Thursday, September 1, 2011

పసుపు వినాయకుని పూజ అవసరమా ?


వినాయక వ్రతం చేయునపుడు పసుపు వినాయకుని పూజించడం అవసరమా ?
సాధారణంగా మనం ఏదైనా వ్రతం చేసేటపు డు గాని ఇతర దేవతలని పూజించే సమయంలోనో , మరే ఇతర శుభకార్యమయినా జరిపేటపుడు విఘ్నం కలుగకుండా వినాయక పూజ చేయడం మొదటి పుజలందుకునే ఆ విఘ్న నాయకుని పసుపు రూపం చేసి పూజ చేయడం ఆయనని స్మరించడం సంప్రదాయం. కానీ వినాయకునికే పూజ జరిపేటపుడు మళ్ళీ మరో వినాయకమూర్తిని పసుపుతో ఏర్పరచి, పూజ జరపడం మూఢమైన ఆచారం. కానీ ఇది వినాయక వ్రతకల్పం లో అలవాటుగా చేరిపోయిన అనవసరమైన ఉపాంగం. మన సంస్కృతిలో చేరిన ఈ విధమైన అనవసరమైన, అర్ధరహితమైన కర్మలని శాస్త్ర అవగాహనతో దూరం చేయవచ్చు..
అందరికి వినాయక చవితి శుభా కాంక్షలు ......

3 comments:

  1. అవసరమే, పోలీసు స్టేషన్ కి సెక్యూరిటీ అవసరం ఎలాగో, పవర్ ప్లాంట్ కి కూడా పవర్ కోనేక్షన్ ఎలాగో...

    ఇంకా పార్వతి పరమేశ్వరుల పెళ్ళికి కూడా గణపతి పూజ చేస్తారు ముందు. చేసి ఉంటారు నిజంగా కుడా అప్పుడు. ఎందుకంటి అపుడు విఘ్నాధిపతి శివుడే. కాల క్రమేణా శివుడు దొరకట్లేదు, బిజీగా తపస్సు చేసుకొంటున్నాడు అని అంతా కలసి కొత్త విఘ్నాధిపతి కావాలి అని అడిగితే, వినాయకుడిని విఘ్నాధిపతి చేసాడు శివుడు. అందుకే వరసిద్ధి వినాయక పూజకు ముందు. మహా గణపతి పూజ.

    ReplyDelete
  2. శ్రీనిక గారూ,

    పసుపు వినాయకుడి పేరు మహా గణపతి. ఆయన ఏ కార్యమునైనా నిర్విఘ్నము గా పూర్తి చేసే వరమును ప్రసాదిస్తాడు. వ్రత కల్పము లో చేసే పూజ సిద్ది వినాయకునకు, సిద్ది, బుద్ది సమేత శ్రీ సిద్దివినాయక స్వామినే నమః అని చెపుతాము ఈయన పూజకు. ఈ వ్రతము నిర్విఘ్నము గా జరగాలని మహా గణపతి పూజ చేయాలి. అంతే కాక, ప్రాణ ప్రతిష్ట చేసిన ఏ పూజ కైనా తొలి పూజ అర్హత గణపతి కే ఉంది. అంచేత ఇది మూఢ ఆచారము కాదు, విధి విధానమే..

    భవదీయుడు

    సీతారామం

    ReplyDelete
  3. పైన ఇద్దరు చెప్పినదే నా ఉద్దేశము కూడా.
    మన ఆచారములను హేతుబద్ధంగా మీరు ఆలోచించడం కూడా బాగున్నది.

    ReplyDelete