Thursday, September 2, 2010

అమర శేఖరుడు

ఆయన మనకిక లేరు..అను భావన మన మస్థిష్కాలలో ఇంకా ముద్ర పడకుండానే సంవత్సరం గడిచిపోయింది. బహుసా ఇది అసాధ్యమేనేమో..ఎందుకంటే ఆయనను ఎలా మర్చి పోగలం. అఖిలాంధ్ర ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న ఆయన మనకిక లేరనేది ఒక తీపి అబధ్ధం. నిజానికి మరణం మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని దగ్గర చేస్తుంది.
గత సం వత్సరం ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన సందర్భం లో నా బ్లాగులో పోస్టు పునర్ముద్రిస్తున్నాను...
రోజూ కనిపించే
మీరు......
సమాధిలోకి వెల్తున్నపుడు
మీచుట్టూ ఎవరూ ఉండరు
ఎవరూ ఏడ్చినట్లనిపించదు
ఏ ప్రార్ధనలు మీకు వినబడవు
ఎన్నో ప్రశ్నలు మాత్రం
మీ చుట్టూ నాట్యం చేస్తూంటాయి
మీ పార్ధివ శరీరం బూడిదయి పోతూంటే
మీకేమీ బాధనిపించదు...
రెండోరోజుకల్లా మీ ఫోటో
చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది...
మీకందరూ కనిపిస్తారు
మీరెవరికీ కనపడరు...
పరామర్శల ముసుగేసుకుని
వచ్చేవారందరూ
ఫోటో ఫ్రేములో బిగించిన
మిమ్మల్నిచూస్తూంటారు
అశ్రునయనాలతో
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ
వెళిపోతూంటారు...
ఎవరి బిజీ వారిది
మీరేమీ బాధపడినట్లుండరు...
పెరట్లో మీరు నాటిన మొక్కలు
అందమయిన పూలు పూస్తూంటాయి
పిల్లలు వాటినేచూస్తూ
ఆనందపడుతూంటారు
మీకేమీ బాధనిపించదు...
ముసలి చెట్ల స్థానంలో
కొత్త మొక్కలు మొలుస్తూంటాయి
ఈరోజెందుకో
మీరు బాధగా కనిపిస్తున్నారు
పాతసామాన్ల వాడి సంచిలో
ఇరుక్కుపోయిన మీ ఫొటో
మిమ్మల్ని చూసి జాలిపడుతూంటుంది....




7 comments:

  1. వావ్వ్.. చాలా ఆర్ద్రంగా వుందండి. ప్రతి మనిషి ఇంతేనేమో.

    ReplyDelete
  2. మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు...
    నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి
    ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు"గాంధీ" వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి..
    మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?
    మన బ్రతుకులు బాగుపడాలని చూసాడాయన..సరే కొందరన్నట్లు అతను " అవినీతిపరుడే" ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ??
    చనిపోయినవాళ్ళను కించపరచి వారి పేరుకి మచ్చతెచ్చి "భావి" తరాల పుస్తకాల్లో వారి పేరులేకుండా చేస్తే చివరికి ఆ "గాంధీ", "నెహ్రూ" తప్ప మన తర్వాతి తరాల వారికి మన "తెలుగు" బిడ్డలు" కకపోతే పోనీ, అసలు "నాయకులే" కనిపించరు..
    ఒక పీవీ, ఒకNTR , ఒకYSR మనవారు కాదా..

    వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి..
    అర్ధం చేసుకోండి..

    ReplyDelete
  3. చేసారే, అని చ్ప్తాను, చెప్పటమే కాదు కావాలంటే ఋజువులు కూడా ఇస్తాను.
    1. మొగలి పొదలతో, సహజ తీరప్రాంతంతో ఎంతో ఆహ్లాదం గా ఉండే మా చీరాల తీరాన్నంత వానపిక్ పేరుతొ అక్షరాలా 30 వేల ఎకరాలు, బడుగు, పేదల వద్దనుండి లాక్కున్న "మహా" నాయకుడు తను. ఎందుకంటే, తన సాక్షి పేపరుకు తెల్ల డబ్బు అవసరమయితే అది సర్దాడు అని మ్యాట్రిక్స్ ప్రసాద్ ను ముందు పెట్టి, మలేసియాలో ఓ కంపెనీ ని సృష్టించి మరీ, స్తానిక MLA కు వాటా ఇచ్చి మరీ బలవంతం గా లాకొన్నారు మన చచ్చిన "మహా" నాయకుడు. పొలం ఇవ్వమన్న వాళ్ల మీద మోటుపల్లి లో, ఏకంగా పోలీసులతో "నక్షలైట్" లని మరీకేసులు పెట్టించారు అక్షరాల దేముడు గారు. దీనిమీద భూమిక సత్యవతి గారు స్వయం గా పర్యటించి మరీ వేసిన టపా ఉంటుంది కావాలంటే చూడండి.
    ఇది తన స్వార్ధం కోసం, సామాన్య ప్రజల వద్దనుండి అవసరం లేకపోయినా పోర్ట్ పేరుతో లాక్కోవటం కాదా? ఇది నమ్మిన సామాన్య ప్రజలకు చేసిన అన్యాయం కాద ఈరభక్తులూ?
    2. పేరుకూడా వినబడని కంపెనీ ముసుగులో "సైన్స్ సిటీ" పేరుతో లక్ష ఎకరాలు లాక్కొనది ఎవరి దగ్గరనుండి, సామాన్య జనాల దగ్గరనుండి కాదా?
    3. ఇక వ్యక్తిగతం గా వస్తే, మా కుటుంబం లో ఓ స్థలం హైదరాబాద్ లో, ఇందు ప్రాజెక్ట్స్ దగ్గర కొంటే, పర్మిషన్లు మాత్రం మేము అధికారం లో ఉండగా మీకు ఇవ్వమని చెప్పి, ఏకంగా కొన్ని వందల మంది దగ్గర బ్లాక్మైల్ చేసి మరీ, స్థలాలు వాళ్లకు (జగన్ కంపెనీకి) డెవెలప్మెంట్ కు వ్రాయించుకొన్నారు, చచ్చిన "దేముడు" బ్రతికి ఉండగానే!!
    మరి, మేము కూడా రాజకీయనాయకులమే అంటారా? ఈరాభిమాని గారు?

    ఇలా చెప్పుకొంటూ పోతె సామాన్య జనాలకు చేసిన అన్యాయాలు ఎన్నొ? ముఖ్యం గా కోస్తా ప్రాంతం లో తీర ప్రాంతాన్నంతా ఎదో రకంగ కబళించి వేసాడు అతి కొద్ది కాలం లోనే అనెది చేదు నిజం.

    కాకపోతే కారణాలు ఏమయినా డిల్లీ కి ఎదురు మాట్లాడుతున్న జగన్ అంటే మాత్రం నాకు బోలెడు ఇష్టం గా ఉంది, అంత మాత్రాన చచ్చిన "పెద్ద" మనిషి సామాన్య జనాలకు అన్యాయం చేయలేదని మాతం ఒప్పోసుకొని మనలను మనం మోసం చేసుకోవద్దు. మనం ఎంత ఈరాభిమానులం అయినా అది అందరి నాయకులకు వర్తిస్తుంది, let us praise what they have done good, let us criticize frankly the mistakes they have made and accept the facts.

    ReplyDelete
  4. My above comment was in response to Srinivas's

    "మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?" question.

    ReplyDelete
  5. >>మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?

    నాకు కావలసినంత చేశారు..

    >>ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా??
    మన సొమ్ము కాదా? మరి ఆయన భోంచేసింది ఎవరు సొత్తు అధ్యక్ష? ఆయన కష్టపడి సంపాదించిందా? ప్రజలు ట్యాక్సులు కట్టిందా?

    ఒక పీవీ, ఒకNTR , ఒకYSR మనవారు కాదా.

    ముంది ఇద్దరు వదిలేస్తే. ఒకYSR, ఒక బాబు, ఒక అంతులే, ఒక వెంకటస్వామి, ఒక నిత్యానందా అందరిమీద బురద జల్లుడు వద్దు..

    ReplyDelete
  6. sreenika గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

    హారం

    ReplyDelete