ఈ శెలవులు మాకొద్దు..
తొందర పడి ఒక కోయిల ముందే కూసిందీ... అని హమ్ చేసుకుంటూ వంట చేస్తూన్నాను. త్వరగా వంట చేసేయాలి.లేకపోతే చంటి గాడి ఆటో వచ్చిందంటే ఒఖ్ఖ నిముషం ఆగడు. తనకేమీ పట్టనట్లు చంటి టి.వి చూసుకుంటూ కూర్చున్నాడు. కనీసం వాటర్ బాటిల్సయినా పట్టచ్చుకదా.
ఆడపిల్లయినా గానీ అనూ కూడా అంతే..ఎంత సేపూ బాగ్ సర్దుకుంటూ గడిపేస్తాది. ఒక్క పనికి చేతి కంది రాదు.
అయినా ఈ రోజు మనసంతా హుషారుగా ఉంది. ఎందుకంటే దసరా శెలవులొచ్చేసాయి. ఈ సారి తొందరగానే వచ్చేసాయి. ఎపుడూ దసరాకి నార్త్ ఇండియానో, సౌత్ ఇండియానో టూర్‌కి చెక్కేస్తాం. సంక్రాంతికి అమ్మవాళ్ళింటికి చేరిపోతాం. కానీ ఈ సారి మావారు ఆఫీసు పని మీద హైదరాబాదు వెళ్ళిపోతారు. ఫాస్ట్ గా పేపర్లన్నీ కరెక్ట్ చేసేసి ఇచ్చేస్తే శెలవుల్లో ఇంటి పని పట్టచ్చని ప్రణాలికలు వేసేసాను.
గబ గబా కేరేజీలు సర్దేసి పిల్లల్ని పంపి మా ఇద్దరి కేరేజీలు సర్ది ఇంటికి తాళాలు వేసేటప్పటికి మావారు బండి మీద రెడీగా హారన్ మోగిస్తూ..
హబ్బ..ఏం జీవితమండిబాబూ.
ఉరుకులు..పరుగులు.. కానీ నెలాఖర్ని జీతం తీసుకునే టపుడు మాత్రం నెలంతా పడిన బాధలన్నీ మర్చిపోతాం...
సాయంత్రం ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్ అయి బాల్కనీలో కూర్చుని చిక్కటి బ్రూ కాఫీ తాగుతూంటే సెల్ రింగయింది.
సంధ్య . . మా ఆడపడుచు. నిడదవోలు నుంచి.
హలో సంధ్యా. బాగున్నావా?
ఆ ! బాగున్నానొదినా. మీరెలా ఉన్నారు.
మేము బాగానే ఉన్నాం. బాలు , యమున , మీవారు ఎలా ఉన్నారు.
బాగానే ఉన్నారొదినా.
ఏదో విశేషం ఉంటే తప్ప మా ఆడపడుచు ఫోను చెయ్యదు. మా చందు పర్మిషను ఇవ్వాలి. అలాగని అతను పిసినారి కాడు. అతనన్నీ లెక్క ప్రకారం ఖర్చు పెడతాడు. అంతే.
ఏవిటి విశేషం సంధ్యా.
ఆ ఏం లేదొదినా.. మా మామ గారు ఆస్తి పంపకాలు, రిజిస్ట్రేషనూ ఉన్నాయనీ ఈ శెలవుల్లో అవి చేయించుకోడానికి రమ్మనీ ఫోను చేసారు. మేమిద్దరం ఆ పనులు మీద తిరుగూతూంటే బాలు, యమునలకి ఇబ్బంది అవుతుందేమోననిపిస్తుంది. అన్నయ్యకి ఫోను చేస్తే ఈ దసరాకి మీరెక్కడికీ వెళ్ళటం లేదన్నాడు. అందుకనీ...
అదేంటి సంధ్యా .. అడగడానికి అంత మొహమాట పడిపోతున్నావు. పిల్లలిద్దరినీ ఇక్కడికి పంపించేయ్. నేనొచ్చి తీసుకురానా ? మీ ఆయనకి శెలవుందో లేదో.
అయ్యయ్యో..నీకెందుకు శ్రమ వదినా..మీ తమ్ముడు గారు పిల్లలని దించి వచ్చేస్తారు.
ఏం ఫర్వాలేదు సంధ్యా. నీకెలా వీలయితే అలాగే. చందూతో పంపించు.
ఆ అలాగే వదినా.
ఆ..ఆ.. సంధ్యా...చందూ వచ్చేటపుడు, రేగు పండు వడియాలు పంపించు. మీ నిడదవోలులో అవి చాలా ఫేమస్ కదా. మీ అన్నయ్యకి,చంటిగాడికి చాలా ఇష్టం.
అలాగే వదినా..ఉంటాను వదినా.
ఆ..ఒకే. బై. ఫోను కట్ చేసాను.
********
ఆదివారం సాయంత్రానికల్లా చందు పిల్లల్నేసుకుని వచ్చి సోమ వారం ఉదయాన్నే వెళిపోయాడు.
ప్రయాణం లో అలసి పోయారేమో పిల్లలు టి.వి. చూస్తూనే నిద్ర పోయారు.
మా చంటి సిక్స్త్, వాళ్ళ బాలు ఫోర్త్ క్లాసులు చదువుతున్నారు.
మా అనూ ఫోర్త్ , యమున సెకండ్ క్లాసులు చదువుతున్నారు.
ఉదయాన్నే లేవగానే టిఫిన్లు చేసి పిల్లలందరికీ పెట్టి టి.వి. ఆన్ చేసాను.
నలుగురుకి ఒకరికొకరు అటాచ్ మెంట్ మొదలయింది.
వీళ్ళలో యమున చాలా మొండిది. తను అనుకున్నది సాధించి తీరుతుంది.
ఒకసారేమయిందంటే అనూ తనకి బొమ్మ ఇవ్వ లేదని ..ఆ రాత్రి అందరూ నిద్రపోయాకా లేచి ఆ బొమ్మని విరగొట్టేసి కామ్ గా పడుకుండిపోయింది.
దీంతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం కొంప ముంచుతుందో ఏమో.
బాలు అదో టైపు. అందరూ వాడి మాటే వినాలని, వాడే గ్రూపు లీడర్ గా అందర్నీ కమాండ్ చేస్తూంటాడు. వాడి మాట ఎవడన్నా వినక పోతే మాత్రం వాడి పని ఆంతే.
ఏమైనా ఇద్దరూ కొంచెం ప్రమాదమే..
కాసేపు కామ్‌గా అందరూ టి.వి. చూసారు. ఆ తర్వాత మా అపార్ట్ మెంట్ లో పిల్లల్తో ఆటలకి వెళిపోయారు.
నేను నా వంట పనిలో పడిపోయాను.
ఆయన్నించి ఇంకా ఫోన్ రాలేదు. ఎలా ఉన్నారో ఏమో.
వంట అయిపోయాకా అందర్నీ పిలిచి భోజనాల దగ్గర కూర్చోబెట్టేసరికి విసుగొ చ్చేసింది.
భోజనాలవ్వంగానే మళ్ళీ ఆటలకి వెళ్ళిపోయారు.
పిల్లలకి ఆటలుంటే చాలు. అన్న పానీయాలు అవసరం లేదు.
నేను భోంచేసి కాస్త నడుం వాల్చేను.
ఈ రోజు గడిచింది.
ఇంకా వీళ్ళతో వారం రోజుల పాటు అడ్జస్ట్ అవ్వాలి.
****
నాల్గు రోజులు గడిచి పోయాయి.
రోజూ ఆటలకి వెళ్ళి వస్తున్నారేమో, అలసి పోయి పడుకుంటున్నారు.
ఈ రోజు శుక్రవారం నాకు సంతోషి మాత పూజ. పులుపు పదార్ధాలేమి తినను.
పిల్లలందరికి విడిగా వండి నేనింత తినేసరికి
మూడో ఫ్లోరు లో సావిత్రి గారు లలితాసహశ్రనామ పారాయణం చేద్దామని పిలిస్తే వారింటికి వెళ్ళాను.
అపార్ట్మెంటులోని ఇంచు మించు అన్ని ఫ్లాట్ ల ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. అందరూ ముక్త ఖంఠంతో ఆ దేవిని స్తుతిస్తున్నారు.
ఇంతలో రాజ్యలక్ష్మి గారబ్బాయి బబ్లూ ఆయాస పడిపోతూ వచ్చాడు.
సరోజా ఆంటీ..సరోజా ఆంటీ..అంటూ నాదగ్గరకి వచ్చి షీలా ఆంటి వాళ్ళ బాబు లేడా వాడే నితిన్ ఆంటీ, వాడు పడిపోతే ముక్కు చిదిగిపోయి రక్తం కారిపోతూంటే అంకుల్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెల్తే అయిదు కుట్లు పడ్డాయట ఆంటీ
అయ్యయ్యో ఎలా పడిపోయాడు.
మీ ఇంటికి వచ్చిందే చుంచు మొఖంది..అదే ఆంటీ దాని పేరేంటి ఆ..ఆ..యమున..యమున. దాన్ని ఆటలొ చేర్చుకోలేదని కోపంతో వెనకాలే వచ్చి నితిన్‌ని తోసేసింది. పాపం షీలా ఆంటే ఏడ్చేస్తూన్నారు ఆంటీ.
మరుక్షణం లో షీలాగారింటికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ...ఎంత వద్దన్నాఅయిదు వందలు ఉంచమని చెప్పి , వారెదురుగానే యమునని నాల్గు వాయించి అందర్నీ ఇంటికి తీసుకొచ్చి పడేసాను.
ఇక రేపట్నుండి బయటికి పంపేదిలేదు అని తీర్మానించుకున్నాను.
*****
టిఫిన్లు తినేవరకూ కామ్ గానే ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇల్లంతా ఒకటే గోల.
అరుపులు..కేకలు, తిట్లు,ఏడుపులూనూ.
ఒకరు కార్టూన్ నెట్ వర్కు కావాలని, మరొకరు జెటిక్స్, ఇంకొకరు పోగో కావాలని..
నేనొచ్చి మొత్తం టీ.వీని కట్టేసాను.
ఇక బొమ్మల మీద పడ్డారు...ఒకే బొమ్మ నాకు కావాలని ఒకరు.. నాకుకావాలని మరొకరు.
మంచాల మీద పక్కలన్నీ చెరిపేసారు.
కప్ బోర్డు ల్లో బొమ్మలన్నీ పాడుచేసేసారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా రావణ కాష్ఠం చేసారు.
వీ ళ్ళతో మరొక రోజు గడపాలంటే మాటలా !
ఉదయాన్నే చందు వచ్చి పిల్లలని తీసుకెళిపోతే ఎంత బావుణ్ణు?
మా పిల్లలే నయం. నయాన్నో, భయాన్నో కొంచమయినా మాట వింటారు.
వాళ్ళొచ్చి చేరి వీళ్ళూ పాడయి పోయారు.
స్కూల్లో అంత మందిని కంట్రోల్లో పెట్టగలుగుతున్న దాన్ని
వీళ్ళనెలా కంట్రోల్లో పెట్టాలో అర్ధం కావట్లేదు.
పిల్లలకి స్కూల్ ఉంటేనే కంట్రోల్లో ఉంటారు.
ఇంతలో సెల్ ఫోన్ మోగింది ..స్కూల్ నుంచి
రిసెప్ష నిస్ట్ నీరజ.
హలో మేడం. నేను నీరజని మాట్లాడుతున్నాను.
ఆ. చెప్పండి నీరజా..
మీకో గుడ్ న్యూస్ !
ప్రభుత్వ ఆదేశాలననుసరించి శెలవులు మరో నాలుగు రోజులు పొడిగించారని కరస్పాండెంటు గారు అందరికీ ఇన్ ఫాం చేయమన్నారు మేడం.
హా !
బాగుంది
ReplyDeleteఒక్కోసారి అనిపిస్తుంది పూర్వకాలంలో అంతమంది పిల్లలతో అప్పట్లో ఎలా వేగేవారా అని. మేము ఆరుగురం. ఓ పాతిక ముప్పై ఏళ్లక్రితం ప్రతిఇంట్లోనూ నలుగురికి తక్కువ పిల్లలు ఉండేవారు కాదు కదూ.
శలవలు ఇచ్చారంటే మా ఇద్దరిపిల్లలతో ఇదే తంతు. :-)
మీ యమున చాల వయలంట్ వుంది కదా.
ReplyDeleteమీకు వారానికే ఇంత కష్టం అయితే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎంటా అని ఆలోచిస్తున్నా
బాగుందండీ మీ బ్లాగు.. ఇదే చూడడం.. పేరు కూడా బాగుంది.. చక్కగా తెలుగులో రాయొచ్చు కదండీ పేరుని.. మొత్తానికి సెలవులు బాగా ఎంజాయ్ చేశారన్న మాట :-) :-)
ReplyDeleteఇప్పుడిప్పుడే కష్టపడి ఆ స్టేజీ దాటేస్తున్నాను అని సంతోషిస్తున్నాను. పిల్లలు కాస్త విచక్షణ నేర్చుకునేదాకా పెద్దవాళ్ళ బాధలు ఇంతే.
ReplyDeletemy heart bleeds for you!
ReplyDeleteఇక్కడ కూడా చూస్తూంటా కదా, తమ దగ్గరికి సంగీయ్తమో నాట్యమో నేర్చుకోడానికొచ్చే పిల్లలందర్నీ కంట్రోల్లో పెట్టి చక్కగా విద్యాబోధన చేసేవాళ్ళు కూడా తమ తమ పిల్లల్ని కంట్రోలు చేసుకోలేక పోవడం.
బాబా గారికి
ReplyDeleteధన్యవాదములు,
ఇక్కడ రెండు విషయాలు. 1. ఉమ్మడి కుటంబ వ్యవస్థ 2. మీడియా ప్రభావరహిత సమాజం, ఈ సమస్య సాంద్రత ని తగ్గించగలిగేవే్మో.
మాఊరు గారికి,
ధన్యవాదములు,
బాగా వైలెంట్, పాపం జాలేస్తుంది.
మురళి గారికి,
ధన్యవాదములు,
మీరడిగినట్లు పేరుని రాయలేను, టైపాను.
ఓ...ఫుల్ గా:-)
సునీత గారికి
ధన్యవాదములు,
చెప్పలేం. పిల్లలు పెద్దవాళ్ళయాకా సమస్యలుండవని గారంటే లేదు.
కొత్తపాళీ గారికి
Thank you so much,
పెరటి చెట్టు మందుకు పనికి రాదన్నది నిజమం నేమో.
అందరికి మరో సారి ధన్యవాదములు.
ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
ReplyDeletehttp://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
mobile:9849693324
ఏంటండీ... ఇంకా పొడిగించిన సెలవుల్లో పిల్లల్తో సతమతమవుతున్నారా?? మీ నెక్స్ట్ పోస్ట్ (కవిత కావాలి, కవిత కావాలి) కోసం వెయిటింగిక్కడ...
ReplyDeleteమీ చేప పిల్లలు , అల్లరి పిల్లలు ముద్దుగా వున్నారు.
ReplyDeleteఏదో కాస్త అల్లరి చేయగానే అలా బెంబేలెత్తిపోతే ఎలా ?
పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి ? కూసింత అల్లరిపోషణ వుండాలండి !
చుట్టాలు రాలేదు కానీ ఉన్న ఒక్క పిల్లతోనే మీ టైప్‌లో శెలవులు ఎంజోయ్ చేసాను..!!
ReplyDelete