Saturday, October 24, 2009

పెళ్ళి పుస్తకం - మూడో భాగం.




హిందూ వివాహ ప్రాశస్త్యము.
మూడవ భాగం.

దీపావళీ దగ్గరపడిందంటేనే మనసెంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత కార్తీకమాసం నిత్యపూజలు భగవన్నామస్మరణ ..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మొదటి కార్తీక సోమవారం పూజకి సామాన్లు కొనడానికి శివాలయం వీధి వైపు బయలుదేరుతుండగా విజయ నుంచి ఫోనొచ్చింది. నా క్లాస్ మేట్. మధ్యే బదిలీ అయి వచ్చారు. ఫోను లిఫ్టు చేసాను.
హలో విజయా! బాగున్నావా?
బాగున్నానే..
నిన్న రాత్రే చాలా సేపు మాట్లాడుకున్నాం. వారం లో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడుకుంటాం. నెలకొకసారైనా వీకెండ్ హోటల్లోనో ఎంజాయ్ చేస్తాం. అయితే ఏమిటి సంగతి ఇంత సడన్గా.
ఏమిటే విజయా!
. ఏమ్లేదే.మేము శ్రీకాకుళం లోఉన్నపుడు మా మరిది వికాశ్ లేడా. అతను అమ్మాయితో ప్రేమలో పడ్డాడే. ఎలగోలా అతని మనసు మళ్ళించి, ఇక్కడకి ట్రాంసఫర్ పెట్టించుకుని ఇక్కడకు వచ్చేసాం. కానీ ఇప్పుడు అతను ఉదయం నుంచి కనిపించట్లేదే.
అక్కడ అమ్మాయి కూడా...
లేచి పోయారా.....
హా. అంతే కావచ్చు .మాకేమో ఊరు కొత్త. స్టేషన్ లో రిపొర్టివ్వడాలు.... మీవారికి వీలైతే..
ఏయ్. ఏంటే అలా కంగారు పడి పోతావు. మేమిద్దరం బయలుదేరి వస్తున్నాం.
బజారు నించి వస్తూ..వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లంతా శ్మశాన వాతావరణం. పిల్లలకేమీ పెట్టినట్లు లేరు. మేంతెచ్చిన ప్రసాదాలు ఆబగా తినేసారు. మావారు, విజయ హస్బెండ్ బయటకి వెళ్ళిపోయారు.
విజయ వాళ్ళ పెద్దపాప తన్మయి చాల ఇంక్విసిటివ్. మెల్లగా నాదగ్గరకు వచ్చి చేరిపోయింది. ఆంటీ. పెళ్ళిళ్ళ గురించి నీకు బాగా తెలుసని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది.
ఇపుడు బాబాయి ఎవరిష్ఠం లేకుండా పెళ్ళి చేసుకుంటున్నాడు కదా. ఇదేం రకమయిన పెళ్ళి. వయసుకి మించిన ప్రశ్న అయినా చెప్పాలని అనిపించింది. క్లుప్తంగా చెప్పాను.

ఇదుగో అప్పుడే విషయాలన్నీ బ్లాగులో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.

మన పూర్వీకులు వివిధ రకాల వివాహాలని ఒక పద్యం లో చక్కగా పొందు పరిచారు.

బ్రాహ్మాదైవస్తదైవార్ష:ప్రాజాపత్య:తధాసుర:

గాంధర్వో రాక్షస్తశ్చైవ పైశాచశ్చాష్టయో ధమ:

1.
బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రాజాపత్యం

5.
అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచం.

1.
బ్రాహ్మం: సర్వ లక్షణ సంపన్నుడైన వరుని ఆహ్వానించి యధాశక్తిగా
అలంకరించిన
కన్యను అతనికి ఉదక పూర్వకంగా
దానం చేస్తే అది బ్రాహ్మ వివాహ మంటారు. ఇలా వివహం చేసుకున్న దంపతులకు పుట్టిన వాడు పదితరాలకు పితృదేవతలను, పదితరాల వరకూ పుత్రాదులను, పవిత్రులను చేస్తాడు.

2.
దైవం : యజ్ఞాన్ని చేసేటప్పుడు అక్కడ ఋత్విక్కుగా వున్న వరుడికి అలంకరించిన కన్యను దానం చేయడం దైవవివాహమంటారు. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టినవాడు 7 తరాల ముందువారిని, 7 తరాల తరువాత వారిని కూడా తరింపజేస్తాడు.

3.
ఆర్షం : రెండు ఆవులను తీసుకుని కన్యాదానం చేస్తే అది ఆర్షవివాహ మౌతుంది. ఇలా పెండ్లి చేసుకున్న వారికి పుట్టిన వాడు ముందు మూడు తరాలను తర్వాత మూడు తరాలను తరింపజేస్తాడు.

4.
ప్రాజాపత్యం : " కలిసి ఉండి ధర్మాన్ని ఆచరించండి " అని ప్రతిజ్ఞ చేయించి కన్యాదానం చేస్తే అది ప్రజాపత్యమౌతుంది.
ఇలా పెండ్లయినవారికి పుట్టిన వారు ముందు 6 తరాలను, తరువాత 6 తరాలను తనను కూడా తరింపచేస్తాడు.

5.
అసురం : వరుని దగ్గర డబ్బు తీసుకుని కన్యాదానం చేస్తే అది అసుర వివాహం అవుతుంది.

6.
గాంధర్వం : పరస్పరానురాగాన్ననుసరించి రహస్యంగా చేసుకునేది గాంధర్వ వివాహం.

7.
రాక్షసం : యుధ్ధం చేసి కన్యనపహరించి చేసుకుంటె అది రాక్షస వివాహం అవుతుంది.

8.
పైశాచం : కన్యను మారువేషమ్లోనో, నిద్ర పోతూండగానో అపహరిస్తే అది పైశాచ వివాహమౌతుంది.
కొస మెరుపు:
ఘనా దేశం లో ఆసాంటే అను తెగవారిలో మగవాడు వధువు ఇంటి తలుపు తడతాడు. వరుని తల్లి ,అతని మేనమామ వధువు ఇంటి కి వెళ్ళి వివాహాన్ని పర్తిపాదిస్తారు.

వివాహ స్వరూపం ....మరో టపాలో...

7 comments:

  1. శ్రీనిక గారూ !
    వివాహాల్లో రకాలను గురించి బాగా వివరించారు. అలాగే వివాహ విధుల గురించి, వివాహ తంతు యొక్క ప్రాశస్త్యము గురించి వివరంగా వ్రాస్తారని అశిస్తున్నాను.

    ReplyDelete
  2. ఐతే మనం అందరం చేసుకునేది బ్రాహ్మమా ప్రాజాపత్యమా? బాగుందండి.

    ReplyDelete
  3. శ్రీనిక గారు పైన ఫొటో లో ఇద్దరు అబ్బాయిలే అనుకుంటా.. చూడండీ... :-)

    ReplyDelete
  4. sreenika gaaru bavundandi
    aithe bhavana gaaru cheppinattu naaku aa photolo iddaru abbayilenani anumaanamandi okka saari parikinchi choodaroo..........

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  5. @ SR Rao గారు,
    ధన్యవాదములండి,
    మీరడిగినవి ముందుముందు టపాలలో తప్పకుండా ఉంటాయని మనవి.

    @ భావన గారూ,
    మంచి ప్రశ్నవేసారు. చాలాకాలం క్రితం నేను ఇలాగే ప్రస్నించుకున్నాను.
    ఇంచుమించు అన్ని వర్ణాలలోను బ్రాహ్మ వివాహమే ఆనవాయితీగా ఉంది.అయితే వివాహ సమయమందు కొన్ని ప్రమాణాలు లేకపోలేదు.(ముందు ముందు టపాలలో ప్రస్తావిస్తాను)
    కానీ ఇవి చాలావరకూ సహజీవనానికి పరస్పరం గౌరవించుకోవడానికి సంబంధించినవి.
    ఇక ఇద్దరూ అబ్బాయిలా..?
    1. ఒక వ్యక్తి బొటన వేలి గోరు.
    సాధారణంగా ఆడపిల్లలు గోళ్ళు పెంచుతారు.
    2. వాచ్
    ఆ రకమయిన వాచ్ అమ్మాయిలే ధరిస్తారు.
    3. డ్రస్
    ఒకే కట్ లో అమ్మాయిల డ్రస్(పంజాబీ)క్లియర్ గా కనిపిస్తుంది.

    బహుసా మీ అనుమానం రెండు చేతులపై వెంట్రుకలు.
    ఇది అమ్మాయిలలో అరుదుగా కనపడే లక్షణమే గాని అవాస్తవమేమీ కాదు. ఇవికాక మరేదైనా అయితే పునరాలోచన గావిద్దాం.

    @ కార్తీక్ గారు
    ధన్యవాదములు,
    మీ సందేహాలకి వివరణ భావన గారి వద్ద....

    ReplyDelete
  6. [{(ఈ సబ్జెక్టు మనం కాస్తా యీకు ( :( అర్ధం చేసుకోవడానికి కూడా యీకే). కామ్గా సూత్తం బెటరు)}]

    ReplyDelete
  7. అష్టవిధ వివాహాల గురించి చాలా బాగా చెప్పారు శ్రీనిక గారు. చాలా చక్కటి వివరణ.

    ReplyDelete