Sunday, October 25, 2009

మాయా ఏంజిలౌ

అమెరికా జాత్యహంకారపు పడగ నీడలోఅణగద్రొక్కబడిన నల్ల జాతి బానిస జీవుల జీవితాలలో తమ రచనలతో వెలుగులు నింపిన అతికొద్దిమంది నల్లజాతీయులలోమాయా ఏంజిలౌ ఒకరు.విలక్షణమైన వ్యక్తిత్వం, నిర్మొహమాటమైన వైఖరి ఈమె రచనల్లో కనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వివిధ రచనా ప్రక్రియలలో అసాధారాణ ప్రతిభ ఆవిడ సొంతం. Still I rise, On the pulse of morning, Life doesn't frighten me etc., అనే కవితలుI know why the caged bird sings, The heart of a woman అనే ఆత్మకధలు ఆమెకి బాగా పేరు తెచ్చిన రచనలు.

Still I rise


నీ దుర్భాష్యాలతో, అబధ్ధాలతో
నాకు హేయమైన చరిత్ర సృష్ఠించవచ్చు
నీ ఉక్కు పాదాలతో నను
భూస్థాపితం చేయవచ్చు
అయినప్పటికీ
నేను ఉదయిస్తాను
గోధూళినై..

నా ఆత్మవిశ్వాశం నిన్ను కలవర పరుస్తోందా?
నీవెందుకు దుఖ:సాగరంలో మునిగిపోయావు ?
నా ఇంట్లో చమురుబావులు న్నంత
గర్వంతో నేను నడుస్తున్నందుకా ?


సూర్య చంద్రుల్లా

తీరాల్ని తాకే అలల్లా
ఉవ్వెత్తున ఎగిసె పడే

ఆశల ఉప్పెనలా
ఉదయిస్తాను

ఆత్మఘోషతో అచేతననై
కన్నీటిధారలతో తలదించి విగతనై
నీముందు
నిలబడాలనుకుంటున్నావు కదూ..

నా అహంకారం నిను బాధిస్తూందా ?
ఎందుకంటే నా పెరట్లో
నేనేవో
బంగారు గనులు తవ్వుతున్నంత
ఆనందంగా వున్నాను..
ఇదొక ఘోర విపత్తనిపిస్తోందా?


నీ మాటల తూటాలతో

నను కాల్చివేయవచ్చు

నీ చూపుల్తోనను

తునాతునకలు చేయవచ్చు

నీ ద్వేషాగ్నిలో

నను భస్మం చేయవచ్చు
అయినప్పటికీ ఉదయిస్తాను
అనంత వాయువునై

నా సౌందర్యం

నిను కలవర పెడుతోంది కదూ
....
నా వాంఛలు తీరినట్లు

నేనేదో కానుకలు పొందుతున్నట్లు

నే చేస్తూన్న నాట్యం
ఆశ్చర్యంగా ఉందికదూ ...

చరిత్ర చీకటి
పుటల్లోంచి
ఉదయిస్తాను..

గాయాలమయమైన
గతం
మూలాల నుండి
ఉదయిస్తాను

ప్రతికెరటం లోను

ఉవ్వెత్తున ఎగిసిపడే వెల్లువతో

జలిస్తూ విశ్వవ్యాపితమైన

నల్ల సముద్రాన్ని నేను


భయాన్నీ, భీకర రాత్రులను చేధించి
సర్వశోభితమైన అరుణ కిరణాల్లా
ఉదయిస్తాను
తరతరాల వారసత్వ
పోరాట పటిమను
మీ కందిస్తూ
బానిస బ్రతుకుల పాలిట
ఒక అందమైన స్వప్నంలా
ఒక ఆశలా

ఉదయిస్తాను...

6 comments:

  1. శ్రీనిక గారు, ఒక నీగ్రో గురించి రాయటం, ఈనాటి స్వేచ్హా సమానత్వాలకి ఉదాహరణ. మంచి ఆలోచనలతో రాసారు. భావాలు బాగున్నాయి. కంగ్రాట్స్.

    ReplyDelete
  2. Sreenika gaaru o manchi kavithanu
    oka jaathini melkolpina kavithanu andinchinanduku danyavaadalu.

    tholiadugu.blogspot.com

    ReplyDelete
  3. జయ గారూ
    ధన్యవాదాలు
    కార్తీక్ గారు
    చాలా ధాంక్స్ అండి

    ReplyDelete
  4. చాలా బాగా అనువదించారు... ఎంత ఆత్మ విశ్వాసమో చూసేరా ఆమె గొంతులో, అంత చక్క గా తెలుగు లో కూడా ప్రతిధ్వనింప చేసేరు మీరు. Nicely Done

    ReplyDelete
  5. Thank you,
    Really she is the boldest women writer. When u read her works u see blood runs wild in vessels.

    ReplyDelete
  6. లేటుగా చూస్తున్నాను

    అద్బుతంగా మాయా కవితాత్మను ఆవిష్కరించారు.
    ఈ కవితను నేనిదివరలో అనువదించ ప్రయత్నించి విరమించుకొన్నాను. నచ్చక.
    ఇపుడు పోల్చిచూసుకొంటూంటే నేనెక్కడేక్కడ పట్టుకోలేకపోయానో స్పష్టంగా తెలుస్తోంది.

    చాలా బాగా అనువదించారు.
    అభినందనలు

    బొల్లోజు బాబా

    ReplyDelete