హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఏడవ భాగము
వివాహ మంత్రాల అర్ధము
ఏడవ భాగము
వివాహ మంత్రాల అర్ధము
మరికొన్ని మంత్రాల అర్ధాలను ఇక్కడ చూద్దాం.
వధూవరుల గోత్రాలు తెలిపిన తర్వాత...
" ధర్మప్రజా సంపత్యర్ధం పృణీమహే"
(ధర్మ సంతాన సంపద కొరకు ఈ కన్యను
ఎన్నుకొనుచున్నాను) అని వరుడు అనగా:
"వృణీధ్వం దా స్వామి"
(ఎన్నుకొంటిరి గావున ఇచ్చుచున్నాను)
అని కన్యాదాత అంటాడు.
" కృతార్ధావయం "
(కృతార్ధులయినాము)
అని కన్య వెదికినవారవరైనా ఉంటే వారంటారు.
అపుడు వరుడు....
" శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ధర్మ ప్రజా
సంపత్యర్ధం : స్త్రీయం ఉద్వహే"
(శ్రీ పరమేశ్వర ప్రీతి కొరకు, ధర్మ సంతానము
కొరకు ఈమెనువివాహం చేసుకొనుచున్నాను.
అని అంటాడు.)
లక్ష్మీనారాయణ స్వరూపుడుగా కన్యాదాత వరుని పూజించును.
కాళ్ళు కడిగినపుడు
' ఆవ: పాదావనే జనేర్ ద్వివంత నిర్దహంతుమే'
(ఈ పాదములను రక్షించు దేవతలను
సంకల్పించు ఈ జలములునా శత్రువులను
నిశ్శేషముగా దహింతురు గాక.)
రెండు పాదములను కడిగి అర్ఘ్య పాద్యాదులు
అయిన తరువాత మధుపర్కం (తీయని పానీయం )
మూడు సార్లు వరుడికి కన్యాదాత ఇస్తాడు.
మరికొన్ని మంత్రాల అర్ధాలు మరో టపాలో...
కొసమెరుపు:
కళ్ళు రెండూ తెరచి ఉంచు పెళ్ళికి ముందు,
సగం మాత్రమే తెరువు పెళ్ళితర్వాత. ........బెంజమిన్ ఫ్రాంక్లిన్
Marriage is the institution where the woman loses her the name and the man his solvency ~ Anonymous
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ధర్మ ప్రజా
ReplyDeleteసంపత్యర్ధం : స్త్రీయం ఉద్వహే"
ఇంతేనా మా అన్న పెళ్ళి లో ఇంకా తరువాత కూడా చెప్పినట్లు గుర్తు ఆయన పెళ్ళి లో ఎంతో ఓపిక గా ఒక్కొక్క మంత్రానికి అర్ధమ్ చెప్పేరు అందుకని గుర్తు వున్నాయి.
ఏవిటండి శ్రీనిక గారు చాలా రీసర్చే చేస్తున్నారు. మొత్తానికి కష్టపడకుండా మీ దగ్గిర చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకో గలుగుతున్నాను. థాంక్స్.
ReplyDeleteఅక్క బాగున్నాయ్ అక్క చక్కగా వివరించారు...
ReplyDeleteఅన్నట్టు భావన అక్కకు ఎం చెప్తారు సమాదానం ఆ మంత్రాలు ఇంకా ఉన్నాయ్ అట.... :)
మీరేం చెప్తారో కాని నాకు తెలిసిన పరిధిలో, నా మట్టి బుర్రలో ఒక సమాదానం ఉంది అది చెప్తాను ఎం అనుకో కూడదు మరి నా బ్లాగింట్లో వీళ్ళ పెతతనమేమితని :)
భావన అక్క హిందువులందరికీ ఒక basic సెట్ అఫ్ మంత్రాలున్తాయ్
అయితే మీ అన్నయ్య పెళ్ళిలో ఇంకా ఎక్కువ మంత్రాలు , చెప్పటానికి కారణం...
ఈమంత్రాలు ఒక కులం నుంచి మరో కులానికి, ఒక మతం నుంచి మరో మతానికి కొన్ని చేరుస్తారు, కొన్ని కోసేస్తారు అన్నా మాట.
అంటే శైవ మతంలో ఉన్న కొన్ని మంత్రాలు, విష్ణు మతం వాళ్లకు చదవరన్న మాట .. చదివారో అంతే విష్ణు మతంవాల్లందరూ GRRRRRRRRRRRRRRRRRRRR అంటారు :)
అలాగే వీల్లును....
కావాలంటే చూడండి బ్రంహ కులంవాల్లకి ఏఏఏఏఏఏఏఏఏఏఏఏ....క్కువ మంత్రాలున్తాయ్..
వేరేకులాల వాళ్లకి అన్నున్దవన్న మాట :)
మరో విషయమేమిటంటే ఆ పంతుళ్ళ విజ్ఞాన పరిదిని బట్టి కూడా ఉంటుందన్న మాట కోతలు, మరిన్ని మంత్రాలు చేర్చడాలున్ను.
WWW.THOLIADUGU.BLOGSPOT.COM
భావన గారు
ReplyDeleteమీరన్నది కరక్టే. ఇంకా చాలా మంత్రాలున్నాయి. అవన్నీ ప్రస్తావించాలంటే ఈ వ్యాస నిడివి చాలా పెద్దదైపోతుంది. కేవలం జనబాహుళ్యంలో ఉన్నవి మాత్రమే ఉటంకిస్తున్నాను. వీటిపై మరింత తెలుసుకోవాలనుంటే..ఈ క్రింది పుస్తకాలను రిఫర్ చేయండి.
పిడపర్తి వారి: హిందూ వివాహాలు-ఆచారాలు.
గొల్లపూడి భాస్కరాచార్యులు : మంత్రాలు-మహత్యాలు
గాజుల సత్యనారాయణ : హిందూ వివాహ ధర్మశాస్త్రము
(పెద్దబాలశిక్ష రచయిత)
తాపీ ధర్మారావు : పెళ్ళి - దాని పుట్టు పూర్వోత్తరాలు.
కార్తీక్ చెప్పింది కరక్టే..వివాహ ఆచార వ్యవహారాల్లో శైవులకి, వైష్ణవులకి స్వల్ప తేడాలున్నాయి.
ధన్యవాదములతో....
జయగారు,
your comments are really encouraging. Thank you.
తమ్ముడూ కార్తీక్,
నీది మట్టి బుర్రేమీ కాదు. నీదైన శైలిలో చాలా చక్కగా విశ్లేషించావు.
ఒక చిన్న సూచన. మరికొంత ప్రాక్టీసు చేస్తే తెలుగు టైపింగు పెరెఫెక్ట్ అయిపోతావు.