Sunday, March 14, 2010

విలక్షణమైన స్త్రీని నేను...

మాయా ఏంజిలౌ

అమెరికా జాత్యహంకారపు పడగ నీడలోఅణగద్రొక్కబడిన నల్ల జాతి బానిస జీవుల జీవితాలలో తమ రచనలతో వెలుగులు నింపిన అతికొద్దిమంది నల్లజాతీయులలోమాయా ఏంజిలౌ ఒకరు.విలక్షణమైన వ్యక్తిత్వం, నిర్మొహమాటమైన వైఖరి ఈమె రచనల్లో కనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ రచనా ప్రక్రియలలో అసాధారాణ ప్రతిభ ఆవిడ సొంతం. Still I rise, On the pulse of morning, Life doesn't frighten me etc., అనే కవితలుI know why the caged bird sings, The heart of a woman, Phenomenal woman అనే కవితలు, ఆత్మకధలు ఆమెకి బాగా
పేరు తెచ్చిన రచనలు.

Phenomenal woman
(స్వేచ్ఛానువాదం)











అందమైన యువతులు
నా సౌందర్య రహస్యమేమిటాని
ఆశ్చర్య పోతూంటారు..
నేను అందంగానో లేక
ఫ్యాషన్ మోడల్ అంత
నాజూకుగానో లేను
అలాగని నేను చెపితే
అబధ్ధాలనుకుంటారు
నా సౌందర్యం
నా చేతుల కలయికలో
నా తొడల నిడివిలో
నా హుందా నడకలో
నా పెదవుల నుడికారంలో ఉంది
విలక్షణంగా
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను

మీరు కోరినట్లు
నేనో గదిలోకి వెళ్తాను,
ఒక పురుషుని వద్దకు,
వారు నిలబడి లేదా మోకరిల్లి
తేనెటీగల్లా
నా చుట్టూ తిరుగుతూంటారు..
నా కళ్ళలో జ్వాల
నా పలువరుసలో మెరుపు
నా నడుములో ఊపు
నా అడుగులో ఆనందం
విలక్షణంగా
కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను

నాలోని నన్ను చూసిన
పురుషులు అచ్చెరువొందుతారు,
నా అంతరంగ రహస్యాలను
స్పృశించాలని
విఫల యత్నాలు చేస్తారు..
నే చూపించ బోయినా
చూడలేక పోయామంటారు..
నా సౌందర్య
నా వీపు వంపులోను
నా చిరునవ్వు కాంతిలోను
నా స్తనముల ఊపులోనూ
నా శృంగార రీతిలోనూ
విలక్షణంగా కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను...

మీకిపుడు తెలిసే ఉంటుంది
నా తల ఎందుకు దించలేదో
నేను ఎక్కువ నినదించను
నా ఆగమనం
నిను గర్వ పరచడానికే
నా సౌందర్యం
నా అడుగుల సవ్వడిలోను
నా శిరోజాల వంపులలోను
నా అరచేతిలోను
నా ఆత్మ రక్షణలోను
విలక్షణంగా కలిగిన
నేనొక స్త్రీని
విలక్షణమైన
స్త్రీని నేను...

4 comments:

  1. విలక్షణమైన స్త్రీకి వందనం, పాదాభివందనం.

    మీ అనువాదం చాలా బాగుంది. ఆమెను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
  2. శ్రీనిక గారూ !

    నూతన సంవత్సరంలో మీరు మరిన్ని నూతన భావనలు అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    ReplyDelete
  3. anuvAdaM mAyA EMjelO lAgAnE humdAgA aMdaMgA uMdi.

    "నా పెదవుల నుడికారంలో ఉంది"
    unusual usage - what does the original say here? idiom of the lips?

    ReplyDelete
  4. అనువాదం మాయా ఏంజెలో లాగానే హుందాగా అందంగా ఉంది.

    "నా పెదవుల నుడికారంలో ఉంది"
    unusual usage - what does the original say here? idiom of the lips?

    ReplyDelete