Sunday, September 20, 2009
మళ్ళీ వికసించనీ...
ఇదిగో ఇక్కడే
నా బాల్యం లో
సీతాకోక చిలుకలు
రెక్కల్ని రెపరెప లాడిస్తూ
ఋతువుల్ని రాల్చి వెళ్ళిపోయాయి.
కాని అవి వాలిన పూలు
నాలో ఇంకా వాడిపోలేదు....
వర్తమాన పొరల్లో
గతం ఎంత చుట్టుకుపోతున్నా
నాలో స్మృతులు మాత్రం
మంచు బిందువంత
స్వచ్చంగా ఉన్నాయి....
ఇదిగో ఇక్కడే
నా బాల్యంలో
నే నడిచిన దారుల్లో
చెరిగిపోయిన
నా పాదముద్రికలు
నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి.....
అదృశ్య దృశ్యాలన్నీ
హృదయాకాశంలో
నక్షత్రాల్లా మెరుస్తూనే ఉన్నాయి.
మనసంతా
వెన్నెల వెలుగుతూనే ఉంది.....
నా బాల్యం
నా వైపొకసారి చూసి
ఎటో వెళ్ళి పోయింది
గంట మ్రోగంగానే
పరుగులు తీసిన బడి పిల్లాడిలా
నేను మాత్రం
ఖాళీ అయిన తరగతి గదిలా .....
ఓ ప్రభూ !
అన్నిటికీ పునర్జన్మ నిచ్చావు
కాలానికి తప్ప
అందమయిన ఆ పుష్పాన్ని
మళ్ళీ వికసించనీ...
మధురమయిన ఆ రోజుల్ని
మళ్ళీ ఉదయించనీ....
Subscribe to:
Post Comments (Atom)
నే గెస్ చేసింది కరెక్టే...! అద్భుతంగా ఉంది. నిండుగా ఉంది.
ReplyDeleteబృహ:స్పతి గారికి,
ReplyDeleteధన్యవాదములు.
బాల్యాన్ని గురించిన జగ్జీత్ సింగ్ గారి గజల్ ఒకటి ఉంది.. అది గుర్తు వచ్చింది.
ReplyDeletesuper...........eexcellent
ReplyDelete