" వివాహానికి ముందు శృంగారం, స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం సాగించడం అనేది నేరం కాదు. ఇద్దరు వయోజనులు సహజీవనం చేయాలనుకుంటే అందులో నేరమేమిటి? అది నేరమవుతుందా? సహజీవనం నేరం కాదు " అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ రెండింటినీ నిషేధించే చట్టమేదీ లేదని కూడా పేర్కొంది.
నిజమే...ఈ దేశ పౌరుని జీవన విధానాన్ని నియంత్రించే చట్టాలేమీ మన భారతీయ శిక్షాస్మృతి లో లేక పోవడం దురదృష్టకరం. మన సంస్కృతిని కాపాడ వలసిన ధర్మాన్ని, బాధ్యతని యువత విస్మరించడం కూడా నేరపరిధిలోకి రాదు. ప్రపంచం లో అత్యధిక శాతం యవత/యువశక్తి కలిగిన మనదేశ పౌరుడు పెడదోవ పడుతున్నా, ఈ దేశ చట్టాలు, సమాజం ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. ఎందుకంటే social conduct of an individual is not legalised. No law can prevent the fall of moral values of an indiviual.
వివాహానికి ముందు శృంగారం మంచిదా, కాదా అనేది మనిషి వ్యక్తిత్వం, కుటుంబ నేపధ్యం మీద ఆధారపడిఉంటుంది. చదువు, సంస్కారం ఉన్నయువతకి కొంత విచక్షణా జ్ఞానం ఉంటుంది. గ్రామీణ సమాజం లో ఇటువంటి ఆచారం అనాదిగా ఉన్నప్పటికీ ఇది సంస్కృతి మీద అంత ప్రభావం చూపక పోవచ్చు.
స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం (Dating) సాగించడం.. మన వివాహ వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుంది. పటిష్టమయిన వివాహ సంప్రదాయానికి చరమగీతం పాడినట్లే. దేశవిదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన మన వివాహ విధానం లోని ఆచార వ్యవహారాలను అటకెక్కించినట్లే. అభివృధ్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా భారత్ ను నిలబెడుతున్న అనేక అంశాల్లో ఈ దేశ సంస్కృతి ఒకటి. ఎంతో మంది విదేశీయులు మన వివాహ వ్యవస్థని అధ్యయనం చేసి.. భారతదేశం లో కుటుంబ వ్యవస్థకు మూలాలు వివాహ మంత్రాలలోనూ, వివాహ సంప్రదాయం లోను, వారి కట్టుబాట్లలోనూ ఉందని కొనియాడేరు.
ఈ సహజీవనం దేశ నైతిక విలువలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. ఆడ మగ డేటింగ్లో ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఎన్ని అనర్ధాలు వస్తాయో అనూహ్యం. అంతేకాదు రాధాకృష్ణుల మధురానుబంధాన్ని..మానవమాత్రుల విచ్చలవిడితనంతో సరి పోల్చడం వారి విజ్ఞత కి వదిలేయాలి.
కొసమెరుపు : సీతారామ కల్యాణమందు ప్రస్తావించిన మంత్రోపదేశాలే నేటికీ మన హిందూ వివాహ విధానమ్లో అనుసరిస్తున్నాం.
సీతారాముల దాంపత్యమంత అన్యోన్యంగా ఉండాలని ఆ మంత్రముల అర్ధం.
లోక కల్యాణరాముని కల్యాణం జరుగు శ్రీరామ నవమి రోజున ఇటువంటి వార్త వినడం.
సీారాములకు పెళ్ళి తరువాత అన్నీ కష్టాలే...దాంపత్యం ఎక్కడిది వనవాసమే... ఆపైన కిడ్నాప్, సస్పిషన్, ఫైర్ టెస్ట్...అన్నీ జరిగాక గర్భవతికి మళ్ళి వనవాసం...ఏం మంత్రాలో ఏం మహత్యాలో...
ReplyDelete@ మహేష్ గారు,
ReplyDeleteదాంపత్యం అంటే దంపతులు కలిసికాపురం చేస్తేనే దాంపత్యం కాదండి. మనసా,వాచా కర్మణా ఒకే పురుషుని గురించిన (కలసి ఉన్నా,విడిగా ఉన్నా)భావనతో జీవించినా అది దాంపత్యమని శాస్త్రాలు చెపుతున్నాయికదా.వాటికా మహత్యమో,వాటిమీద నమ్మకమో ఆ అన్యోన్యత ఉండేది.అదే ఈ ఎపిసోడ్లు ఈ కాలం లో జరిగితే....
పగిలిన అద్దం ముందు నగ్నంగా చూసుకుని పీక్కుంటూ
ReplyDeleteనడినెత్తిని సూర్యుణ్ణి మీద హుందాగా ఉచ్చపోసి
అరే సూర్యుడు నాపై వర్షించాడే!
అని ఆశ్చర్యపోయే నియోదళిత భావజాలానికి అర్థమయ్యే జ్ఞానం కాదులేండి :P :))
@శ్రీనిక" అంటే మొత్తానికి రామాయణంనాటి దాంపత్యానికీ ఈనాటి సంసారాలకీ తేడా ఉండంటారు! అదేకదా నేనూ చెబుతున్నది.
ReplyDeleteWhat makes no sense to me at this point in time...why celebrate it అనుకుంటాను. ముఖ్యంగా మీ ఆఖరి పేరాగ్రాఫ్ చదివి అలా అనిపించింది.
@మహేష్ గారు మనం మనుషులం. కొంచం సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందంగా అపుడప్పుడు గడపాలి కదా ఏవి ఏవిధంగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందో మీరు చెప్పండి. వినాలని ఉంది.
ReplyDeletebharatadesham developing country nunchi developed countrygaa maaripoyinatte anukovocchu supreme court chesina ee vyaakhyalatho....enthati dusthithi manadi.....
ReplyDeleteపెళ్ళి వల్ల కొన్ని బెనెఫిట్స్ ఉన్నాయి. పెళ్ళి చేసుకోకుండా స్త్రీతో కలిసి ఉండే వ్యక్తి వల్ల స్త్రీకి పిల్లలు పుడితే అతను పిల్లల బాధ్యతలు తీసుకుంటాడా? పిల్లల విషయంలో తల్లితండ్రుల ఇద్దరి బాధ్యతలు ఉండాలంటే పెళ్ళి చేసుకోవడమే మంచిది.
ReplyDeleteమానవుల జీవనవిధాన ప్రక్రియలో మనం ఎంతో దూరం ప్రయాణించి వచ్చాం. అనాగరిక ఆటవిక నాగరికత నుంచి నాగరిక జీవనానికి అలవాటు పడ్డాం. ఈ ప్రక్రియ లో సమాజంలో అక్రమాలు, అన్యాయాలు జరగకుండా వుండడం కోసం కొన్ని నీతి నియమాలను పెట్టుకున్నాం. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతీయులు ఇంకా గుహల్లో అనాగరికంగా నివసించే రోజుల్లోనే మనం నాగరిక జీవనం సాగించామని చరిత్ర చెపుతోంది. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో బంగారం కోసం, భూమి కోసం మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడే మనకి శాస్త్రీయఙ్ఞానం కూడా వుందని తెలుస్తోంది. ఇవన్నీ ఒక్క రోజులో రాలేదు. ఇవి పెంపొందడానికి కావలసినది ముఖ్యంగా నైతిక విలువలు. నైతిక విలువలు లేని ఙ్ఞానం సమాజాన్ని సర్వ నాశనం చేస్తుంది. ఒక ఆటంబాంబ్ వెయ్యాలో వెయ్యకూడదో ఆ దేశం యొక్క నైతిక విలువల మీద ఆధారపడివుంటుంది. ఆ నైతిక విలువలను తెలిపేది, వారసత్వంగా అందించేది కుటుంబ వ్యవస్థ. అందుకే మనవాళ్ళు కుటుంబ వ్యవస్థకు అంత పెద్దపీట వేసారు. అందుకే రామచంద్రుడు అప్పటివరకూ వున్న బహుపత్నీవ్రతాన్ని కాదని అందరికీ ఆదర్శంగా ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించి చూపించాడు. భార్య అన్నది దగ్గర వున్నా లేకపోయినా ఆమెనే హృదయంలో నిలుపుకున్నాడు. అలాగే సీతమ్మతల్లి కూడా. వారిద్దరూ ఒకరియందొకరు గాఢానురక్తులు. వారు కలిసి ఒకచోట వున్నా లేకపోయినా కూడా ఒకరిమీదొకరికి అనురాగం లేకుండా పోదు. ఇటువంటి నీతి నియమాల వల్ల కుటుంబం, పిల్లల పెంపకం బాగుంటాయి. వాటి వలన సమాజం లో నేరాలు అక్రమాలు జరగకుండా వుంటాయి ఒక సమాజం బాగా వుండాలని మనవాళ్ళు ఎంతో ఆదర్శంగా పెట్టిన పెళ్ళీ, కుటుంబం అనే వ్యవస్థలనుగురించి పెద్దవాళ్ళనబడేవాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. మనిషి చూసుకోవలసింది మనకి కనిపిస్తున్న శరీరాన్ని కాదు, ఎప్పటికీ నిలబడే మంచి అంతరాత్మ ననే విషయం వాళ్ళకి తెలీకపోవడమేంటో అర్ధం కాదు...
ReplyDelete@మహేష్ గారు,
ReplyDeleteధన్యవాదములు
@ పినాక పాణి గారు,
చక్కగా చెప్పారు.,
@ రాజు గారు,
ధన్యవాదములు..
@ శ్రీధర్ గారు.
ధన్యవాదములు
@ షర్మ గారు,
ధన్యవాదములు,
@ శ్రీలలిత గారూ,
చక్కగా చెప్పారు. నైతిక విలువలు లేని ఏ సమాజం మన జాలదు.ఒక దేశ ప్రగతి ఆ దేశ సామోజిక, ఆర్ధిక,సాంస్కృతిక అంశాల్లో ఆ దేశ నైతిక విలువలపై ఆధార పడివుంది. బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్న ఆయన చేయదగిన వ్యాఖ్యలు కావు.
well said sreenika garu!
ReplyDelete