Saturday, September 12, 2009

రోజూ కనిపించే.....


మీరు...
సమాధిలోకి వెల్తున్నపుడు
మీచుట్టూ ఎవరూ ఉండరు
ఎవరూ ఏడ్చినట్లనిపించదు
ఏ ప్రార్ధనలు మీకు వినబడవు
ఎన్నో ప్రశ్నలు మాత్రం
మీ చుట్టూ నాట్యం చేస్తూంటాయి
మీ పార్ధివ శరీరం బూడిదయి పోతూంటే
మీకేమీ బాధనిపించదు...
రెండోరోజుకల్లా మీ ఫోటో
చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది...
మీకందరూ కనిపిస్తారు
మీరెవరికీ కనపడరు...
పరామర్శల ముసుగేసుకుని
వచ్చేవారందరూ
ఫోటో ఫ్రేములో బిగించిన
మిమ్మల్నిచూస్తూంటారు
అశ్రునయనాలతో
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ
వెళిపోతూంటారు...
ఎవరి బిజీ వారిది
మీరేమీ బాధపడినట్లుండరు...
పెరట్లో మీరు నాటిన మొక్కలు
అందమయిన పూలు పూస్తూంటాయి
పిల్లలు వాటినేచూస్తూ
ఆనందపడుతూంటారు
మీకేమీ బాధనిపించదు...
ముసలి చెట్ల స్థానంలో
కొత్త మొక్కలు మొలుస్తూంటాయి
ఈరోజెందుకో
మీరు బాధగా కనిపిస్తున్నారు
పాతసామాన్ల వాడి సంచిలో
ఇరుక్కుపోయిన మీ ఫొటో
మిమ్మల్ని చూసి జాలిపడుతూంటుంది
మీ స్థానంలో
మీ కొడుకు ఫొటో
వేలాడుతూంటుంది.....



9 comments:

  1. ఫొటో మరియు లేబుల్స్ లో రాజశేఖర రెడ్డి అన్న మాటలు తప్ప మరే సూచనా కవితలో లేకపోవటం కవితకు గొప్ప డెప్త్ ని ఇచ్చింది. కవిత పరిధిని పెంచింది.

    చాలా సటిల్ గా ఒక అంశాన్ని సార్వజనీనం చేసే పద్దతి చాలా పరిణితితో కూడుకొన్నట్లు ఉంది.

    అభినందనలు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. బొల్లోజు బాబా గారికి,
    మీలాటి వారు నాలాటి కొత్త బ్లాగర్ ని చూడడం నా అదృష్ఠం. మీ కామెంటు నా కవితకి ఒక కొత్త రూపాన్నిచ్చింది. ధన్యవాదములు

    ReplyDelete
  3. కొత్త పాళీ గారికి,
    ధన్యవాదములు

    ReplyDelete
  4. itz vry subtle.. a nice atempt to imagine d human psychology evn aftr death :) .. abstrct poem wid enuf depth of philosophy..

    ReplyDelete
  5. In fact ur comment has elevated a rank to my poem. Thank U so much.

    ReplyDelete
  6. అద్భుతం.... మాటలు రాలే...

    ReplyDelete
  7. అమ్మ అమ్ముతానంది
    గంభీరావుపేట, న్యూస్‌టుడే: అభం, శుభం తెలియని తన ముద్దుల చిన్నారులను నడి బజారులో అమ్మకానికి పెట్టిందో తల్లి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వేధింపులకు గురిచేయడం, తోబుట్టువులూ చేరదీయకపోవడం ఆమెను ఇందుకు పురిగొల్పాయి. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో కోదండ సాల(27) అనే మహిళ శుక్రవారం తన ఇద్దరు పిల్లలు శివకుమార్(2), రేఖ(5నెలలు)లతో రోడ్డుపై కూర్చుంది. అటుగా వెళ్తున్న వారిని పిలిచి, తన బిడ్డలను అమ్ముతానని చెప్పింది. దీంతో కొద్దినిమిషాలకే మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.ఇంతలో విలేకరులు అక్కడికి చేరుకొని ఆమెను కదిలించడంతో తన కన్నీటి గాథను విన్నవించింది. మెదక్‌జిల్లా తుఫ్రాన్‌కు చెందిన నూనె ఎల్లయ్య ఐదేళ్ల క్రితం తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, మూడేళ్ల తర్వాత నిత్యం వేధింపులకు గురిచేశాడని వాపోయింది. అత్తింటివారు గెంటేయడంతో శుక్రవారం గంభీరావుపేటకు చేరుకున్నానని చెప్పింది. పిల్లలను పస్తులు ఉంచేకంటే.. అమ్మేయడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈనాడు 28.7.2007
    ఇలాంటివాళ్ళు పిల్లలను కనకుండా ఉంటే బాగుండు.

    ReplyDelete