ఏ గది మూలనో
అలజడి రేగి
రాత్రి అదే సమయానికి
కిటికీ తెరిచే సరికి
ఎదురింటి గుమ్మంలో
అఛిద్రమైన చీకట్లో
నాకోసం
నీవు...
కాలం జారిపోతూ
చిదిమిన చివరి
క్షణం నుండి
నీ కోసం
నేను...
చేరువయ్యే కొద్దీ
దూరమై
దూరమయ్యే కొద్దీ
చేరువయ్యే మనకి
ఎచటి నుండో
మూగ రాగాలు
మోసుకొస్తూంది ఆమని
నేనేనా...
ఈ విరితావులపై
ఇంద్రధనుస్సు
వలిగిపోయిందేమో...
నీ కురుల పానుపు మీద
పవళించాలని
పూలన్నీ మత్తుగా
నీ కోసం...
ఏ అనుభవమైనా ఎప్పుడూ కొత్తగా ఉండడం, చాలా అతీతమైన అనుభూతి. బాగుంది.
ReplyDeleteశ్రీనిక గారూ !
ReplyDeleteభావాల రాగాల కవిత బాగుంది.
చాలా చాలా బావుంది... ఒక అందమైన అనుభూతిని కలిగించింది. అస్వాదించేలోపే కవిత అయిపోయింది. :(
ReplyDeleteచాలా బావుంది. అభిసారిక హృదయాన్ని ఆవిష్కరించారు.
ReplyDeleteజయగారు,
ReplyDeleteధన్యవాదాలండి
ఎస్ ఆర్ రావు గారు,
చాలా ధాంక్స్ అండి.
బృహస్పతి గారు,
ధన్యవాదాలండి.
కెక్యూబ్ వర్మ గారు,
ధన్యవాదాలండి.