Monday, November 2, 2009
నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్
నో... హి షుడ్ స్పీక్ ఇం గ్లిష్ దట్సాల్
గత వారం రోజులనుంచి బ్లాగుల్లో వచ్చే విషయాల్లో ముఖ్యంగా " ఐ నెవర్ స్పీక్ తెలుగు " గురించే..
ఇదిలా ఉంటే...దాదాపు రాష్ట్రం లోని చాలా పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ లోనే మాట్లాడాలనే నిబంధనని పాక్షికంగా సడలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే మా పాఠశాలలో ఈ విషయంలో ఎప్పుడూ ఎటువంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. కేవలం పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వివిధ రకాలయిన కార్యక్రమాలను నిర్వహించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ రంగం లో నిష్ణాతులను రప్పించి దాని ఆవశ్యకతని తెలియచేయడం నిత్యం జరు గుతూంటాయి.
ఏదో ఒక టాపిక్ ఇచ్చి విధ్యార్ధు లందరిచేత మాట్లాడిస్తాం. వారి తప్పుల్ని తెలియజేస్తాం. ప్రోత్సాహక బహుమతులిస్తాం.
ఇంకా చెప్పాలంటే...బహుసా రాష్ట్రంలో స్పోకెన్ ఇంగ్లిష్ ఒక సబ్జక్ట్ గా బోధించే అతికొద్ది పాఠశాలల్లో మాదీ ఒకటని గర్వంగా చెప్పగలను.
సిడి ల ద్వారా ఎంతో సమాచారాన్ని వారికి అందచేస్తాం.
గత రెండు సం.రాలుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు నిర్వహించే స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షలకు ఇష్టమున్న విద్యార్ధులకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
మరో విషయమేమంటే..గత సం.రం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి అనుబంధ సంస్ఠ(MaaRs International) వారు నిర్వహించిన " స్పెల్ బీ ఇంటర్నేషనల్ " పోటీలలో దేశవ్యాప్తంగా వందల పాఠశాలలు పాల్గొన్నాయి. మా పాఠశాల పిల్లలు రాష్ట్రస్థాయి, అంతరాష్ట్రీయ,అంతర్జాతీయ స్థాయిలో 1,2,3.... స్థానాలు కైవశం చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఒక పేరెంట్ కలిసారు. తన కొడుకు ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ..
మేడం. మా అబ్బాయి కొంచెం స్లో లెర్నర్. అన్ని సబ్జక్టుల్లోను ఏవరేజ్ గా ఉన్నాడు.
ఫర్వాలేదు. పికప్ అవుతాడు లెండి. ఇపుడిపుడే అలవాటు పడుతున్నాడు.
I know his improvement is slow but steady. అన్నాను.
అంతేకాదు మేడం. వాడికసలు ఇంగ్లీషు మాట్లాడడమే రావట్లేదు. మా చెల్లెలుగారి పాప మా బాబు లాగే ఏడో తరగతి ఫలానా______ స్కూల్లో చదువుతూంది. తను ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడుతాది. బాబుకెందుకు రావట్లేదు.
వస్తుంది. మీరేమీ ఖంగారు పడనఖ్ఖర్లేదు. నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటాడు.
లెర్నింగ్ అనేది నిదానంగా జరుగుతుంది కాని దాని ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి.
కాబట్టి మీరు ఆందోళన చెందకండి. తను తప్పకుండా మాట్లాడగలడు.
అంటే..ఈ వారం వార్తల్లో వచ్చిన ఇంగ్లీష్ స్పీకింగ్ కధనాలని బట్టి....మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నిర్వహించే కార్యక్రమాలు సడలిస్తారేమోనని....
అదేం లేదండి..మీకు తెల్సు మాది నిర్బంధ విద్య కాదు. కాబట్టి ఎటువంటి సడలింపులు ఉండవు.
ఆ విషయం తెల్సు. మేడం. We joined him English medium for getting used with English. We are paying thousands and thousands.
ఇంగ్లీష్ మాట్లాడడం రాక పోతే భవిష్యత్తు అంధకారమే కదా.
So I don't know anything. He should speak in English....
ఇలాంటి పేరెంట్స్ ని చూస్తే.....
Subscribe to:
Post Comments (Atom)
శ్రీనిక గారు అంతేనండి ఇంగిలి పీసు రాక పోతె రేపు పిల్లలకు జాబ్ రాదని వాళ్ళ భయం....
ReplyDeleteఆ ఆ... ఇలాంటి పేరెంట్స్ నీ..... చెప్పండి చెప్పండి
www.tholiadugu.blogspot.com
మీ కృషికి అభినందనలు. తల్లిదండ్రుల ఓపిక లేనితనాన్ని సొమ్ము చేసుకుంటున్న వారి గురించే మా ఆందోళన. భాష మాధ్యమికంగా వినియోగింపబడినంతవరకు ఎవరికీ అభ్యంతరముండదు. కానీ అదే జీవితాధారంగా భావించే వాళ్ళతోనే ఈ ఇబ్బంది. http://sahacharudu.blogspot.com/
ReplyDelete