నీవు లేని.....నాలో
ఏవో భావనలు
నను కమ్మేస్తూన్నాయి
మనిద్దరిని దగ్గర చేస్తూన్నాయి
నీకోసం
సాగరాన్నైనా ఈదగలను
గాలిని గుప్పిట పట్టి
ఎక్కడికైనా ఎగర గలను
కాని ....
నీవు లేని నా హృదయం
ఆకాశం లేని పక్షిలా
నీవు లేని నా ఆత్మ
తప్పిపోయిన లేడిపిల్లలా
నిను చూడని నాకళ్ళు
శిశువు త్రాగక నిండిన
తల్లి పాలిండ్లలా
నీవు లేని నా కన్నీళ్ళు
ఉదయం లేని
మంచు బిందువుల్లా..
అనంత దూరానికి
ఇరువైపులా
మనం
నువు
గుసగుసలాడినా చాలు
వినిపిస్తుంది
నా హృదయానికి కాదనకు ప్రియా.......
శ్రీనిక గారు బాగ రాసారు......
ReplyDelete"నీవు లేని నా ఆత్మ
తప్పిపోయిన లేడిపిల్లలా "
మంచి పోలిక ఇలాంటి పొలికలు చాలా తక్కువగా కనబడతాయండి
శ్రీ శ్రీ గారు ఇలా రాసారు
"ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాఉంది జాబిల్లి "
ఇది శ్రీ శ్రీ గారు కనిపెట్టిన కొత్త అలంకారం అన్నమాట....
కాబట్టి వ్యాకరణాన్ని కొత్త పుంతలు తొక్కించడం అనేది ఒక అద్భుతమైన కళ....
" కాని ....
నీవు లేని నా హృదయం
ఆకాశం లేని పక్షిలా "
ఎవరైనా రెక్కలు లేని పక్షి అని రాస్తారు ..లేకపొతే ఎగరలేని పక్షి అని రాస్తారు
కానీ మీరు కొత్తగా "అసలు ఆ పక్షికి ఆకాశమే లేదని రాసారు "
ఇదీ ఒకకొత్త ప్రయోగమే అరుదైన పోలిక కొ0చం అర్ధం చెపుథార...
అన్నట్టు నాబ్లాగులో కామెంటినప్పుడు మిమ్మల్ని అక్క అని సంబొదించాను మీ అనుమతి లేకుండ మరేమి అనుకోరుగా
www.tholiadugu.blogspot.com
శ్రీనిక గారు నన్ను మీరు అనకండి కార్తిక్ అని అనేయండి లెకపోతె తమ్ముడూ అనేయండి నాకు ఇంకా ఇష్టం ఎంతో ఆనందం :) :) ........
ReplyDeletewww.tholiadugu.blogspot.com
కవిత చాలా బాగుంది. మిత్రుడు కార్తీక్ చెప్పినట్లు
ReplyDelete" ఆకాశం లేని పక్షి - నీవు లేని నేను "
అనే పోలిక చాలా బాగుంది.
అనంత దూరంలో మీరిరువురూ ఉన్నా,అతను గుస గుస లాడినా వినిపించేంత చేరువలో ఉందన్నమాట మీ మనసు.ఎంత ప్రేమ!? :)
చాలా బాగుంది.
శ్రీనిక గారు. చాలా బాగుంది కవిత. కొంత్త పంధాలో ఉంది. పూర్తి శూన్యత కు ప్రతిబింబంగా ఆకాశం లేని పక్షి మంచి ఉదాహరణ గా ఉంది. ఇంతటి విరహం తప్పకుండా, ఎప్పటికైనా తీరిపోతుంది.
ReplyDeleteఅన్ని అద్బుతమైన ఉపమానాల మధ్య ఇదెందుకో కొంచెం పలుచగా అనిపిస్తోంది.
ReplyDeleteనీవు లేని నా ఆత్మ
తప్పిపోయిన లేడిపిల్లలా
గమనించారా?
కార్తీక్ గారూ
ఉదయం లేని
మంచు బిందువుల్లా..
నీవు లేని నా హృదయం
ఆకాశం లేని పక్షిలా "
రెండూ రెండు ప్రతిభావంతమైన పదచిత్రాలు. మంచుబిందువులు ఉదయాలు పరస్పరం విడదీయలేని విషయాలు. నీవనే ఉదయమే లేనపుడు మంచుబిందువునైన నా అస్థిత్వమెక్కడుంటుంది? ఉండదు గాక ఉండదు. కదూ?
ఇదే అన్వయం పక్షికీ ఆకాశానికీ కూడా.
శ్రీనిక గారు మంచి కవిత. బ్లాగుల్లో అరుదుగా కనిపించే కవిత్వం. అభినందనలు.
భవదీయుడు
బొల్లోజు బాబా
@ కార్తీక్
ReplyDeleteబాబా గారు ఇచ్చిన వివరణ సరి పోయిందికదూ..అంత ఆప్యాయంగా అడిగినపుడు ఎవరు కాదనగలరు తమ్ముడూ...
@ విశ్వప్రేమికుడు గారు,
ధన్యవాదములండి
@ జయ గారూ,
మీ వివరణ కవితకు మరింత గాఢతనిచ్చింది.
@ బాబా గారూ
Excellent sir, really you excelled yourself
you took my words out of my mouth.
Excellent interpretation.
Thank you sir..
keep visiting please..
@ బాబా గారు,
ReplyDeleteఅన్నట్టు మర్చిపోయాను,
కొంచెం పలచనైనప్పటికీ....
Bavundi.
ReplyDeleteబావుంది.
ReplyDeleteఒక మంచి అమ్మాయిని చూసి ఇచ్చేస్తా .
పర్మిషన్ ఇస్తారా
కాపీ రైట్ అంటారా
చాలా బావుంది శ్రీనిక గారు.
ReplyDeleteమీరు వాడిన సరళమైన పదాలు, రమణీయమైన ఆ ఉపమానాలు, వాటికి బాబా గారు చెప్పిన వివరణ చాలా బావునాయి. నా లాంటి వాడు ఇక్కడ నుండి ఎంతో నేర్చుకోవాలి.
Srinka gaaru chaala thanks andi.... naa moorkhatwaaniki xaminchanDi...
ReplyDeletenaa asahaayata enti antey mee mail id teliyaka pOvatam... telijesthey santoshistaanu... mee blog ni nishitangaa chaduvutunnnaanu... meeku naa dhanyavaadaalu.... mee sunnitahRdayaaniki marO saari namaskaristunnaanu....
pls delete it once it is read.....
thank you for listening...
have a great day...
వాసు గారు
ReplyDeleteధన్యవాదాలండి
మావూరు గారు,
బాగోదండి, ఆల్రెడీ ఎంగిలి అయిపోయిందిగా ?
ఫణి గారు,
ధన్యవాదాలండి..
నరసింహమూర్తి గారు,
ధన్యవాదాలండి. మీ అభిమానానికి చాలా ధాంక్స్.