Sunday, November 29, 2009

మరో లోకం లో


మనం కలిసిన
ఆ మధుర క్షణాలు
ఏ కలలు, కల్పనలు లేని
మరో లోకం లో
మనం మనకోసమే
అనుకున్నాం

ఏదో ఒక రోజు
కాలం ఈ సందేశాన్ని
నీ ముందు నిలబెడుతుంది.
నీవు లేని
నన్నుని చూస్తావు
పుడమి ఎదపై ముద్దాడిన
మన పాదముద్రికలని
నువు చూడకపోవు
పొన్నాయి చెట్టుకింద
నీ వడిలో నానుదుట
రాలిన పూవు
నీ ముద్దుతో
పొందిన అమరత్వాన్ని
నువు గుర్తించకపోవు
మన గుసగుసలు
గాలి వినిపించక పోదు
కిలకిలరావాలలో
పరిమళించిన ఆశలు
వినబడకపోవు

నీ రాకకై ఈ తోట
పూల పానుపు
పరిచింది..
ఒక్క భ్రమరం కోసం
వలపు రంగులద్దుకుని
మత్తుగా నీకోసం
వేచి చూసే వేల సుమాల్లో
నను గుర్తించ గలవా ప్రియా...


3 comments:

  1. శ్రినిక అక్క బాగా రాసారు ..

    ఒక్క భ్రమరం కోసం
    వలపు రంగులద్దుకుని
    మత్తుగా నీకోసం
    వేచి చూసే వేల సుమాల్లో
    నను గుర్తించ గలవా ప్రియా...

    ఇది చాలా బాగుంది అక్క...
    ఏ పువ్వుకీ తనపై ఏ తుమ్మెద వాలాలో , ఎన్ని తుమ్మెదలు వాలాలో కోరుకునే అవకాసం లేదు
    కాని మీ కవితతో ఆ అవకాసం కల్పించారు ఒక పువ్వుకి..
    మీ ప్రతి కవితలో ఏదో కొత్తదనం కన్పిస్తూనే ఉంది అక్క...
    ఇలాగే కత్తగా అలోచించి రాస్తారని ఆశిస్తూ.. మీ తమ్ముడు ...

    WWW.THOLIADUGU.BLOGSPOT.COM

    ReplyDelete
  2. ధన్యవాదాలు కార్తీక్
    ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక టపా చేయలేక పోయాను.
    బ్లాగ్మిత్రులందరికి స్వాగతం.

    ReplyDelete
  3. అక్క ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ! మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఆశిస్తున్నాను...

    అన్నట్టు అక్క మీ బ్లాగు కూడలికి జత చేసారా చేయకపోతే ఇప్పుడే చేసేయండి అక్క ...
    ఇదే లింక్
    www.koodali.org

    ఇక్కడ మీ బ్లాగుని జత చేయండి అక్క....
    ధన్యవాదాలు.... బాయ్ అక్క ...


    www.tholiadugu.blogspot.com

    ReplyDelete