Tuesday, September 30, 2014

శతవసంత వేడుకలు - విషాద వీచికలు (రవీంద్రుని నోబెల్ బహుమతి - ఒక అధ్యయనం)

శతవసంత వేడుకలు - విషాద వీచికలు 
(రవీంద్రుని నోబెల్ బహుమతి - ఒక అధ్యయనం)



రవీంద్రనాధ్ ఠాగూర్ భారతదేశపు సాహితీ దిగ్గజం, రచయిత, నాటక కర్త, గాయకుడు, సంగీత విద్వాంసుడు, విద్యాధికుడు, విద్యావేత్త, కవి, నటుడు, దర్శకుడు, ప్రయోక్త, వేదాంతి,విశ్వకవి, శాంతినికేతనం వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యసమరయోధుడు ఇంకా చాలా.... అంతేకాదు రవీంద్రుడు భారతదేశపు మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతని రచన గీతాంజలి కి నోబెల్ బహుమతి రావడం అందరికీ తెలిసిందే. 
అయితే ఈ పోస్టు విశేషమేమిటనుకుంటున్నారా ! 
సరిగ్గా నూరు సంవత్సరాల క్రితం నోబెల్ బహుమతి ప్రదాన కమిటే టాగోర్ కి నోబెలె బహుమతి ప్రకటించడం గమనార్హం.  అప్పటికి టాగోర్ నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడేకాదు. నోబెల్ బహుమతి గ్రహీతలలో ఐరోపా ఖండానికి చెందని మొదటి వ్యక్తి. ఆసియా ఖండానికి చెందిన మొదటి వ్యక్తి కావడం విశేషం . భారతీయ సాహిత్యానికి ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టిన వాడని యావత్ భారతమంతా గర్వపడుతున్నా, ఈ సంవత్సరం ప్రపంచమంతా శతవసంత  వేడుకలు జరుపుకుంటున్నా .... ఆనాడు రవీంద్రుడు మదిలో లేశమాత్రమైనా సంతోషం లేదంటే నమ్ముతారా?
నిజానికి ఈ అవార్డు రావడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అంతేకాదు ఒక దశలో ఈ అవార్డుని సున్నితంగా తిరస్కరించాడుకూడా! 

ఆయన జీవితం లోని కొన్ని సన్నివేశాలని చూస్తే ఇది అవగతమవుతుంది.
1913 వ సం వత్సరం నవంబరు 13 ఒక చల్లని ఉదయ సంధ్యవేళ నోబెల్ బహుమతి ప్రదాన కమిటీ నుండి టాగోర్ కి ఒక వర్తమానం అందుతుంది.
" అమోఘమయిన, సునిశితమైన, స్వచ్చమైన మరియు అందమైన పదజాలముతో మీరు రచించిన ' గీతాంజలి ' అను దీర్ఘ కవిత మమ్ములను మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన మీ అంగ్లానువాదము మా పాత్స్చాచ్య అంగ్ల సాహిత్యానికే మకుటాయ మానంగా నిలిచిందని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. రాబోవు డిశంబరు 10 న స్టాక్ హోం లో జరుగు నోబెల్ బహుమతి ప్రదానోత్సవానికి మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నము.."

కానీ టాగోర్ నోబెలె బహుమతి  స్వీకరణకు హాజరు కాలేకపోవడానికి కొన్ని కారణాలు.

అ.  అది మొదటి ప్రపంచ యుధ్ధం జరుగుతున్న కాలం. భద్రతా కారణాల రీత్యా విదేశీయానం అంత మంచిదికాదు.
ఆ.  భారత స్వాతంత్ర్య సంగ్రామం లో టాగోర్ చాలా చురుకైన పాత్ర వహిస్తున్న రోజులవి.
ఇ.  ఆంగ్లేయులకి వ్యతిరేకం గా సాగుతున్న పోరాటం లో తన పాత్రకి కళంకం రాకూడదనే సద్భావన.

టాగోర్ కి బదులుగా స్టాక్ హొం లో బ్రిటిష్ వ్యవహారాల ప్రతినిధి, రాయబారి క్లైవ్ నోబెల్ బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందుకుంటాడు.
ప్రతి నోబెల్ బహుమతి గ్రహీత తప్పనిసరిగా స్వీకరణ ఉపన్యాసాన్ని ఇవ్వాలి. కాని  ఆనాటి కార్యక్రమం లో క్లైవ్ టాగోర్ పంపిన ఏకవాక్య  టెలిగ్రాం ని చదువుతాడు.
అది ఇలా...
"దూరాలని దగ్గరచేసి, ఒక అపరిచితుణ్ణి సోదరునిగా భావించిన మీ స్వీడిష్ అకాడమీ (నోబెల్ బహుమతి ప్రదాన కమిటీ) వారి  విశాల దృక్పధానికి నా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. "
ఈ ఒక్క సన్నివేశం చాలు..టాగోర్ దృష్టిలో నోబెల్ పురస్కారానికి ఉన్న విలువెంతో.. 

ఈ వాక్యం లో తన బాధ (?)గాని, సంతోషలేమి  గాని తెలియనీయకుండా టాగోర్  ఎంతగా జాగ్రత్త పడ్డాడో.. ( ? )
మరిన్ని విశేషాలు  మరో టపాలో...


2 comments:

  1. హలో! ఏమయినారు?మీ టపా ఈ మధ్య రా(య)వట్లేదు.

    ReplyDelete
  2. హలో! ఏమయినారు?మీ టపా ఈ మధ్య రా(య)వట్లేదు.

    ReplyDelete