Tuesday, September 6, 2011

పంచ మార్గాలు

గురువు ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచింది మన సంస్కృతి. గురువు వద్ద శిష్యుడు ఏ విధంగా ఉండాలి ? ఏ రకమైన శుశ్రూషలు చేయాలి. గురువు నుండి జ్ణానాన్ని ఎలా సంపాదించాలి. ఇవన్నీ కూడా మనం మన శాస్త్రాలలో తెలుసుకున్నాం. అయితే గురువు ఏ విధంగా శిష్యునితో మెలగాలి అనే విషయం మీద శాస్త్రాలలో ఈ విషయాలు మనకు కనపడతాయి.
ప్రధానంగా గురువు ఐదు మార్గాలలో శిష్యుణ్ణీ గురువు, గురువుని శిష్యుడు అంటిపేట్టుకుని ఉండాలట.
పంచ మార్గాలు :
1. కపి మార్గము : కోతి పిల్లలు తమ తల్లి ఎచ్చటకు పోయినను పట్టుకున్న రీతిగా, ఉపధ్యాయుని శిష్యులు వదలకుండా ఉండాలట.

2. విహంగ మార్గము : పక్షి తన గ్రుడ్లను పెట్టి దాని రెక్కలచే మూసి యుండుట వలన అవి పిల్లలైనట్లు గురువు శిష్యులను విడనాడక వృధ్ధి లోనికి తీసుకు రావాలట .

3. మార్జాల మార్గము: పిల్లి తన పిల్లలను నో ట కరచుకొని ఎల్ల చోటులకు తీసుకొని పోవునటుల ఆచార్యుడు తా బోవు చోట్లకు గొని పోవుచూ వృ్ధ్ధి కి తెచ్చుట.

4. మీన మార్గము : చే ప గ్రుడ్లను పెట్టి వానిని తిరిగి జూడ, జూడనవి అభివృధ్ధి నొందినట్లు గురువు అప్పుడప్పుడు వచ్చి, వృధ్ధికి రావలినని కటాక్షించుట.

5. కూర్మ మార్గము : తాబేలు ఒక చోటున గ్రుడ్లను పెట్టి మరియొక స్థ్లలము నకు పోయి వాని నవరతము తలచుచుండగా, వృ ధ్ధికి వచ్చినట్లు, గురువు తన శిష్యులను అప్పుడప్పుడు తలచుచుండుట.

చూసారు కదండీ...వింతగా లేవూ...

1 comment: