ప్రతీ నెలా మూడవ ఆదివారం మా సృజన...విశాఖ వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో సాహితీ ప్రియులను అలరిస్తోంది. గత రెండేళ్ళకు పైగా ఔత్సాహిక కవులు, కవయిత్రులూ, రచయితలూ, రచయిత్రులకు, భావావిష్కరణ వేదికగా నిలుస్తోంది. ఈ సంస్థ లో కార్యవర్గ సభ్యులు గా నావంతు సాహితీ సేద్యం చేస్తూంటాను.
మా సృజన...విశాఖ రక రకాల పోటీల తో మేధకు పదును పెట్టి కలంతో కలకలం సృష్టించమని పెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. భావ పుష్కలత కలిగి అక్షరాలకు నగిషీ చెక్కాలనుకునే వారికి, ప్రముఖుల అమూల్య సలహాలందించే వారధిగా భాసిల్లుతోంది.
కొత్తనీరుని స్వాగతిస్తూ, పాతనీటి మధురిమల్ని అనుసంధానిస్తూ ఒక వినూత్న సాహితీ వాతావరణానికి ప్రతీకగా విరాజిల్లుతోంది.
అయితే ఈ రోజు నుండి మా సమాఖ్య కార్యకలాపాలని బ్లాగ్లోకంలో
పెట్టాల నే ఆలోచన వచ్చింది.
మా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల సృజన...విశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత,వ్యాసకర్త, చరిత్రకారుడు, బహుభాషా కోవిదులు పుదుచ్చేరి రాష్ట్రప్రభుత్వంచే ' తెలుగురత్న ' బహుమతి గ్రహీత , సువర్ణశ్రీ బొల్లోజు బసవలింగం స్మారక సాహితీ పురస్కారాలు పేరిట ' పోస్టుకార్డు కవితల పోటీ ' నిర్వహించాము. బహుమతి పొందిన వాటిని ఇక్కడ చూడచ్చు.
No comments:
Post a Comment