హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - బి
అన్ని అనుభవాల్లో పురుషుడు స్త్రీ సమానంగా ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి అర్ధాంగి అవుతుంది. ఈ వివాహ బంధం ఈ లోకంలోని ఈ జన్మలలో వీరిద్దరిని కలుపుతూనే ఉంటుంది. ప్రపంచ మానవ జీవితంలో ఆయా దేశాల్లో ఆయా సంప్రదాయాల్లో తేడాలున్నా వివాహమనేది ఒక విచిత్రబంధం. మన భారతదేశమ్లో నియమముగా బ్రహ్మచర్యాన్ని గడిపిన స్త్రీ పురుషులు సంఘ శ్రేయస్సును, తమ వంశ శ్రేయస్సును, తమ శ్రేయస్సును దృష్ఠిలో ఉంచుకొని, సకల ధర్మాలకు ఆశ్రయభూతమైన ఈ సంసారం చేసుకుంటారు. దీనిలో మానవ మనస్తత్వం లో ఎన్నో మార్పులు వస్తాయి. బాధ్యత పెరుగుతుంది.ఐదవ భాగము - బి
గురుకులం లో విద్యాభ్యాసం ముగించిన తరువాత శిష్యునికి గురువు
" ప్రజాతంతుం మావ్యవచ్చేత్పీ:"
నీ వంశ పరంపరను నశింపజేయకుము. ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమని ఆజ్ఞాపించును.
కనుకనే లోకజ్ఞుడగు మహాకవి కాళిదాసు రఘువంశ రాజులను వర్ణించుచూ..
ప్రజాయై గృహ మేధినాం "...... సంతానం కొరకే గ్రుహస్తులగువారని చెప్పినాడు.
సంతాన ప్రాప్తి అనంతరం వారికి గృహస్తాశ్రమ ఆశక్తి లేదని వాన ప్రస్థులగుదురని కూడ దీనిని బట్టి తెలుస్తుంది.
కనుక మానవ జీవితంలో సకల శ్రేయస్సులకు మూలభూతమైన వివాహబంధం చాలా ప్రశస్తమైనది.
కొసమెరుపు :
ఘనా దేశం లోని ' ఆసాంటే ' అనే తెగలో
వరుడు, వధువు ఇంటి కెళ్ళి తలుపు తడతాడు. లోపలున్న వధువు తిరిగి తలుపు తడుతూ సమాధానం ఇస్తే...వరుడి తల్లి , మేనమామ వధువు ఇంటికి వెళ్ళి వివాహ ప్రతిపాదన చేస్తారు.
వివాహ మంత్రాల అర్ధం...తరువాయి టపాలో...
sreenika gaaru bavundandi..
ReplyDeletenenu innallagaa eduru choosthunna tapa tharvathe kaavadam naaku aanandamgaa undi..
eduru choosthuntaanu tharvaatha tapa kosam..
maremi anukonante chinna soochana sreenika gaaru
pelli manthraala ardhalu okka pusthakam maaathrame chadivi ive ani roodi cheseyyakandi...
www.tholiadugu.blogspot.com
కార్తీక్ గారు
ReplyDeleteక్రమం తప్పకుండా నాబ్లాగులని చూసి నన్ను ప్రోత్సహించేవారిలో మీరు ముఖ్యులు. అందుకు ధన్యవాదములు.
మీ సూచన శిరోధార్యంగా భావిస్తున్నాను.
అయితే చిన్న మనవి.
ఏ పుస్తకమూ చదవకుండా,అవగాహన చేసుకోకుండా ఈ ప్రయత్నం చేయబూనలేదు. అది అసాధ్యం కూడా. ఈ వ్యాసాలు వ్రాయడానికి
నే చదివిన పుస్తకాలు, గ్రంధాలు..
పిడపర్తి వారి: హిందూ వివాహాలు-ఆచారాలు.
గొల్లపూడి భాస్కరాచార్యులు : మంత్రాలు-మహత్యాలు
గాజుల సత్యనారాయణ : హిందూ వివాహ ధర్మశాస్త్రము
(పెద్దబాలశిక్ష రచయిత)
తాపీ ధర్మారావు : పెళ్ళి - దాని పుట్టు పూర్వోత్తరాలు.
ఇక్కడ ప్రస్తావించే పద్యాలు జంబాహుళ్యంలో ఉన్నవి మాత్రమే. అసంఖ్యాకమైనవి ఉటంకరించాలంటే ఈ వ్యాస నిడివి అనూహ్యం.