మరో మొగ్గ...
కాలం ఎంత విచిత్రమైంది. వెయిట్ చేస్తే భారంగా కదులుతున్నట్లనిపిస్తుంది.
కష్టకాలమయితే ఎడారి ఎంతకీ తరగదనిపిస్తుంది.
సౌఖ్యంగా ఉంటే వేలి సందుల్లోంచి అపుడే జారి పోయిందే అనిపిస్తుంది.
నిన్న మొన్ననే మనం 2000 సం.రం లోకి అడుగు పెట్టామా అనిపించింది..
ఇంతలోనే ఈ దశాబ్దం ముగిసిపోయింది.మొగ్గలా మరో సంవత్సరంపువ్వులా వికసించి
పరిమళాన్ని మోసుకొస్తుంది
కనిపించని ముళ్ళతో
కాటు వేస్తుంది..
అంతలోనే వాడిపోయి
మరో మొగ్గకు జీవం పోస్తుంది....
బ్లాగు మిత్రులందరికి
నూతన సం వత్సర శుభాకాంక్షలు....
హాయ్ శ్రీనిక. మీకు కూడా నూతన సవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteశ్రీనిక గారూ !
ReplyDeleteమీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీనుంచి మరిన్ని కొత్త కొత్త అంశాలపై టపాలు ఆశిస్తూ.....