Tuesday, October 27, 2009

పెళ్ళి పుస్తకం --నాల్గవ భాగం


హిందూ వివాహ ప్రాశస్త్యము.
నాల్గవ భాగము
మొదటి కార్తీక సోమవారం బాగా జరిగింది. మా ఫ్లాట్ లో వాళ్ళందరూ కలిసి రెండు ఆటోలలోనూ,
ఉన్నవాళ్ళు వారి కార్ల లోను శివాలయానికి వెళ్ళాం. పిక్ నిక్ ఎక్కడ జరుపుకోవాలన్న విషయం చర్చకి వచ్చింది..
మగ వాళ్ళందరూ అన్నవరం వెళదామని, ఆడవాళ్ళు దేవిపురం వెళదామని ప్రపోస్ చేసాం.
అప్పటివరకూ ఆలయం పార్క్ లో ఆటలాడుకుంటూన్న పిల్లలకి ఎలా తెలిసిందో ఏమో...
ఒక్కసారిగా వచ్చి ...మేమందరం ఆల్రెడీ డిసైడ్ అయి పోయాం. లాస్టియర్ కూడా మీరు తీసుకెళ్ళిన చోటుకే వచ్చాం .
ఈసారి అలా జరగడానికి వీల్లేదు. మేమంతా ' జూ ' కి వెళ్ళాలనుకుంటూన్నాం. వస్తే మీరు మాతో రండి.
లేదంటే గుంటూరు తాతయ్య ని తీసుకుని మేమంతా జూకి వెళతాం.
మా అందరి చూపులు ఒక్క సారిగా గుంటూరు తాత గారి మీదకు మళ్ళినయ్...
ఇందులో ఆయన ప్రమేయమేమి లేదు. ఇది మా స్వంత నిర్ణయమే.
మా ఫ్లాట్ లలో ఒక ఫామిలీ గుంటూరునించి వచ్చి సెటిల్ అయ్యారు.
వారింట్లో పెద్దాయనకి పిల్లలంటే చాలా ఇష్టం.
అందరూ ఆయన్ని గుంటూరు తాతయ్య అని పిలుస్తారు.
ఇంతలో రెండవ ఫ్లోర్ లో ఉండే చిన్నిపాప మేఘన (3rd class)
నా దగ్గరకి వచ్చి ..
Hanti, I have never seen a zoo, hanti. I want to see animals.
I want to climb on elephant. Please hanti, let us go to the zoo hanti,
please hanti, please hanti.....
మేఘన అంటే అందరకీ ఇష్టమే. అయినా మిగిలిన వాళ్ళని తృణీకరించలేము.
O.K. O.K. ఇళ్ళకి వెళ్ళాకా మూడు ప్లేసులకి డ్రా వేద్దాం.
ఆ మర్నాడు డ్రా తీయడము అందులో జూ రావడమూ పిల్లలందరికి ఆనందమైపోయింది.
చక చకా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.
భోజనాలయిన తర్వాత ఏదో వినోద కార్యక్రమాల్లో భాగంగా..డ్రాలో నేనొక ఉపన్యాసం ఇవ్వాలి.
అప్పటికే మావాళ్ళలో కొద్దిమందికి నా బ్లాగోపాఖ్యానం గురించి తెలిసింది..
వివాహ స్వరూపం గురించి చెప్పమన్నారు.
మావారు నాకేసి గర్వంగా చూడటం నాకెంతో ఆనందంగా ఉంది.

అందరికీ నమస్కారం.

కార్తీక మాస వన భోజనాల పర్వ దినాన మనందరం ఇలా కలసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మీలో చాలామంది పెళ్ళి చేసుకున్నవారే..పెళ్ళిళ్ళు చేసినవారే..
ఇపుడు నేచెప్పబోయేవిషయాలు మీకందరకు తెలిసినవే.
అయితే మన హిందూ సంప్రదాయం లోని వివాహ వ్యవస్ఠ కి విదేశాలలో మంచి పేరుంది.
దురదృష్ఠవశాత్తూ మన హిందువులు మాత్రం పాశ్చాచ్య నాగరికతకై పాకులాడుతున్నారు.
ఈ సాంప్రదాయాన్ని మన భావితరాలకి అందించాలనే తపనతో నా బ్లాగులో హిందూ వివాహ ప్రాశస్త్యం గురించి టపా చేస్తూన్నాను.
ఐతే ఈరోజు మీకు సింపుల్ గా వివాహ స్వరూపం గురించి వివరిస్తాను.

హిందూ వివాహ స్వరూపము.
పెద్దలు సుముహూర్తం నిశ్చయం చేసిం తరువాత అంకురారోపణం, దేవతాహ్వానం చేస్తారు.
వరుడు తన ఇంట్లోనే స్నాతక వ్రతం( కొన్ని వర్ణాలలో మాత్రమె) చేసుకుంటాడు.
వధూవరులు ఇద్దరూ మంగళ స్నానాలు చేస్తారు. వినాయకుణ్ణి వివాహం నిర్విఘ్నంగా జరగాలని పూజించి పుణ్యాహవాచనం చేస్తారు. కంకణాలను పూజించి ముందు వరునికి కడతారు.
ఇవెందుకు కడతారో తెలుసా ?
కంకణం కట్టడం వలన ఎటువంటి మైలలు వచ్చినా అతనికి సోకవు.
తరువాత కన్యచే గౌరీపూజ, కంకణపూజ చేయించి కన్యకు కూడా కంకణం కడతారు.
తరువాత వరపూజ.
వరపూజ అంటే...కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి మధుపర్కం ఇస్త్తాడు. వరుడికి వస్త్రాభరణాలిస్తారు.
తరువాత సన్నటి తెర ను మధ్య పట్టుకుని కన్యను రప్పించి కన్యాదానం చేస్తారు.
తరువాత ఇతర దానాలు కూడా చేస్తారు.
వధూవరుల గోత్రనామాలతో పూజ చేయిస్తారు.
కన్నాదాత వరునిచే ధర్మార్ధకామాలలో ఈ కన్యను విడువనని ప్రమాణం చేయిస్తాడు.
సుమూహర్త సమయమ్లో వధూవరులిద్దరూ ఒకరి తలపై ఇంకొకరు జీలకర్ర, బెల్లం పెట్టి
అందరి సమక్షమ్లో దంపతు లైనట్లు పరిగణింపబడతారు.
నిజానికి వివాహం అంటే ఇదే. మంగళ సూత్రధారణ కాదు.
తరువాత తెర తీస్తారు.
శుభ సమయం లో వరుడు వధువును చూస్తాడు.
నూతన దంపతలిద్దరినీ పక్క పక్కన కూర్చోపడతారు.
తరువాత కన్య శిరస్సు మీద కాడి ( బండికి గాని, నాగలికి గాని
రెండెద్దుల మధ్యఉండే కర్ర )కి ఉండే
రంధ్రం గుండా బంగారు వస్తువు ని ఉంచి వరుడు అభిషేకం చేస్తాడు.
వధువుకి కొత్తబట్టలు ఇస్తారు.
వరుడు వధువు నడుమునకు ధర్మతాడు కడతాడు.
తదుపరి పెద్దలందరూ కళ్ళకి అద్దుకున్న మంగళసూత్రాన్ని వధువు మెడలో
రెండు గట్టి ముళ్ళనూ, మూడవది వదులుగానూ కడతాడు.
పెద్దల ఆశీస్సు లు పొంది, తలంబ్రాలు పోసుకుంటారు.
బ్రహ్మ ముడులు వేసిన తరువాత కన్య చేయి పట్టుకుని వరుడు
ఏడడుగులు నడిపిస్తాడు.
తరువాత ప్రధాన హోమం , ప్రవేశ హోమం, సదశ్యం , నాకబలి ,
అప్పగింతలు వగైరా జరుగుతాయి.
ఇది స్థూలంగా వివాహ స్వరూపం.

అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను
మావారి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర గమనించక పోలేదు....

వివాహ ప్రశస్తి ...మరో టపాలో..





7 comments:

  1. బాగుందండీ. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం.. ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం.. :-)

    ReplyDelete
  2. బాగుంది బాగుంది..

    నవ్వక పోతే నాదో చిన్న సందేహం...
    సుముహూర్త సమయంలో జీలకర్రా బెల్లం ఎందుకు పెడతారు? తాళి కట్ట కుండా..? అసలు తాళి బొట్టుకా ప్రాథాన్యం, జీల కర్ర బెల్లానికా..?

    ReplyDelete
  3. శ్రీనిక గారు బావుంది పెళ్లి అంతటిని చక్కగా వివరించారు.....

    tholiadugu.blogspot.com

    ReplyDelete
  4. మీ పెళ్ళి నేను కళ్ళకు కట్టినట్లు చూసేసాను. అన్ని వివరాలు ఎంతబాగున్నాయో శ్రీనిక గారు. ఇంక మిమ్మల్ని దీవించేస్తాను. దీర్ఘ సుమంగళీ భవా!

    ReplyDelete
  5. @ భావన గారూ,
    ధన్యవాదములు,
    @ విశ్వప్రేమికుడు గారూ,
    మంచి ప్రశ్న వేసారు. రెండింటికి ప్రాధాన్యం ఉంది. దీని గురించి పూర్తి వివరణ తర్వాతి బ్లాగుల్లో వస్తుంది. అంతవరకూ దయచేసి.....
    @ కార్తీక్ గారు ,
    ధన్యవాదాలు.
    @ జయ గారు,
    ధన్యోశ్మి. మీ దీవెన నా అదృష్టం.

    ReplyDelete
  6. హిందూ వివాహం గురించి, అర్ధం చక్కగా చెప్పేరు .మీరు చెప్పే కొన్ని పద్దతులు(శిరసుమీదకాడి )నేను చూడలేదు,కొన్ని వర్ణలలోనే ఉంటుందేమో !.

    ReplyDelete
  7. అనఘగారూ,
    ఈ ఆచారం ఒకప్పుడు ఉండేది.(అన్ని వర్ణాలలో)నగరాల్లో ఈ కాడి దొరకదు కాబట్టి ఇది కనుమరుగయింది.

    ReplyDelete