Sunday, May 6, 2012

సమూహం లో నేను..

సమూహం లో నేను
సమూహంలో సంచరిస్తూనే
ఒంటరినై  పోతూంటాను
దేహం లోని రక్తనాళాలన్నీ
హృదయం లోకే చేరుకున్నట్లు
ఒక్కరొక్కరూ నాలో కలసిపోతూంటారు
అపుడు నేను అనేక నేనులుగా
విడిపోయి నన్ను నేను
ఒక్కొక్కరిలో వంపుకుంటూంటాను
నేనంటూ ఏమీ మిగలకుండా..

సమూహం లో సంచరిస్తూనే
నన్ను నేను మొలకెత్తుకుంటూ
పూలని, ముళ్ళనీ పంచిపెడుతూ
నాదికాని ప్రపంచమ్లో
నాకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ
నేనొక చెట్టునవుతాను
నా నీడ నా అస్థిత్వాన్ని ప్రశ్నించినపుడు          
నేనొక శుష్క సౌధాన్నవుతాను..

6 comments:

  1. శుష్క సౌధం పద ప్రయోగం బాగుందండీ!

    ReplyDelete
  2. nice one andi... chala bagumdi

    ReplyDelete
  3. samooham lo sancharisthoo ontarinowtaanu bhaava prayogam baagundi

    ReplyDelete
  4. ఒంటరితనంలో ఒంటరితనం సహజం...
    నలుగురిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించడమే
    నిజమైన ఒంటరితనం...
    బాగా వ్రాశారండీ!
    @శ్రీ

    ReplyDelete
  5. వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. శ్రీనిక గారూ !

    మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

    శిరాకదంబం వెబ్ పత్రిక

    ReplyDelete