Showing posts with label తెలుగు ఉగాది సంబరాలు. Show all posts
Showing posts with label తెలుగు ఉగాది సంబరాలు. Show all posts

Thursday, March 22, 2012

నిలువెల్ల కనులై...

చుస్తూన్నా నందనా నీ రాకకోసం
నీ వెన్నంటి వచ్చే వసంతానికై
వాడియైన చేతలతో
ఖరనామ సమ్వత్సరం
మిగిల్చింది వేడివేడి వాతలు
మధ్యతరగతి జీవితాలపై
ధరల వరల మోతలు

కొంగ్రొత్త చిగురుల సోయగాలతో
కనకాంబర అంబరాలలో
ముద్దబంతి మాలలతో
ముచ్చటగా ముద్దులొలికే
ముగ్ధ మనోహర వసంతలక్ష్మీ స్వాగతం

మా మానస వనమ్లో
ఆనంద మందారాలను
విరబూయ నందనా
నీకు స్వాగత వందనం

రాష్ట్రం సుభిక్షమై
నందన నామ ఉగాది
కావాలి అందరి
ఆనందానికి పునాది.

బ్లాగ్మిత్రులందరికీ
శ్రీ నందన నామ శుభాకాంక్షలు