Sunday, January 1, 2012

నేను చూసిన రెండు రెండు వేల పన్నెండ్లు ...

నిన్న అన్నయ కి బాగాలేదని ఫోన్ వస్తే నేను జ్వరం తో కొద్దిరోజులుగా బాధ పడుతున్నా
కాకినాడ వెళ్ళాను.
రాత్రి 8.00 గంటలకి విశాఖ నాన్ స్టాప్ బస్సెక్కాను. బస్టాండు చాలా తక్కువమంది జనంతో ఏదో కోల్పోయినట్లుంది. నిజమే 2011ని కోల్పోతున్నాం కదా..దాన్ని వేడుక చేసుకునేందుకు ప్రజలందరూ బిజీగా ఉన్నారేమో. (నిరాశా వాదమా ??)
విశాఖ పట్నం ఎన్.ఏ.డి జంక్షన్లో అడుగు పెట్టేసరికి సరిగ్గా రాత్రి 12.00.. అప్పటికే అక్కడ చేరిన యువత కేరింతలతో బాంబుల మోతతో జంక్షన్ దద్దరిల్లుతోంది. జంక్షన్ నుండి నేను పెందుర్తి వైపు వెళ్ళాళి. ఆటో కోసం నిలబడ్డాను. నాలా బస్సు దిగినవాళ్ళు నలుగురైదుగురుం ఉన్నాం. మామూలుగా అయితే ఆ టైములో జంక్షన్ నిర్మానుష్యంగా ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తేనే గాని ఆటో దొరకదు. లక్కీగా ఒక కుర్రాడు ఆటో మా ముందుకి తీసుకొచ్చి ఆపాడు..
అందరం గబగబా ఎక్కేసాం. నరాల్ని కోసే స్తున్నట్లు చల్లగాలి. స్పీకర్లోంచి 100% లవ్ సినిమా సాంగ్స్ సన్నగా, మెలోడియస్ గా వినబడుతున్నాయి.
దారి పొడవునా మత్తులో ఊగిపోతూన్న కుర్రకారు మా ఆటోకి అడ్డంపడి మరీ మా అందరికీ హేపీ న్యూఇయర్ విషెస్ చెపుతూ ఆనందిస్తున్నారు.
మా ఆటో కుర్రాడు మాత్రం పైకి నవ్వుతూ విషెస్ చెపుతున్నా లోపల గంభీరంగా ఉన్నాడని పించింది.
నువు నీ ఫ్రెండ్స్ తో ఈ టైములో ఎంజాయ్ చేయకుండా ఆటో ఎందుకు వేసావ్.. ఉండలేక అడిగాను.
ఏం లేదు సార్... ఈ రోజుతో దీని ఫైనాంస్ తీరిపోయి రేపటి నుండి ఈ ఆటో నా స్వంతమవుతుంది సార్. ఈ రోజు కోసం ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తూన్నాను. నిజానికి ఇలా హేపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది సార్..
భాద్య్తత మరిచి మత్తులో తూలుతూ 2012 లోకి అడుగు పెడుతూన్న యువత ఒకవైపు ...
బాధ్యతని భుజాన్నెత్తుకుని లక్ష్యం దిశగా 2012 లోకి దూసుకు పోతూన్న యువత ఒకవైపు...

బ్లా గ్మిత్రులంద రికీ నూతన సమ్వ త్సర శుభాకాంక్షలు

10 comments:

  1. 2012 ఆరంభంలో మీ అనుభవం స్థిరత్వం, అస్థిరత్వం లని రెండు రకాల యువతల్లో చూపెట్టింది, మంచి అనుభవం!
    స్థిరంగా ఈ సంవత్సరం సాగాలని ఆశిస్తూ మీకు మా "నూతన సంవత్సర శుభాకాంక్షలు" !

    ReplyDelete
  2. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  3. శ్రీనిక గారూ,
    నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పోస్టు ద్వారా ఒక చక్కటి విషయాన్ని తీసుకుని అందులోని వైరుధ్యాన్ని బాగా చూపించారు. యువతని బాధ్యతా రహితంగా సమాజహితానికి సంభంధించిన విషయాలకు దూరంగా ఉంచడం లో ప్రభుత్వాలు కృతకృత్యులయ్యాయి. కుటుంబ సంస్కారాన్ని అలవరచుకున్న ఏ కొద్దిమందో ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. వారే ఆశాకిరణాలు.
    అభివాదములతో.
    మూర్తి

    ReplyDelete
  4. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. After a long time Srinika garu. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మంచి పరిశీలన. రెండు భిన్న జీవన విధానాలు ఒకే సమయంలో తారసిల్లినప్పుడు కలిగే అనుభవం యొక్క జ్ఞాపకం ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. లోతుగా గుచ్చుకొంటుంది కూడా.

    చక్కగా వ్యక్తీకరించారు. కొంచెం పొడిగిస్తే మంచి కథలా ఉంటుంది కదూ
    నూతన సంవత్సర శుభాకాంక్షలతో
    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. ఎంత బాగా రాశారండీ..
    ఒకే సమయములో రెండు విభిన్న జీవన విధానాలు మీకు అనుభవంలోకి రావడం...
    దాన్ని ఇక్కడ పంచుకోవడం... చాలా బాగుంది....

    ReplyDelete
  8. మీ రెందు రెందువేలపన్నెంద్లు చూసాను
    చాలా బాగుంది.మీ పరిసీలన బాగుంది.ఇది చదివిన తరువాత నాకు
    శ్రీ శ్రీ గారు రాసిన పాట గుర్తుకువచ్చింది.కొంతమంది యువకులు పుట్టుకతో
    వ్రుద్దులు,పేర్లకి,పుకార్లకి,షికార్లకి నిబద్దులు,కొంతమందియువకులు ముందు
    యుగం దూతలు భావన నవజీవన బ్రుందావన నిర్మాతలు,వారికి మా
    ఆహ్వనం,అ్టువంటి యువకులు రావాలి,కావాలి అవునా?

    ReplyDelete
  9. అయ్యో! ఇన్నాళ్ళు ఈ బ్లాగ్ చూడలేదే! నిజంగా బాధ పడుతున్నా! చాలా చాలా ఆలస్యంగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకంక్షలు. పోస్ట్ మనసును పట్టేసింది, నిలబెట్టేసింది.

    ReplyDelete
  10. బాధ్యత తెలిసిన యువత..ఆశాభావం చివురింత

    శ్రీనిక గారూ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    ReplyDelete