కార్యక్రమం కూడాచేపట్టలేక పోయాడు.
ఇన్నళ్ళూ తన ఉనికి కోసం పాటుపడ్డమే తప్ప
తెలంగాణా ఉనికి కోసం పాటు పడిన దాఖలాలు లేవు.
ఇన్నయ్య, కెకె మహేంద్ర రెడ్డి, ప్రకాశ్ వంటి మేధావులు, నాయకులు
ఇపుడు కె.సి.ఆర్తో కలిసి ఎందుకు పనిచేయటమ్లేదు ?
ఒక్క జయ శంకర్ తప్ప ఆయనతో ఉన్న మేధావుల జాబితా ఏది?
తన కుటుంబానికి పార్టీతో సంబంధం లేదన్నాడుగా అది నిజమేనా?
ఇప్పుడు తనది కుటుంబ పార్టీ కాదా?
విద్యార్ధులలోకి గూండాలను చొప్పించి ఆంధ్రా ఆస్తుల్ని
ధ్వంశం చేయించిన కెసీఆర్ తినే తిండి ఎక్కడిది?
వెనుకబడి పోయింది అని అంటాడే..
యూనివర్సిటీలు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ తెలంగాణాలో ఆయనకు కనబడలేదా?
ఆంధ్రా ప్రాంతం వారు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించకపోయింటే వీరి పరిస్ఠితి ఏమిటీ?
ఆంధ్రా ప్రాంత ప్రజలు
తెలంగాణా విడిచి వెళ్ళాలని కెసిఆర్ ప్రకటించాడు.


అదే కనక జరగాల్సి వస్తే...

మొదట వెళ్ళాల్సిన వాడు..కె.సి.ఆరే...

ఎందుకంటే ఆయన జన్మ స్ఠలం విజయనగరం జిల్లా.

Sunday, December 13, 2009

పెళ్ళి పుస్తకం - 9హిందూ వివాహ ప్రాశస్త్యము
తొమ్మిదవ భాగము
వివాహ బంధం నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా దంపతులు కలిసిమెలిసి జీవించడానికి తగిన నైతిక పునాదులు ఈ కన్యాదాన తంతులో కనిపిస్తాయి.
ఇక్కడ ప్రతి మంత్రానికి ఒక విశిష్టత ఉంది. వీటి అర్ధాలు తెలుసుకుని జీవించిన నాడు వైవాహిక జీవితంలో ఏ అనర్ధాలు ఉండవు.
కన్యాదానము గుణవంత మగుటకు సాలగ్రామమును దానం చేస్తూ...
కన్యాదాత : "ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య"
ధర్మాచరణమున నీవు ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వరుడు : "నాతిచరామి". అతిక్రమించి చరించను
క.దా : "అర్ధేత్వయా ఏషానాతి చరితవ్య" అర్ధాచరణమున నీవు ఈమెను
అతిక్రమించి చరించరాదు.
వ. : "నాతిచరామి"
క. దా : "కామేత్వయా ఏషా నాతి చరితవ్య"
కామాచరణమున ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వ. : "నాతిచరామి"
ఇది అయిన తరువాత కొంతమంది గోదానము చేస్తారు.
ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా చెపుతారు.

శచీ పూజ ఎందుకు ?
సుమూహర్త సమయాన కన్యాదాత శచీదేవిని పూజించుచూ:
"దేవేంద్రాణి నమస్తుభ్యం
దేవేంద్ర ప్రియభామిని
వివాహం,
భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహిమే"

దేవేంద్రుని ప్రియురాలవగు నీకు నమస్కారము.
వీరికి వివాహము, భాగ్యము, ఆరోగ్యము,
సంతతి కలిగింపుము. అని ప్రార్ధించును.
తరువాత వధువును తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి
వరుని తెరకు పశ్చిమమున కూర్చోబెట్టి ఇరువురికి మధ్యవున్న తెరను
తొలగిస్తారు.
అపుడు వధూవరులు ఒకరి భ్రూమధ్యము మరియొకరు చూసుకుని
జీలకర్ర బెల్లమును ఒకరి నెత్తిన మరియొకరు ఉంచుతారు. వరుడు ఈ
మంత్రములు చెపుతాడు.
"ఆభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం బృహస్పతే
ఇంత్ర అపుత్రఘ్నీం లక్ష్యం తామప్యై సవితస్స :"

ఈమె సోదరులకు వృధ్ధికలగాలని వరుణుణ్ణి, లక్ష్మిని,
భర్త వృధ్ధిపొందుటకు బృహస్పతినీ
ఈమెకు పుత్రసంతానము కలదానినిగాచేయుటకు
ఇంద్రుణ్ణి ప్రార్ధిస్తాడు.
"అఘోరచక్షు: అవతిఘ్నీయేది"
శుభదృష్టి కలదానవుగాను, సౌభాగ్యవతిగాను వర్ధిల్లుము.
"శివా పశుభ్య: సుమనా: సువర్చాహా:
మన పశు సంపదకు శుభములు కలుగునట్లుగా మంచి
మనస్సుతో తేజస్సుతో వర్ధిల్లుము.
"వీరనూ: దేవకామాస్యోన శంనోభవత్ ద్విపదే శంచతుష్పదే"
వీరులగు పుత్రులను కాంచుము. దేవతలు ముచ్చటపడునట్లు
మెలగుము. మనకు మనపరివారమునకు, మన పశువులకు
శాంతి కలుగు గాక.
వరపూజ, కన్యాదానము, శచీపూజ తంతులు పూర్తయిన తర్వాత
కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్ణాలలో కాడి (రెండుఎడ్ల బండికి రెండు ఎద్దులను కలుపుతూ
వాటి మెడమీద వుండే పొడవైన కర్ర దూలము ) రంధ్రము నుండి జలమును చల్లి
మరికొన్ని మంత్రాలను పఠిస్తారు.
అవి మరో టపాలో....
కొసమెరుపు:
1. A woman worries about the future until she gets a husband. A man never worries about his future until he gets a wife!


2. When a man opens the door of his car for his wife, you can be sure of one thing: either the car is new or the wife.

Wednesday, December 9, 2009

పెళ్ళి పుస్తకం - 8 (కన్యాదానము)


హిందూ వివాహ ప్రాశస్త్యము
ఎనిమిదవ భాగము
వివాహ విధానం లో అతి ముఖ్యమయినది కన్యాదానము.
ఎన్నో సం.రాలుగా ప్రేమ,మమకారాలతో పెంచుకున్న
కూతురుని ఈ ప్రక్రియతో వరునికి,
అతని కుటుంబానికి
సుఖసౌఖ్యాలను అందించాలనీ, వంశాభివృధ్ధి గావించాలని
సాక్షాత్ లక్ష్మీ సమానురాలైన కన్యని దానం చేయడం జరుగుతుంది.
కన్యాదానము చేయునపుడు కన్యాదాత కొన్ని మంత్రాలను చెపుతాడు.
అష్ట వర్షకన్యా పుత్రవత్పాలితామయా
ఇదానీం తవదాస్యామి దత్తాం స్నేహేన పాలయ II

పుత్రునితో సమానముగా పెంచబడిన ' 8 సం.ల వయస్సు గల
ఈ కన్యను నీకిచ్చుచున్నాను. నీవు ఈమెను
ప్రేమాభిమానాలతో కాపాడుము.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
అమ్మాయి కి 8 సం.రాల వయస్సు వచ్చినంతనే ఆమె
కన్యగా పరిగణించ బడుతుందనీ. ఈ వయస్సు వచ్చునాటికి
కన్యాదానము జరగాలని, మనుధర్మశాస్త్రం చెపుతుంది.
కన్యానం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం II
దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోక జగీషియాII

బ్రహ్మలోకమును సాధించుట కొరకు, సువర్ణ సంపద గలదియు,
సువర్ణాభరణములచే అలంకరింపబడినదియు
అగు ఈ కన్యను సాక్షాత్ విష్ణు స్వరూపుడగు
నీకు ఇచ్చుచున్నాను.
విశ్వంభర: సర్వభూతా: సాక్షిణ్య: సర్వదేవతా:
ప్రదా స్యామి పితృణాం తారణాయవై.

దైవము, పంచభూతములు, సమస్త దేవతల సాక్షిగా
పితరులు తరించుటకు ఈ కన్యను దానము చేయుచున్నాను.
కన్యాం సాలంకృతాం సాధ్వీం. సుశీలాచ,సుధీమతే
ప్రయతోహ్నం ప్రయ చ్చామి ధర్మకామార్ధ సిధ్ధయే II

అలంకారములతో కూడినదియు, సాధుశీలయగు
ఈ కన్యను ధర్మకామార్ధ సిధ్ధి కొరకు పూనుకొని నేను ఈ సుశీలుడగు
బుధ్ధిమంతునుని దానము చేయుచున్నాను.
తుభ్యం ప్రజా సహత్వ ధరంభ్య: ప్రతిపాదయామి
సంతతి ని పొందుటకు, కర్మలకొరకు నీకు ఈ కన్యను నియమించుచున్నాను.
కావున వృణీధ్వం వరింపవలసింది. వృణీమహే: వరించుచున్నాను. అని వరుడు బదులు పలుకుతాడు.
వయోదాత్రే మయోమహ్యం అస్తుప్రతిగృహుత్వే

కన్యనిచ్చిన దాతకును, స్వీకరించిన నాకును బాంధవ్యము కలుగుగాక.

కన్యాదానమందలి మరిన్ని వివరాలు మరో టపాలో

కొసమెరుపు
  1. Marriage is a three ring circus: engagement ring, wedding ring, suffering.
  2. There are two times a man does'nt understand a woman, before marriage and after marriage!