Saturday, January 14, 2012

నది నడచిన జ్ఞాపకం

సంక్రాంతి వచ్చిందంటే
మా ఊరిలో దాచుకున్న
జ్ఞాపకాల మూటని విప్పుకుంటాను
అడుగడుగున గొబ్బెమ్మలు
అందమైన ఆడపడుచులు
గొబ్బెమ్మల ఆటపాటలు
గంగిరెడ్ల నృత్య విన్యాసాలు
డూడూ బసవన్న గంటల గలగలలు
హరిదాసుల హరినామ స్మరణలు
ఇలా ఎన్నో ఎన్నెన్నో
అదృ శ్య దృశ్యాల మీద
నగ్నంగా విహరిస్తూంటాను

నాఊరి గడప గడపనుండి
సంక్రాంతి సంస్కృతీ నది
వీధి వీధినా నడిచిన జ్ఞాపకం....

నగరీకరణ వరదలో
నా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా


బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

4 comments:

  1. "నగరీకరణ వరదలో
    నా ఊరు..
    నీరు లేని నదిలా
    నగరంలో నేను
    నీరులేని చేపలా"

    chaalaa baagundi, sreenika

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. బాగుంది

    ReplyDelete