Sunday, September 13, 2009

వర్షించే ప్రతి బొట్టులో


వర్షించే ప్రతి బొట్టులో......

మన తొలి పరిష్వంగన
అనుభూతిని మొగ్గలోనే
చిదిమి వెళిపోయిన
నీకేం తెల్సు
నేనెంత గ్రీష్మాన్ని
దిగమింగానో...
ఈ ఏకాంతంలో
వర్షించే ప్రతి
కన్నీటిబొట్టులో
నీ రూపాన్ని
చూసుకుంటూ
ఎన్ని నిద్రలేని రాత్రులు
నిరీక్షించానో...
తలపులలోనిండిన
నీ రూపం
కలలో దూరమయ్యేనని
కలత నిద్రకు కూడా
దూరమయ్యేను...
ఈ కన్నీటి ధారలు
ఎప్పటికి ఇంకిపోవు
ఎందుకంటే
ఒక బిందువు నీకోసం
ఒక బిందువు నాకోసం
మరో బిందువు మనకోసం
అలా...అలా...అలల్లా......
అనంత వాహినిలా............

14 comments:

  1. శ్రీనిక గారు, మీరు బ్లాగులోకానికి కొత్తేమో కానీ కవితలకు మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను. అద్భుతంగా వుందండీ.

    ReplyDelete
  2. చాలా బాగుంది శ్రీనిక...

    ReplyDelete
  3. నీకేం తెల్సు
    నేనెంత గ్రీష్మాన్ని
    దిగమింగానో...

    excellent expression

    ReplyDelete
  4. మీ కవితలు నాకు చాలా చాలా నచ్చాయి.మీరు రెగ్యులర్ గా రాయాలని కోరుకుంటూ - మీ కొత్త అభిమాని.

    ReplyDelete
  5. బ్లాగుర్లు
    రవితేజ,నేస్తం,భావన గార్లకి నా బ్లాగును దర్శించి కామెంటినందుకు చాలా ధన్యవాదములు.

    ReplyDelete
  6. భాస్కర రామిరెడ్డి గారు,
    మీరన్నది కరక్టే. కొద్ది కాలంగా వ్రాస్తున్నప్పటికీ...ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ సలహా మేరకు బ్లాగు తెరిచాను. తెరిచిన కొద్ది కాలమ్లోనే ఇంత ఆదరణ లభించడం నా అదృష్టం.

    ReplyDelete
  7. బొల్లోజు బాబా గారికి,
    మీరు, బృహ:స్పతి,రవితేజ,భావన,భా.రా.రె,నేస్తం వంటి మెగా బ్లాగర్లు నా బ్లాగుని దర్శించారంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

    ReplyDelete
  8. బృహ:స్పతి గారు,
    మీ వంటి వారి ప్రోత్సాహం నను మరింత ఉత్సాహపరుస్తుంది. మీ అభిమానాన్ని పొందటం నా భాధ్యతని పెంచింది. మీ అశీస్సులతో...ఇకపై రెగ్యులర్ గా..

    ReplyDelete
  9. చాలా బాగుంది..మీ కవితలన్నింటికీ ఇదే వ్యాఖ్య రాయాలనిపిస్తోంది..!!

    ReplyDelete
  10. శ్రీనిక గారూ మీరు

    పదాలతో సౌధాలల్లి
    ఆ అందమైన,ముచ్చటైన,మదిని నివ్వెరపరచే
    సౌదాలలోకి అదుగుపెట్టేందుకు
    మమ్మల్ని అర్హుల్ని చేసినందుకు

    మీకు దన్యవాదాలండి....

    ReplyDelete
  11. శ్రీనిక గారు....మీ కవితలు చాలా బాగున్నాయి... కవితల కోసం మీ బ్లాగుని ఎప్పడు చూస్తూంటాను..

    ReplyDelete
  12. "ఒక బిందువు నీకోసం
    ఒక బిందువు నాకోసం
    మరో బిందువు మనకోసం
    అలా...అలా...అలల్లా...."
    చాలా బాగుంది!

    ReplyDelete