
హిందూ వివాహ ప్రాశస్త్యము
తొమ్మిదవ భాగము
వివాహ బంధం నిండు నూరేళ్ళు పవిత్రంగా, అన్యోన్యంగా, ఏ అరమరికలు లేకుండా దంపతులు కలిసిమెలిసి జీవించడానికి తగిన నైతిక పునాదులు ఈ కన్యాదాన తంతులో కనిపిస్తాయి.తొమ్మిదవ భాగము
ఇక్కడ ప్రతి మంత్రానికి ఒక విశిష్టత ఉంది. వీటి అర్ధాలు తెలుసుకుని జీవించిన నాడు వైవాహిక జీవితంలో ఏ అనర్ధాలు ఉండవు.
కన్యాదానము గుణవంత మగుటకు సాలగ్రామమును దానం చేస్తూ...
కన్యాదాత : "ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య"
ధర్మాచరణమున నీవు ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వరుడు : "నాతిచరామి". అతిక్రమించి చరించను
క.దా : "అర్ధేత్వయా ఏషానాతి చరితవ్య" అర్ధాచరణమున నీవు ఈమెను
అతిక్రమించి చరించరాదు.
వ. : "నాతిచరామి"
క. దా : "కామేత్వయా ఏషా నాతి చరితవ్య"
కామాచరణమున ఈమెను అతిక్రమించి చరింపరాదు.
వ. : "నాతిచరామి"
ఇది అయిన తరువాత కొంతమంది గోదానము చేస్తారు.
ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా చెపుతారు.
శచీ పూజ ఎందుకు ?
సుమూహర్త సమయాన కన్యాదాత శచీదేవిని పూజించుచూ:
"దేవేంద్రాణి నమస్తుభ్యం
దేవేంద్ర ప్రియభామినివివాహం,
భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహిమే"
దేవేంద్రుని ప్రియురాలవగు నీకు నమస్కారము.
వీరికి వివాహము, భాగ్యము, ఆరోగ్యము,
సంతతి కలిగింపుము. అని ప్రార్ధించును.
తరువాత వధువును తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి
వరుని తెరకు పశ్చిమమున కూర్చోబెట్టి ఇరువురికి మధ్యవున్న తెరను
తొలగిస్తారు.
అపుడు వధూవరులు ఒకరి భ్రూమధ్యము మరియొకరు చూసుకుని
జీలకర్ర బెల్లమును ఒకరి నెత్తిన మరియొకరు ఉంచుతారు. వరుడు ఈ
మంత్రములు చెపుతాడు.
"ఆభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం బృహస్పతే
ఇంత్ర అపుత్రఘ్నీం లక్ష్యం తామప్యై సవితస్స :"
ఈమె సోదరులకు వృధ్ధికలగాలని వరుణుణ్ణి, లక్ష్మిని,
భర్త వృధ్ధిపొందుటకు బృహస్పతినీ
ఈమెకు పుత్రసంతానము కలదానినిగాచేయుటకు
ఇంద్రుణ్ణి ప్రార్ధిస్తాడు.
"అఘోరచక్షు: అవతిఘ్నీయేది"
శుభదృష్టి కలదానవుగాను, సౌభాగ్యవతిగాను వర్ధిల్లుము.
"శివా పశుభ్య: సుమనా: సువర్చాహా:
మన పశు సంపదకు శుభములు కలుగునట్లుగా మంచి
మనస్సుతో తేజస్సుతో వర్ధిల్లుము.
"వీరనూ: దేవకామాస్యోన శంనోభవత్ ద్విపదే శంచతుష్పదే"
వీరులగు పుత్రులను కాంచుము. దేవతలు ముచ్చటపడునట్లు
మెలగుము. మనకు మనపరివారమునకు, మన పశువులకు
శాంతి కలుగు గాక.
వరపూజ, కన్యాదానము, శచీపూజ తంతులు పూర్తయిన తర్వాత
కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్ణాలలో కాడి (రెండుఎడ్ల బండికి రెండు ఎద్దులను కలుపుతూ
వాటి మెడమీద వుండే పొడవైన కర్ర దూలము ) రంధ్రము నుండి జలమును చల్లి
మరికొన్ని మంత్రాలను పఠిస్తారు.
అవి మరో టపాలో....
కొసమెరుపు:
1. A woman worries about the future until she gets a husband. A man never worries about his future until he gets a wife!
2. When a man opens the door of his car for his wife, you can be sure of one thing: either the car is new or the wife.


బావుంది అక్క టపా... కొసమెరుపు భలే ఉన్నాయ్ :) :)
ReplyDeleteనేనొప్పుకోను నేనొప్పుకోను, తమ్ముడేమో నెలకో టపా, అక్కేమో రెండుమూడు రోజులకో టపా నేనొప్పుకోను నేనొప్పుకోను :) :) :)
ఇలా అయితే శ్రీనిక అక్క జట్టు పచ్చే కొట్టేస్త :) :)
మరి నేనో కొసమెరుపు చెప్పనా సరదాగానే మరి...
ఆడవాళ్లకు పెళ్లైందని తాళి లేక నల్ల పూసలు లేక కాలి మెట్టెలు చూస్తే తెలిసిపోతుంది. మరీ మగాళ్ళకు పెళ్లైందని ఎలా తెలుస్తుంది ?
పెళ్ళైన మగాళ్ళ మోహంలో ఆనందం కన్పించదు అంతే :) :)
అన్నట్టు నా బ్లాగ్ లో " సత్యం " టపాకి చివరిన నా వాణి మార్చాను.. అది నచ్చకే కొంత మంది కామేన్టకుండా వెళ్లి పోయారట ....
ReplyDeleteనాకు తెలిసి మీరు అందుకే కామెంట కుండా వెళిపోయి ఉంటారు, చదివి కూడా కదూ ! నాకు తెలుసులే :) :)