Tuesday, December 29, 2009

ఎందుకని...?

ఈ బాధని, వేదనని
ఎందుకు నింపుతావు నాలో
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే..

ఎందుకు నాకళ్ళని వర్షిస్తావు
నీ విరహపుటెడారులు నాలో
విహరిస్తున్నయనా

క్షమించు ప్రియా నిను
ప్రేమిస్తున్నానని అనలేను
ఎందుకంటే..అది
నీకు తెలియంది కాదు..

నిను చుంబించానని అనలేను
ఎందుకంటే..
చూడలేనంతగా నాకళ్ళు
మూతలు పడిపోయాయి.

నాకు తెల్సు
నను పొగడ్తలలో
ముంచెత్తినపుడు
నిజం చెప్పటం లేదని..

అయ్యో..
నీ తలపుల్లో
కాలం వేలి కొనలనుండి
జారి పోయిందే....

విడిపోదామనుకునే కొలదీ
బలపడి పోతూంది.
ఎందుకంటే..
నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే...




10 comments:

  1. భావ వ్యక్తీకరణ తీసుకున్న అంశానికి తగ్గట్టుగా బాగుంది.

    ReplyDelete
  2. bagundi.. photo kooda kavithaku thaggattugaa undi.

    ReplyDelete
  3. "నీ తలపుల్లో కాలం వేలి కొనలనుండి జారి పోయింది".

    చాలా బాగుంది.

    ReplyDelete
  4. "నన్ను నీలో ఎపుడో వొంపుకున్నానే"....చాలా బాగుంది. భావం కూడా ఎంతో బాగుంది, శ్రీనిక గారు.

    ReplyDelete
  5. శ్రీనిక గారూ !
    భావోద్వేగం వొలికించారు. అభినందనలు

    ReplyDelete
  6. శ్రీనిక గారూ !
    May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

    SRRao
    sirakadambam

    ReplyDelete
  7. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. చూడలేనంతగా నాకళ్ళు మూతలు పడిపోయాయి...
    కాలం వేలి కొనలనుండి జారి పోయిందే...
    నన్ను నీలో ఎపుడో వంపుకున్నానే....
    They are just beautiful. They are very delicate, sensitive and fine feelings. My hearty congrats to you for these wonderful expressions.

    ReplyDelete
  9. And a heart-shaped cloud is an additional attraction.

    ReplyDelete