Sunday, January 3, 2010

పెళ్ళి పుస్తకం - 12

హిందూ వివాహ ప్రాశస్త్యము.
పండ్రెండవ భాగము
పాణి గ్రహణము:

బ్రహ్మముడి తంతు లోని మరికొన్ని మంత్రాలు తెలుసుకుందాం....


1.సోమ: ప్రధమో వివిదే గంధర్వోవివిద ఉత్తర:
తృతీయో అగ్నిష్టేపతి స్తురీయస్తే మనుష్యజా:

2.సోమో దద ద్గంధర్వాయ గంధర్వో దద దగ్నయే
రయిం చ పుత్రాగ్ శ్చాదా దగ్ని ర్మహ్యా మధో ఇమామ్.

1. కన్య పుట్టగానే కొంత కాలము సోముడు,కొంతకాలము గంధర్వుడు,
కొంతకాలము అగ్ని కాపాడుతారు. వారిని హోమ ప్రార్ధనాదుల గావించి
సంతృప్తి పరచి వారివలన పొందిన కన్యకు తాను పతి యగును.

2. సోముడు నిను గంధర్వుని కిచ్చెను, గంధర్వుడు నిన్ను అగ్ని కిచ్చెను.
నేను నిన్ను కాపాడవలసిన నాల్గవ వాడను. అగ్ని నాకు నిన్ను,
పుత్రులను ప్రసాదించుగాక.
అని అభి మంత్రించి పెళ్ళికూతురు చేయి పట్టుకొంటాడు.
దీనినే
పాణిగ్రహణము అంటారు.
ఇక్కడ ప్రధాన మైన రెండు మంత్రాలను,వాటి అర్ధాలను చూద్దాం.

'గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం
మయావత్య జరదృష్టిర్య దాసహ'


పెద్దలు ఎట్లు ఆచరించిరో అట్లే నేనునూ మంచి సంతతి కొరకు
నీ హస్తమును గ్రహించుచున్నాను.

'మూర్దన్వాన్ యత్రసౌభ్రవ:పూర్వ దేవేధ్య ఆతపత్
సరస్వతి ప్రేమదన సుషగే వాజినీవతి'


మన పూర్వులగు సుభ్రులు శిరోధార్యమగు శీలముతో ఎట్లు వెలుగొందిరో
అట్లు వెలుగొందునట్లు ఈమెను సరస్వతి లోకములోని జీవులకు
అగ్రగణ్యగా నిన్ను చేయు గాక ! అని వరుడు మంత్రాలు పఠిస్తాడు.

సప్తపది:

అంటే వరుడు వధువుని చేయి పట్టుకుని అగ్ని హూత్రము
చుట్టూ ఏడు అడుగలు వేస్తాడు.
ఈ ఏడడుగులలోను వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు.
ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది.
ఈ ఏడడుగులకు ఏడు మంత్రాలను పఠిస్తాడు.
ఈ సప్తపది పూర్తి కాని ఎడల వివాహము పూర్తి కానట్లే...

అగ్నికి ఉత్తరం వైపున కుడికాలు మొదట పెట్టి ప్రాద్దిక్కుగా గాని
ఉత్తర దిక్కుగా గాని వధువుని నడిపించుచూ ఏడు మంత్రాలు
చెపుతాడు.

1. ఏకమిషే విష్ణు స్త్వాన్వేతు
2. ద్వే ఊర్జే విష్ణు స్త్వాన్వేతు
3. త్రీణి వ్రతాయ విష్ణు స్త్వాన్వేతు

4. చత్వారి మయోభవాయ విష్ణు స్త్వాన్వేతు

5. పంచ్వశుభ్యో విష్ణు స్త్వాన్వేతు

6. షడృతుభ్యో విష్ణు స్త్వాన్వేతు

7. సప్తభ్యోత్రాభ్యో విష్ణు స్త్వాన్వేతు


భావం:

ఓ చిన్నదానా ! నీవు నావెంట నడువుము
విష్ణుమూర్తి నీవు వేసే....
మొదటి అడుగువల్ల అన్నాన్ని,
రెండవ అడుగువల్ల బలాన్ని,
మూడవ అడుగువల్ల మంచి కార్యాలను,
నాల్గవ అడుగువల్ల సౌఖ్యాన్ని,
ఐదవ అడుగువల్ల పశుసమృధ్ధిని,
ఆరవ అడుగువల్ల ఋతుసంపదను,
ఏడవ అడుగువల్ల ఏడుగురు హోతలను
నీకు ఇచ్చుగాక.

ఇవికాక వరుడు కొన్ని మంత్రాలను,
వధువు కొన్ని మంత్రాలను, ఇరువురు కలసి
కొన్ని మంత్రాలను పఠిస్తారు.
ఇవి భార్యా భర్తల అనుబంధాన్ని,భాద్యతలను వివరిస్తాయి.
అవి తరువాయి టపాలో....

కొసమెరుపు:
1. దక్షిణాఫ్రికాలోని కొన్ని జాతులలో వివాహ వేడుకలలోభాగంగా... వారి జీవితాలలో ముఖ్యమైనవిగా భావించే 12 వస్తువులని (ద్రాక్ష సారాయి,గోధుమలు,మిరియాలు, ఉప్పు, చేదు రుచినిచ్చే కొన్ని మొక్కలు,నీటి కుండ,చెంచా, చీపురు,తేనె, ఒక వ్యవసాయ పనిముట్టు, ఒక రక్షణ కవచం, బైబిల్ పుస్తకం) వివాహ తంతులోఉంచుతారు. వధూవరుల రెండు కుటుంబాల ప్రేమానురాగాలకు ప్రతీకలుగా వీటిని భావిస్తారు.

2. మరికొన్ని జాతులలో వధూవరుల తల్లిదండ్రులు
వారివారి ఇళ్ళనుండి కొలిమిలోని అగ్నితో వధూవరుల గృహం లో కొలిమి ని వెలిగిస్తారు.







2 comments:

  1. శ్రీనిక గారూ !
    పాణిగ్రహణాన్ని, సప్తపదిని చక్కగా వివరించారు. నిజానికి మీలాగే హిందూ వివాహ ప్రాశస్త్యము గురించి సామాన్య జనానికి తెలిసేటట్లు చెయ్యాలని గతంలో బుల్లితెరపై నేనొక ప్రయోగంచేసాను. అది చాలావరకు సఫలీకృతమయింది. మీ టపాలు చదువుతుంటే అప్పుడు చేసిన కసరత్తు గుర్తుకొస్తోంది. మీరు చాలా సూటిగా, స్పష్టంగా, సరళంగా వివరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అభినందనలు.

    ReplyDelete
  2. happy new year akka :)
    sorry for dealy.....

    ippudu little busy tapa chadavaledu malli tharvatha vasthanu

    once again happy new year..

    ReplyDelete