Tuesday, December 15, 2009

అసలు కెసిఆర్ తెలంగాణా వాడేనా ?

నాబ్లాగులో అసలు రాజకీయాలగురించి చర్చించకూడదనుకున్నాను.
కాని వేడెక్కుతున్న రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే
ఒక తెలుగుజాతి బిడ్డగా
నాకు తెలిసిన విషయాలను
ప్రస్తావించడం నా కనీస ధర్మం అనిపించిది.

ఒక పార్టీలో తన అస్ఠిత్వాన్ని ఉనికిని కోల్పోయి తన
స్వార్ధ ప్రయోజనాల కోసం తె.రా.స.అనే ముసుగేసుకుని 2001 ఏప్రిల్ 27 న
ప్రజలలో లేని ఉద్యమ స్ఫూర్తి ని(1969 లోనే సమసిపోయింది)
రగిలించడానికి వచ్చిన కె.సి.ఆర్ ని పాపం తెలంగాణా ప్రజలు
గుడ్డిగానమ్మి గెలిపించి....మోసపోయి....ఓడించారు.
తెలంగాణా గురించి ఒక్కడుకూడా లేకపొతే ఎలా
అని సానుభూతి
చూపించి బొటాబొటి మార్కులతో పాస్ చేసారు.
తె.రా.సా. రాజకీయ పార్టీ కాదని , ఒక ఉద్యమ పార్టీ అని తనే ప్రకటించుకొన్నాడు.
కానీ ఈ రోజు ఏం జరుగుతున్నదేమిటి? దీనికాయనిచ్చే సమాధానం ఏమిటి?
దేశం లో ఏ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో అంటూ లేకుండా గెలిచిన ఏకైక పార్టీ తె.రా.స.
అధికార వ్యామోహమే తప్ప ఒక ఎం.పి. నిధులతో
ఒక్క సామోజిక కార్యక్రమం కూడాచేపట్టలేక పోయాడు.
ఇన్నళ్ళూ తన ఉనికి కోసం పాటుపడ్డమే తప్ప
తెలంగాణా ఉనికి కోసం పాటు పడిన దాఖలాలు లేవు.
ఇన్నయ్య, కెకె మహేంద్ర రెడ్డి, ప్రకాశ్ వంటి మేధావులు, నాయకులు
ఇపుడు కె.సి.ఆర్తో కలిసి ఎందుకు పనిచేయటమ్లేదు ?
ఒక్క జయ శంకర్ తప్ప ఆయనతో ఉన్న మేధావుల జాబితా ఏది?
తన కుటుంబానికి పార్టీతో సంబంధం లేదన్నాడుగా అది నిజమేనా?
ఇప్పుడు తనది కుటుంబ పార్టీ కాదా?
విద్యార్ధులలోకి గూండాలను చొప్పించి ఆంధ్రా ఆస్తుల్ని
ధ్వంశం చేయించిన కెసీఆర్ తినే తిండి ఎక్కడిది?
వెనుకబడి పోయింది అని అంటాడే..
యూనివర్సిటీలు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ తెలంగాణాలో ఆయనకు కనబడలేదా?
ఆంధ్రా ప్రాంతం వారు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించకపోయింటే వీరి పరిస్ఠితి ఏమిటీ?
ఆంధ్రా ప్రాంత ప్రజలు
తెలంగాణా విడిచి వెళ్ళాలని కెసిఆర్ ప్రకటించాడు.


అదే కనక జరగాల్సి వస్తే...

మొదట వెళ్ళాల్సిన వాడు..కె.సి.ఆరే...

ఎందుకంటే ఆయన జన్మ స్ఠలం విజయనగరం జిల్లా.

9 comments:

  1. >> "కేసీయార్‌ది విజయనగరం జిల్లా"

    ఆ సంగతి ప్రత్యేకవాదులకి తెలీదా ఏంటి. వాళ్లకన్నీ తెలుసు. ప్రస్తుతం కేసీయార్ వెంట నడుస్తారు, రేపో మాపో అతన్నీ 'ఆంధ్రా వలస దోపిడీదారు' అని తన్ని తరిమేస్తారు. చూస్తుండండి ;-)

    ReplyDelete
  2. ప్రజలందరూ సమైక్య ఆంద్రనే కోరుకుంటున్నారు... ఇదంతా రాజకీయ నాయకుల కుట్ర (ఆంద్ర మరియు తెలంగాణ వాళ్ళు అందరూ దొంగలే )

    రాజకీయ నాయకుల పున్యమా అని తోటి మిత్రులను కోల్పుతున్నానని ఒక తెలుగు విద్యార్ధిగా బాద పడుతున్నాను....

    అన్నట్టు అక్క మీ పేరు భావన ?

    ReplyDelete
  3. తెలంగాణాలో వెలమ దొర కులస్తులందరూ కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళే. వీళ్ళ ఇంటి పేర్లు కూడా కోస్తా ఆంధ్ర ఇంటి పేర్లే. కలువల, కలువకుంట్ల, ముప్పాళ్ళ, జలగం వగైరా. కె.సి.ఆర్. గారి ఇంటి పేరు కలువకుంట్ల అని ప్రత్యేకవాదులకి తెలియదా ఏమిటి?

    ReplyDelete
  4. ## ఆంధ్రా ప్రాంతం వారు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించకపోయింటే వీరి పరిస్ఠితి ఏమిటీ?...##########
    ఎవరిని ఉద్ధరించడానికి ఆంద్ర వారు ఇక్కడ పరిశ్రమలు , వ్యాపారాలు స్థాపించారు మిత్రమా?
    అట్లాగే బెంగుళూరు లో, చెన్నై లో ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు పెట్టుబడి దార్లు చేస్తున్న వ్యాపారాలు కూడా అక్కడి ప్రజలను ఉద్ధరిం చెందుకే చేస్తున్నారా?

    ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి.
    మీ పరిశ్రమల్లో మీ వ్యాపారాల్లో ఎవరు పని చేస్తున్నారో, ఎవరు లబ్ది పొందు తున్నారో.
    మీ భవనాలను కట్టే మేస్త్రీలు కూడా చివరికి కూలీలను కూడా ఆంద్ర నుంచే తెచ్చుకుంటారు.
    "బొమ్మన బ్రదర్స్" "చందనా బ్రదర్స్" ఎక్కడైనా చూడండి మీకు తెలంగాణా యాస కనిపిస్తుందేమో.

    దోపిడీని ఎంత అందంగా చెప్పినా దోపిడీ కాకుండా పోదు.
    కే సి ఆర్ కోణం లోంచి తప్ప తెలంగాణా ప్రజల ఆకాంక్షల కోణం లోంచి. తెలంగాణాకు అసలు అన్యాయం జరగడం ఎక్కడ మొదలైంది.? విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలేమిటి ? అని ఒక్క సారి అయినా చదివే ఓపికలేదు మీకు . ఎందుకీ ఆత్మా వంచనాత్మక డవిలాగులు. ?

    ReplyDelete
  5. కె.సి.ఆర్. పూర్వికులు 250 సంవత్సరాల క్రితం తెలంగాణాలో స్థిరపడ్డారు. అతనిది కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చిన కుటుంబమైనా అతను ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించలేడా?

    ReplyDelete
  6. అవునా కే.సి.ఆర్ ది విజయనగరమా? నాకీ విషయం బొత్తిగా తెలియదే. g.k. లో నేను పూర్తిగా వెనుకబడిపోయినట్లున్నాను.

    టపా అదిరింది. మీ ఉద్వేగం మీ రాతల్లో కనపడింది. :)

    ReplyDelete
  7. అబ్రకదబ్ర గారు,
    కరక్ట్ గా చెప్పారు.
    ఆ రోజు తొందర్లోనే ఉంది.
    @ కార్తీక్
    చిన్నవాడివైనా కరెక్టుగా చెప్పావు.
    నేను కోరుకునేది సమైక్యాంధ్రానే.
    ఇది ప్రజల్ని ప్రేక్షకులుగా చేసి ఆడుతున్న ఆట.
    ఉత్కంఠంగా చూసేస్తూంటాం.
    విచిత్రమేమంటే ఇది మాచ్ ఫిక్సింగ్ గేమని అందరికీ తెల్సు.
    అయినా ఎవరి టీమ్ ని వాళ్ళు సపోర్ట్ చేసేస్తూంటారు.
    @ సాయికిరణ్
    తమ ప్రొఫైల్ని తమరు ధైర్యంగా బహిర్గతం చేయలేక పోతున్నందుకు చింతిస్తున్నాను. సరే అది మీ ఇష్టం.
    1. ఎవరూ ఎవర్ని ఉధ్ధరించడానికీ...కాదు. ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. నేనన్నది అభివృధ్ధి గురించి..మీకు అర్ధం కాలేదనుకుంటాను.ఈ అభివృధ్ధి ఆయనగారికి కనబడలేదా అని అంటున్నాను. పోనీ ఇదేమీ అభివృధ్ది కాదు..అభివృధ్ధి అంటే ఇదీ అని ఆయన గానీ, వకాల్తా పుచ్చుకుని మీరు గాని శెలవిస్తే సంతోషిస్తాను.పాపం ఆయనకి ప్రజలంతా ఇంకా జంతుచర్మాలు కట్టుకుని విల్లంబులు చేతబూని ఆటవిక జీవనం గుడుపుతున్నట్లు కనిపిస్తూన్నారేమో..
    2. ఇది చాలా సూక్ష్మ విషయం. మనం బట్టలు టైలర్ కి ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తాం. అంటే ఒకరి నుండి నాణ్యమయిన సేవల్ని కోరుకుంటాం. అది మన హక్కు.. నేను మీ ఇంటి ఎదురుగానే ఉన్నాను. నాకు మీరు పనివ్వకుండా పక్కవీధి టైలర్కి ఎందుకివ్వాలి అనే టైలర్ని ఏమనాలో మీ వివేకానికే వదిలేస్తున్నాను.
    3. దోపిడి..ఈ పదాన్ని నేను వాడలేదు.కనీసం ఆ అర్ధం వచ్చే అంశం కూడా నా టపాలో లేదు.
    ఇక అన్యాయం, విలీనం, ఒప్పందం ప్రశ్నలకి జవాబులు కావాలి మీకు.ఏ అన్యాయం, ఏ విలీనం,ఏ ఒప్పందం సెలవీయండి.చదువుకుని సమాధానమిస్తాను.
    ప్రశ్నకు ఎదురు ప్రశ్నయే సమాధానం అని అనుకుంటున్న మీ తెలివితేటలకి జోహార్లు.
    @ ప్రవీణ్ కమ్యూనికేషంస్
    తమరి దగ్గర KCR గారి 250 సమ్వత్సరాల "వంశవృక్షం" ఉన్నందుకు చాలా సంతోషం.(KCR తో బేరం కుదుర్చుకోండి) 250 సంవత్సరాలనాటి భారతదేశపు భౌగోళిక,నైసర్గిక మాప్ లలో ఎవరికీ ఆంధ్రప్రదేశ్ ఎల్లలే కనిపించవు..కాని తెలంగాణా కనిపించిన మీ దార్శనికతకు శిరశాభివందనం.
    ఎందుకు వహించలేడూ?

    @ విశ్వప్రేమికుడు గారికి,
    ధన్యవాదములు.
    నిజమే, అలమండ గ్రామం లో పుట్టాడు.

    ReplyDelete
  8. @సాయి కిరణ్ గారు
    "మీ భవనాలను కట్టే మేస్త్రీలు కూడా చివరికి కూలీలను కూడా ఆంద్ర నుంచే తెచ్చుకుంటారు.
    "బొమ్మన బ్రదర్స్" "చందనా బ్రదర్స్" ఎక్కడైనా చూడండి మీకు తెలంగాణా యాస కనిపిస్తుందేమో."

    మీరు చాల చక్కగా చెప్పారు ఈ విష్యం ... అదే వీళ్ళు కనుక తెలంగాణా వాళ్లనే అందులో కూలీలు గా పెట్ట్టుకుని ఉంటే మీరు ఏమనేవారో చెప్పనా...
    " మీ భవనాలు కట్టే మేస్త్రీల కింద కూలీలు మా వళ్ళు , మీ షాపుల్లో నెలకు రెండు వేల రూపాయల కూలికి పని చేసే యువతీ ,యువకులుమా వాళ్ళు .
    మమ్మల్ని ఎదగ నీయకుండా మీ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు గా కట్టి పడేసారూ.. పెట్టుబడి దారీ వ్యవస్థ నడుపుతున్నారు ఆంద్ర ప్రాంతం వాళ్ళు ,దున్నేది మేము దోచుకునేది మీరు" అందుకే మేమే దున్నుకున్తున్నాం మేమే దాచుకున్తున్నాం....

    మాట్లాడే మాటలకు తిన్నగా మాట్లాడితే ఎవరికీ కోపం రాదు.. ప్రతేయ్క తెలంగాణా కోసం మీరు చేసిందేమిటి మొన్న, పొట్టి శ్రీ రాములు విగ్రహానికి చెప్పుల దండ వేసారు , ఆయనే లేక పోతే ఇంకమానం తమిళ్ వాళ్ళ కింద దాసోహం అంటూ ఉండే వాళ్ళం అప్పుడు ఈ ఆంద్ర ప్రదేశ్ ఉండేది కాదు అందులో బాగామైన మీ తెలంగాణా ఉండేది కాదు. ఆయన కాళ్ళు కాడికి ఆనీల్లు తాగినా మీ పాపం పోదు..

    ఇందులో ఆంద్ర నాయకులు చేసింది తప్పు కాదు అని నేను అనను, వీళ్ళు రెండు నాల్కల దొరని అవలంబించారు అందుకే ఇప్పుడీ కస్టాలు, నేను ఎంతోమంది నా ఆంద్రప్రదేశ్ (తెలంగాణా ) మిత్రుల్ని కోల్పోతున్నాను...

    కె. సె .ఆర్ చేసిన దీక్ష వెనుకున్న రహస్యం వస్తే తెలంగాణా వస్తుంది లేకపోతే పార్టీ కి sentimental గా లాబం చేకూరుతుంది అని అంతే అది గమనిస్తే మంచిది ...

    అయినా తెలంగాణా ప్రజలు కూడా అందరూ తెలంగాణా కోరుకోవడంలేదు ఆ విష్యం తెలుసుకొండి ముందు..
    కుటిల రాజకీయ నాయకుల మత్తులో పది మీ మనసుని చంపుకుని
    ఎందుకు ఈ డవిలాగులు ...

    ReplyDelete
  9. kcr di kadu vaala muthatha valadi vijaya nagaaram me laga alochinchaalante.darwin jiva parinama siddantham prakaaram chudali apudu manam e wastern ho leka africanso ae undali......

    ReplyDelete