Tuesday, December 22, 2009

పెళ్ళి పుస్తకం - 11



హిందూ వివాహ ప్రాశస్త్యము
పదకొండవ భాగము
తలంబ్రాలు:

పెళ్ళిళ్ళలో చిన్నలకు పెద్దలకు వేడుకగా కనపడే
తలంబ్రాలు కార్యక్రమం వెనుక ఎంత రహస్యం దాగి ఉందో
అప్పుడు చెప్పే మంత్రాలను చూస్తే మనకు తెలుస్తుంది.

తలంబ్రాలు పోసుకునేటప్పుడు వరుడు ఈ క్రింది మంత్రం చెప్పి
ముందు వధువు నెత్తిపై తలంబ్రాలు పోస్తాడు.

1. " ప్రజావే కామస్స వృధ్యతాం "
' నేను కోరిన సంతానము సమృధ్ధిగా నుండుగాక '

తరువాత వధువు ఈ క్రింది మంత్రాలు చెప్పి వరుని నెత్తిపై
తలంబ్రాలు పోస్తుంది.

2. " పశవో మే కామస్స మృధ్యతాం "
' నాకిష్టమైన పాడి పంటలు సమృధ్ధిగా నుండుగాక '

వరుడు ఈ క్రింది మంత్రాన్ని చెప్పి వధువు నెత్తిపై
రెండవ సారి తలంబ్రాలు పోస్తాడు.

3. " యజ్ఞోమే కామస్సమృధ్యతాం "
' నాకిష్టమయిన త్యాగం సమృధ్ధిగా నుండుగాక '

తరువాత ఇద్దరూ ఈ క్రింది మంత్రం చెప్పి తలంబ్రాలు
పోసుకుంటారు.

4. " శ్రియోమే కామస్సమృధ్యతాం "
' మాకు కావల సిన ధనం సమృధ్ధిగా నుండుగాక '

బ్రహ్మగ్రంధ్రి లేదా బ్రహ్మముడి :

హోమసమయమ్లో దంపతులిరువురు విడిపోకుండాను,
దూరం కాకుండాను పురోహితుడు ఇరువురి కొంగులను ముడి వేస్తూ
ఈ మంత్రమును చదువుతాడు.

" ధృవంతే రాజ వరుణో ధ్రువంతెనో బృహస్పథి:
ధ్రువంచ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర ధారయతాంధ్రువం "

ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు రాజగు
వరుణుడు,దేవుడగు బృహస్పతి, ఇంద్రుడు
అగ్ని స్థ్రిరత్వమును కలుగుజేయుదురుగాక!

" గృహ పత్నీ హధా సోవశినీత్వం విదధం ఆవదాసి "

' ఇంటి యజమానురాలుగా సర్వమునకు పెత్తనము వహించి
తీర్చిదిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము '
అని వరుడు వధువు చేయి పట్టుకొం టాడు.

పాణి గ్రహణము మరో టపాలో

కొసమెరుపు:

1. Women are unpredictable. Before marriage,

she expects a man, after
marriage she suspects

him, and after death she respects him.


2. "What's the matter, you look depressed."

"I'm having trouble with my wife."


"What happened?" "She said she wasn't

going to speak to me for 30 days.


" But that ought to make you happy."

"It did, but today is the last day."



2 comments:

  1. శ్రీనిక అక్క అంత అర్ధం ఐంది కాని
    ఇక్కడ దాంపత్య సామ్రాజ్యానికి రాజు "వరుణుడు " ఎందుకని ?
    ఎప్పటిలానే కొసమెరుపు బావుంది మరి ముఖ్యంగా రెండోది :) :)

    ReplyDelete
  2. కార్తీక్
    ఇక్కడ దాంపత్య సామ్రాజ్యానికి రాజని కాదు.
    దంపతులకు రాజు వరుణుడు, దేవుడు బృహస్పతి.....అని.

    ReplyDelete