
నడుస్తున్న రోడ్డు
రెండుగాచీలిపోయిందంటే
రెండునాల్కల నగర
కుహరం లోకి ప్రవహిస్తున్నట్లే
రోడ్డుకిరువైపులా ఉండే
మహా వృక్షాలన్నీ మరుగుజ్జుల్లా
రోడ్డుమధ్యలో నిలబడ్డాయంటే
నగరీకరణ వరదలో
అస్థిత్వ వేదనకి అర్ఘ్యమిచ్చినట్లే
వేడి వేడి తారు చల్లచల్లగా
పచ్చని పొలాల్లోకి పారిందంటే
మనుగడపై సునామీలు మోహరించినట్లే
ఉపాధి అవకాశాల్ని
లారీల్నిండా మోసుకొచ్చి రాత్రికిరాత్రే
పల్లె పల్లెనీ తరలించుకుపోయిన
వైనం తెల్సునాకు...
నడకని, నడతనీ.......ఉనికినీ, ఉన్నతినీ
జోరుని, హోరునీ.....స్వచ్ఛతని, పవిత్రతనీ
సాగర సంగమంలో పోగొట్టుకున్న నది
భవన కూలీల చెమటలో
కరుగుతున్న పనిమనిషి కండల్లో
కూరల బండివాని అరిగిపోయిన చెప్పుల్లో
ఇంకా అక్కడక్కడా...
నా నది ఇంకి పోయిన
వైనం తెల్సునాకు...
చాలా బాగుందండీ కనుమరుగవుతున్న పంట చేల నుంఛి మాయమవుతున్న చిన్న వృత్తుల వాళ్ళ వరకు చాలా బాగా చిన్ని మాటలలో ఆవిష్కరించారు.
ReplyDeleteశ్రీనిక గారూ !
ReplyDeleteబావుంది అనలేను బాధ కలిగించారు అంటాను.... వర్తమాన చిత్రాన్ని ఆవిష్కరించి.మీకు ఒక శ్రీ ఎలాగూ వుంది. ఇలాగే కృషి చేసి మరో ' శ్రీ ' ని సొంతం చేసుకోండి.