హిందూ వివాహ ప్రాశస్త్యము
పదవ భాగము
బండికాడి:పదవ భాగము
దీనికొక కధ ఉంది. అపాల అను ఒక అవివాహిత
యువతికి వళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చి ఎవరూ
వివాహము చేసికొనలేదు. ఇంద్రుని గూర్చి యాగము చేసిన
అది తగ్గి పోవును. కాని వివాహము కానిది ఆ యాగము
చేయరాదు. అందుకు ఆమె విచారించుచు ఒక నదిలో
స్నానము చేయుచూ - ప్రవాహమున కొట్టుకొని
పోవుచుండగా సోమలత ఒకటి ఆమె దగ్గరికి కొట్టుకుని
వచ్చింది. ఆమె దానిని పళ్ళతో నమిలి ఇంద్రుని ఉద్దేశించి
నోటితో విడిచి పెట్టింది.
ఇంద్రుడు ఆ రసమును గ్రహించి జలమును తన రధము కాడి
రంధ్రము గుండా పోనిచ్చి ఆ జలమును ఆమెపై చల్లుతాడు.
రోగవిముక్తురాలైన ఆమెకు సూర్య వర్చస్సు వస్తుంది.
ఈ సంప్రదాయం లో
ఉత్తర దక్షిణముగా కాడిని పట్టుకొంటారు.
దక్షిణమున ఉన్న రంధ్రము గుండా వరుడు
నీటిని చల్లుతాడు. ఈ పవిత్ర జలములచే
వధువు పవిత్ర రాలగుతుంది.
"అవీరఘీ: ఉదచంతు అత:"
వీరులైన సంతతికి అరిస్టము కులుగకుండ
ఈ జలములు క్షాళనముచేయు గాక !
"ఖేఅనవ: ఖేరద: ఖేయుగస్య శచీపతే
అఫాలాం ఇంద్రత్రి: పూర్త్యకరత్ సూర్యవర్చసవ "
గగనమున పోల్చలేని రధమును నడుపు ఓ శచీపతి!
అపాలా(ఎవరి పాలనలో లేని) అయిన ఈమెను సూర్యుని
తేజస్సుగల దానినిగా మూడు మార్లు చేయుగాక.
తరువాత కాడి రంధ్రము గుండా బంగారము
(మంగళ సూత్రము) పోనిచ్చి నీరు చల్లుతూ
"శనై హిరణ్యం సము వంతు ఆప:
శనై మేధ భవంతు"
బంగారు వెలుగులు మెల్లగా జలమును
చేరి సారవంతముగాక .
మిగతా మంత్రములు వధువుని నూరు రెట్లు
పవిత్రురాలగుటకు, శాంతి నివ్వగలందులకు చెప్పును.
యోక్త్ర ధారణ : ( వధువును త్రాటితో చుట్టుట )
"ఆశాసానా సౌమనసం ప్రణాం సౌభాగ్యం తనుం
అగ్నే రనూరతా భూత్వాసన్న హ్యేనుకృతాయకం"
మచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని
మంచి తనువును కలిగి ఉండి అగ్నిహోత్రమున
నాకు సహచారిణివై సత్కా ర్య ములకు సంసిధ్ధువు కమ్ము.
మంగళ సూత్రధారణ:
వరుడు సంకల్పించి మాంగళ్యదేవతను ఆహ్వానించి
షోడశోపచారాలతో మంగళసూత్రమును పూజించును.
సభలోని వారిచే దానిని సృశింప చేస్తారు.
తరువాత వరుడు ఈ మంత్రం
చెపుతూ సూత్రమును కట్టును.
"మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి శుభగేత్వం జీవ శరదశ్శతం "
నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము
చేత నేను కంఠమున మాంగల్యమును కట్టుచున్నాను.
నూరు సం వత్సరములు జీవించుము.
తలంబ్రాలు మరో టపాలో.......
కొసమెరుపు:
1. In the first year of marriage,
the man speaks and the woman listens.
In the second year, the woman speaks and the man listens.
In the third year, they both speak and the neighbors listen.
2. Love is blind but marriage is an eye-opener.
బావుంది అక్క బండికాడి గురించి చక్కగా వివరించారు, అపాల కధ తో సహా...
ReplyDeleteకాకపోతే బండికాడి ఫోటో పెడితే బావుండు చూద్దాం అనిపించింది, అప్పటికీ అమ్మను అడిగాను, మనలో ఈ బండి కాడి సంప్రదాయం లేదురా వేరే విదంగా చేస్తారు అని చెప్పింది....
అయితే ఈ బండికాడి అనే సాంప్రదాయం ఆవిర్భావానికి ఆద్యురాలు ఆపాలా అన్నమాట అంతకు ముందు వరకు జరిగిన పెళ్ళిళ్ళలో ఈ సంప్రదాయం లేదు అన్నమాట.....
ఇకపోతే మొదటి కొసమెరుపు కెవ్వుఊఊఊఊఉ ..... కేక , ఈ కొసమెరుపు నిజమేనా అక్క :) :), నాకు పెళ్లైనప్పుడు జాగ్రత్త పడాలి కదా :) :)
నాదో చిన్న request అన్యదాభావించకండి..
ఏదో ఒక టపాలో మంగళ సూత్రం, కళ్యాణపు ఉంగరం,కాలిమట్టియలు , పట్టీలు, నల్ల పూసలు, నుదిటి బొట్టు,పసుపు కుంకుమలు, చేతి గాజులు, వడ్రాణం,అర వొంకీలు,ముక్కు పుడక వీటన్నిటి గురించి కూడావివరిస్తారా ?
మరిముక్యంగా గోరింటాకు దీని గురించి మాత్రం మీరు ఒక టపా రాయల్సినే మరి నా కోరిక మేరకు....
నాకూ వీటి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి అందుకే అలా అడిగేసా ఏమి అనుకోకండి...
www.tholiadugu.blogspot.com
ఈపద్దతి మాలోఉంది. అమ్మనాన్నవాళ్లది, అత్తలవి, పిన్నీవాళ్లవి పెళ్ళిఫోటోల్లో చూశాను. మాచిన్నమావయ్య పెళ్ళిలో చూసింది బాగాగుర్తునాకు. తీరా మాచెల్లిపెళ్ళిలో అసలు కాడె బదులుగు ఓమోడలుకాడెను పెట్టి కానిచ్చేశారు. నాకు కొద్దిగా అసంతృప్తి అనిపించింది.
ReplyDeleteఈ పద్దతి నేను చూసేను, బాగా వివరించారు అండి. కొస మెరుపు బాగుంది. :-)
ReplyDeleteకార్తీక్
ReplyDeleteతప్పకుండా రాస్తాను.నేనేమీ అనుకోను.
చైతన్య గారికి,
ధన్యవాదాలు.నిజమే..నిజానికి మీకదురయిన లాంటి అసంతృప్తి అనుభవమే ఈ టపాలకు ప్రేరణ.
భావన గారికి,
ఇలా అందరికీ తెలియాలనే నా ఆకాంక్ష.
ధన్యవాదములు.