హిందూ ధర్మ శాస్త్రంలో వివాహము ఒక పవిత్ర బంధమే కాని ఒప్పందం కాదు. ఒక జీవిత కాలపు అనుబంధం. ఒకే భార్య, భర్త అనే ఒక నియమానికి స్త్రీ, పురుషులు కట్టుబడివున్న ఒక సామోజిక బంధం దాంపత్యం ఒక సృష్ఠి కార్యం.
మానవుని జీవితం లోని నాలుగు దశలలోని రెండవ దశ గృహస్తాశ్రమము.
హిందువునికి వివాహము పితృ ఋణము తీర్చుకునే అనేక సాధనాలలో ఒకటి గా చెప్పబడుచున్నది.
హిందూ సిధ్ధాంతం లో వివాహం ఆధ్యాత్మిక పరిణితి కే గాని మానవ అవసరానికి కాదని కూడ చెప్పబడుచున్నది.
వివాహ మను ప్రక్రియ ద్వారా ఆత్మ బంధువులైన స్త్రీ,పురుషులు ప్రేమానురాగాలతో వారి బంధాన్ని బలోపేతం చేసుకుంటారు.
వివాహం వివిధ మతాలలో వివిధ రకాలుగా జరుగుతుంది. మతమేదయినా విధానమేదయినా వివహబంధం లోని పరమార్ధంలో మాత్రం ఏమాత్రం వ్యత్యాసాలు కనిపించవు.
చాలామందికి తమ తమ మతాల్లోని వివాహ ప్రక్రియలోని ఆచారాల గురించి, రకరకాల తంతుల గురించి తెలియక పోవచ్చు .
ప్రపంచం లోని ప్రధాన మతాల్లో జరిగే వివాహ విధానాల గురించి వాటి ప్రాశస్త్యము గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇవన్నీ ఆయా మత గ్రంధాలను చదివి, మత పెద్దలను అడిగి తెలుసుకున్నవే గాని నా స్వంత అభిప్రాయాలు కావని మనవి. మొదటగా హిందూమతం లోని వివాహం గురించి తెలుసుకుందాం.
హిందూ వివాహ : ప్రాశస్త్యము.
ఒకటవ భాగము
వివాహ: శబ్దార్ధం :ఒకటవ భాగము
సంస్కృత భాషలో " వహ్ " అనే ధాతువునకు ప్రాపణం అర్ధంగా చెప్పుతారు. ప్రాపణమంటే పొందించడం. వి + వహ్ + షుయ్= వివాహా: " ఆ" ధాతువునకు విశేషార్ధకమైన " వి" అనే ఉపసర్గ చేర్చి " షుయ్ " అనే ప్రత్యయాన్ని చేరిస్తే ' వివాహం ' అనే పదం ఏర్పడింది. అంటే వివహా: పదానికి విశేష ప్రాపణం - ప్రత్యేకమైన సమర్ప్ణ అని అర్ధం. అది అనేక విధాలుగా ఉంటుంది. ఒకే అణువులోంచి రెండు భాగాలుగా విడిపోయిన దంపతులను తిరిగి ఒకరివద్దకింకొకరిని చేర్చుటయని కాని, అగ్ని హాత్రాది సాక్షి గా ఈ కన్య భవిష్యజ్జీవిత లత కల్లుడుగా ఉండి ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సమానంగా అనుభవింప జేస్తానని వరుడు ఆమె నిర్వహణ గురించి ప్రతిజ్ఞ చేసి శుభసంప్రదాయమని కాని, అనేక రకాలుగా దాన్ని నిర్వచిస్తారు.
ఈ వివాహా: పదానికి 1. పరిణయం 2. ఉద్వాహాం 3. కల్యాణం 4. పాణి గ్రహణం 5. పాణిపీడనం
6. పాణిబంధం 7. దారోపసంగ్రహం 8. దారపరిగ్రహం 9. దార కర్మ 10. దారక్రియ
అనేవి ప్రసిధ్ధ సంస్కృత పర్యాయ పదములు.
మరో టపాలో మరికొంచెం....
కొసమెరుపు
ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగలలో వివాహాలు చాలా విచిత్రంగా జరుగుతాయి. బహుసా ప్రపంచమ్లో ఏ తెగలోనూ ఇటువంటి వివాహాలు జరగవేమో.
అమెరికన్ సివిల్ వార్ జరుగుతున్నకాలం లోదక్షిణాఫ్రికా బానిసల వివాహాలను అనుమతించేవారు కాదు.ఆ సమయం లో దక్షిణాఫ్రికా మారుమూల ప్రాంతాలలో సాంప్రదాయ వివాహ ప్రక్రియకి
ప్రత్యామ్నాయంగా ఈ ఆచారం పుట్టిందని చెపుతారు.
ఇంతకీ ఈ తంతు ఏమంటే " చీపురు మీదనుండి గెంతడం " విచిత్రం గా ఉందికదూ..
చీపురు ఒకటి నేల మీద పెడతారు. దాని మీదనుంచి వధూవరులు గెంతడమే. పాతని తుడిచి కొత్తని ఆహ్వానించడం, ఒంటరి జీవితాన్ని వదలి జంట జీవితాన్నిఅనుభవించడం ఇందులోని పరమార్ధం.
శ్రీనిక గారు, ముందుగా దీపావళి శుభాకాంక్షలు. చతుర్విధ పురుషార్ధాలను పూర్తిగా వివరించేస్తున్నారు. మీ వివరణ చాలా బాగుంది.
ReplyDeleteఆసక్తికరంగా వుంది.
ReplyDeleteమేము ఒక ఫిజీ ఇండియన్ పెళ్ళికి వెళ్ళాము. అక్కడ ప్రతి మంత్రానికి ఇంగ్లీష్ లో అనువాదం చేసిన బుక్లెట్ ఇచ్చారు. చాలా అర్థాలు అలా తెలిసాయి. మీ ప్రయత్నం బాగుంది. ఇవి అర్థం కావటం కన్నా వీటిని గౌరవించటం, ఒకరికనొకరు గౌరవించుకుని ప్రేమనే మంత్రం గా మలిచి చేయాలిన యజ్ఞం పెళ్ళి [నా వరకు].
ReplyDeleteఆక్తికరమైన వివరాలు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు... మరిన్ని వివరాలను తెలుసుకోడానికి ఎదురు చూస్తున్నాను.
ReplyDeleteపెళ్ళంటే వీడియోలు, ఫొటోలు మధ్యలో వాటి కోసం కట్టే మంగళ సూత్రం కాదన్నమాట..
ReplyDeleteకిడ్డింగ్. :-) బాగుంది చాలా బాగా చెప్పేరు. మీకు కూడా దీపావళి మరియు ప్రపంచ కవితా దినోత్సవపు శుభాకాంక్షలు
nice baagaa raasaaru
ReplyDeleteమీ వివరణ బాగుంది, వివాహ వ్యవస్థ, కుటుంభ వ్యవస్థ ఎప్పుడు మొదలయ్యాయి, అలాగే ఎందుకు, ఏ కారణం చేత ఇలాంటి వ్యవస్థను ఆరంభించారు అన్న విషయాలు తెలపగలరు. శ్రీనిక గారు.....! కమల్..
ReplyDelete@జయ
ReplyDeleteధన్యవాదములు
@చిన్ని
ధాంక్స్
@ఉష
ఇవి అర్ధం అవ్వాలి. అపుడే ఒకరిపై ఒకరికి గౌరవానురాగాలు కలుగుతాయి.అయినా మీ వివరణ చాలా బాగుంది. బాబ్బాబు దయచేసి ఆ బుక్లెట్ నా మైల్కి ఎటాచ్ మెంట్ పంపిద్దురూ.
తప్పకుండా ప్లీజ్.saisreehitha@gmail.com
@వేణూ శ్రీకాంత్
తప్పకుండా. మరింత ఆసక్తికరంగా...
@భావన
ఇంకా చాలా ఉంటాయి. పురోహితుడు చెప్పే ప్రతి మంత్రానికి ఒక పరమార్ధం ఉంది.
@విశ్వ ప్రేమికుడు
ధాంక్యూ వెరి మచ్
@కమాల్జీ
ధన్యవాదములు,మీరడిగినవి కనీసం ఒక రెండు ' ఋతురాగాలు '
అవుతాయి.అయినా తప్పకుండా ప్రయత్నిస్తాను.