సంక్రాంతి వచ్చిందంటే
మా ఊరిలో దాచుకున్న
జ్ఞాపకాల మూటని విప్పుకుంటాను
అడుగడుగున గొబ్బెమ్మలు
అందమైన ఆడపడుచులు
గొబ్బెమ్మల ఆటపాటలు
గంగిరెడ్ల నృత్య విన్యాసాలు
డూడూ బసవన్న గంటల గలగలలు
హరిదాసుల హరినామ స్మరణలు
ఇలా ఎన్నో ఎన్నెన్నో
అదృ శ్య దృశ్యాల మీద
నగ్నంగా విహరిస్తూంటాను
నాఊరి గడప గడపనుండి
సంక్రాంతి సంస్కృతీ నది
వీధి వీధినా నడిచిన జ్ఞాపకం....
నగరీకరణ వరదలో
నా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా
బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
"నగరీకరణ వరదలో
ReplyDeleteనా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా"
chaalaa baagundi, sreenika
సంక్రాంతి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteబాగుంది
ReplyDelete