Showing posts with label తెలుగు సాహిత్యం.. Show all posts
Showing posts with label తెలుగు సాహిత్యం.. Show all posts

Monday, December 19, 2011

కలాల కోలాహలం





నిన్నటి రోజున కవన భోజనం.
మా విశాఖ పట్నం మరియు ఉత్తరాంధ్రాకు చెందిన రచయితలు, కవులు సాహితీ సమ్మేళనం ఘనంగా జరిగింది.
కలాల కోలాహలం
(సాహితీ సమ్మేళనం)
వివిధ సాహితీ ప్రక్రియలపై పోటీలు, ప్రసంగాలు, రచనా పఠనాలు, కవి సమ్మేళనం తదితర
అంశాలపై పోటీలు నిర్వ హించారు.
అవధాన ఘనాపాటి డా. గరికపాటి ముఖ్య అతిధిగా సుప్రసిధ్ధ రచయిత్రులు, రచయితలు పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

కార్యక్రమమ్లో సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మోదు రాజేశ్వరరావు,
సృజన..విశాఖ కార్యదర్శి గుండాన జోగారావు, కార్యవర్గ సభ్యులు శ్రీ బి .దుర్గా ప్రసాదు విశాఖ సాహితీ మిత్రులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.

ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఆరు గంటల వరకూ సాగిన ఈ కార్యక్రమం లో వివిధ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరిగింది.
సాహితీ ప్రియులందరూ సంతోషించ దగిన విషయమేమంటే
వచ్చే సమ్వత్సరం ఏప్రిల్ నెలలో
మా విశాఖ పట్నం లో
జాతీయ తెలుగు రచయితల మహా సభలు
జరగనున్నాయి.
దానికి సంబంధించిన విధి విధానాలను, తాత్కాలిక కార్యవర్గ కమిటేని ప్రతిపాదించటం కూడా జరిగింది.

Sunday, August 1, 2010

పెళ్ళి పుస్తకం. 15


హిందూ వివాహ ధర్మం మీద గత కొన్ని సమ్వత్సరాలుగా చేసిన అధ్యయనం వలన ఎన్నో విషయాలు తెలిసినవి. అనేక సందర్భాలలో ఈ విషయాలను బంధుమిత్రులతో పంచుకున్నపుడు వారికెంతో ఆశక్తిని కలిగించేవి. చాలామంది మిత్రులు వీటిని పుస్తక రూపమ్లో తీసుకురమ్మని పలు విధాలుగా ప్రోత్సహించారు. కాని నాకెందుకో ఇష్టం కలగలేదు. ముద్రణకి మనసంగీకరించలేదు. ప్రత్యేకమైన కారణమేమి లేదు. అయినా వారి సలహాని త్రోసిపుచ్చలేదు. నే రాసుకున్న నోట్సు, సేకరించిన విషయాలు ఒక క్రమం లో ఉండాలని ఒక చిత్తు ప్రతిని తయారు చేసుకున్నాను. ఇది జరుగుతున్న తరుణమ్లో విదేశాల్లో ఉంటున్న మా అన్నయగారి పాపకి పెళ్ళి కుదిరింది. కాకినాడలో పెళ్ళి . పెళ్ళి పనులు కొన్ని అన్నయ నాకప్పగించాడు. వాటికోసం కాకినాడ, వైజాగ్ తిరుగుతూంటే మా బంధువుల్లో ఒక పెద్దాయన " అవున్రా చిట్టీ నీ మేనకోడల పెళ్ళి కి ఓ చిన్న పెళ్ళి పుస్తకం అచ్చువేయించి అందరకీ పంచవచ్చుకదా " అని సలహా ఇచ్చాడు. ఎందుకో ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. వెంటనే ప్రెస్ వాళ్ళని సంప్రదించి రెం డువేల కాపీలు (జేబులో పెట్టుకునే సైజులో) ముద్రించి పెళ్ళిలో అందరికీ పంచిపెట్టాను.కొన్ని తెలిసినవారికి, మా స్కూలు పేరెంట్స్ కిపంచిపెట్టాను. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు పైనే అయింది. నాకు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోను చేసి మరీ అభినందనలు తెలిపారు. (వాళ్ళకి నా పుస్తకం ఎలా చేరిందో నాకు తెలియదు) అయినా నాకెందుకో తృప్తి కలగలేదు. ఏదో వెలితిగానే ఉండేది. ఇదుగో ఆ సందర్భం లో నా ఫ్రెండ్ మాలతి ఇవన్నీ బ్లాగులో పెట్టమని సలహా ఇచ్చింది. సో అలా గత సంవత్సరం అక్టోబరు నెలలో మొదలయిన ' నా భావనలు ' బ్లాగులో ' పెళ్ళి పుస్తకం ' అనే పేరుతో ఒక వర్గాన్ని మొదలుపెట్టాను. ప్రపంచం నలుమూలలనుండి ఎంతో మంది తెలుగు బ్లాగర్లు అభినందించారు, ఆశీర్వదించారు... అందరికీ పేరు పేరున నెనర్లు. కొందరైతే క్రిస్టియన్, ముస్లిం మత వివాహ ధర్మాలనికూడా వ్రాయమని అడిగారు. ఇది అంతర్లీనంగా నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఎక్కువగా వారి సలహా నన్ను ప్రేరేపించింది. అందుకే ఇతర మతాలలో జరిగే వివాహ తంతులగురించి అధ్యయనం మొదలు పెట్టాను. ఈ రెండు నెలల అధ్యయనంలో ఎన్నో ఆశక్తికరమైన విషయాలు తెలిసాయి. అవన్నీత్వరలో మీతో పంచుకుంటాను.

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.
భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గాన జాలము. ....అనిబిసెంటు.

Friday, April 2, 2010

బాల పాఠకులందరికీ...

ఈనాడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
బాల పాఠకులందరికీ శుభాకాం క్షలు. . ఎలెక్ట్రానిక్ మీడియా, వీడియో గేంస్ ఎంతో ప్రబావం చూపుతున్న ఈ కాలం లో కూడా పిల్లలకి కధల పుస్తకాలంటే ప్రాణం. మీడియా ప్రభావం వలన మిగిలిన సాహిత్యం కాస్త కుంటుపడిందని అనక తప్పదు. నిజానికి ఇటువంటి పరిస్థితులలో బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాస సాహిత్యం మాత్రమే ప్రపంచం లో నిలదొక్కుకోగలిగిందని చెప్పవచ్చు. ఇదంతా వేరే విషయం.
ఇంతకీ ఈ బాలల పుస్తకదినోత్సవం ఎలా మొదలయింది. దీనికో చిన్న కధ ఉంది.
ఫెయిరీ టేల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ ఫెయిరీ టేల్స్ సృష్టికర్త " హాన్ స్ క్రిష్టియన్ ఆండర్సన్ " డెన్మార్క్ లో పుట్టిన ఈయన 1805-1875 మధ్య నివశించాడు. ఈయన రాసిన అనేక కధలలో .. ద లిటిల్ మెర్మైడ్, ద స్నో క్వీన్, ద ప్రిన్సెస్ అండ్ ద పీ మరియు థంబులీన్
చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈయన రాసిన జానపద కధలు 150 భాషల్లోకి అనువదింపబడ్డాయి. అంతేనా..ఎన్నో ఏనిమేషన్ చిత్రాలు, పిల్లల నాటికలకు, సినిమాలకు ప్రేరణని ఇచ్చాయి. మరి ఈ రోజెందుకు బాలల పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆండర్సన్ ( ఏప్రిల్ 2 ) గారి పుట్టిన రోజు కాబట్టి. మరో విశేషం ఏమంటే ఈరోజు ఆయన 205 వ జయంతి. ఈ దినోత్సవ ఉద్దేశ్యం ఏమంటే బాలలలో పఠనాసక్తిని పెంపొందించడమే..
ఈ రోజుని మా స్కూల్ లో చాలా బాగా జరుపుకున్నాం. సం.రం. అంతా మా పిల్లలు చదివిన పుస్తకాల పేర్లు ఒక డైరీ లో రాసుకుంటారు. ఈ రోజున పేరెట్స్ ని పిలిచి వారెదురుగా పిల్లలు వారు చదివిన పుస్తకాలలో వానికి నచ్చిన కధని అందరికీ చెపుతారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులే న్యాయనిర్ణేతలు గా వ్యవ హరించి బాగా చెప్పిన పిల్లలని ఎంపిక చేస్తారు. వారికి బహుమతులివ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేమంటే
కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు చాలా మంది పిల్లల కధల పుస్తకాలు తెచ్చి మిగిలిన పిల్లలకి పంచి పెట్టారు. ఈ విద్యాసం వత్సరమ్లో ఈ ఉత్సవాన్ని మరింత వెరైటీగా ఎంత వెరైటీ అంటే భారతదేశమ్లో మరే ఇతర స్కూలు జరపలేనంతగా జరపాలని ప్రణాళిక లు సిధ్ధం చేసేసాం.
ఎలా అనుకుంటున్నారా... అమ్మో ఇపుడు చెప్పను... బై.