సంక్రాంతి వచ్చిందంటే...నాకు రెండు టెంషన్లు...
ఒకటి పండగదైతే..మరోటి..ఇంతకంటే ఎక్కువది..
ఈ నెలలోనే వచ్చేది...మా అమ్మాయి
యమున పుట్టిన రోజు.
తను చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
కాలి గోళ్ళ రంగు దగ్గర నుండి నెత్తి మీద పెట్టుకునే క్లిప్పు వరకూ
కనీసం పది షాపులు తిరగాల్సిందే..
ఈ పండగకి షాపులు ఎంత రద్దీగా ఉంటాయో తెలుసుకదా..
24 న పుట్టిన రోజు కదమ్మా..పండగ అయిపోయాకా వెళదామే అంటే
"పండగ అయిపోతే వెరైటీ లుండవ్...
ఇప్పుడే షాపింగు చేయాలి..అంతే
సరే కదాని ముందే కొంటే అవన్నీ పండగకి వాడేస్తాది.
మళ్ళీ పుట్టిన రోజుకి అన్నీ కొనాల్సిందే.
తను ఏదైన అంది అంటే అది జరగాల్సిందే..
లేకపోతే ఇల్లు పీకి పందిరివేసేస్తాది.
ఎపుడైనా ఏమైన అంటే చాలు... ఏ గదిలోకో వెళ్ళి కామ్ గా
మా ఆడపడుచుకి ఫోన్ చేసేస్తాది.
తనంటే మా ఆడపడుచుకి బాగా గారం.
ఆపై మా అత్తగారు.. ఇంట్లో ఉండనే ఉన్నారు.
ఇక వెంటనే ఫోను వచ్చేస్తాది. " ఎందుకొదినా..ఈ సారికి దానిష్టప్రకారమే
కానీయరాదూ.." అంటూ (ఎపుడూ దానిష్టప్రకారమే అన్నీజరుగుతాయి).
ఇక ఈ సం.రం. పుట్టిన రోజు టెంషను గత సం.రమే మొదలయింది.
ఎందుకంటే ఈ సం.రం.తన పుట్టిన రోజు 24 ఆదివారం వచ్చింది.
లాస్ట్ ఇయర్ అంతా గుర్తుకొచ్చినపుడల్లా మాబుర్ర తినీసేది.
పోని తిధుల ప్రకారం చేద్దామంటే 20 న వచ్చింది.
ఆ రోజు స్కూలు శెలవు. ఆమరుసటి రోజు నుంచి స్కూళ్ళు తెరుస్తారు.
ఇహ తన బాధ అంతా ఇంతా కాదు.
' ఇంక నేను కేకు ఎలా కట్ చేస్తాను.
చాకలైట్సు ఎవరికి ఇవ్వాలి ?
మా ఫ్రండ్స్ ఎవరూ ఉండరు'. ఒహటే ఆందోళన.
సరే ఇంత బాధ పడుతుంది కదాని..మేం బాధ పడి పోయి
ఎలాగోలా ఏదో చేయాలని అనుకుని.. నిన్న షాపింగుకి తీసుకెళ్ళాం.
తనకి CMR షాపింగు మాల్ అంటే ఇష్టం.
ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి.
మీరు నమ్మరు గాని మధ్యాహ్నం రెండు గంటలకు క్లోత్స్ సెక్షనులో అడుగెట్టాం.
బయటకొచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది. తన డ్రస్ కొనే కౌంటర్ లో
నలుగురు సేల్స్ గాల్స్ దీని సెలెక్షన్ ధాటికి తట్టుకోలేక
మెల్లగా సైడై పోయారు. ఒక ఇరవయ్ రెండు డ్రస్ లు మాత్రమే ట్రైల్ వేసిందంతే..
చివరికి తేల్చిందేమంటే..... ' ఇది నాన్నగారికి నచ్చింది..
ఇది అమ్మకి నచ్చింది...ఇది నాకు నచ్చింది.
సో మూడు తీసేసుకుంటాను'...
ఢాఢాఢాం .
ఏదో ఉన్న వాళ్ళమే కాని మరీ...ఒక రోజుకి
మూడు డ్రస్ లు కొనేంత రిచ్ కాదు.
తరువాత బంగారం..కొనాలి. డ్రస్ ల దగ్గర అనుభవం
అయిందికదా..అందుకని తనని, మావారిని
ఫుడ్ కోర్టుకి వెళ్ళమని ఆ పని తొందరగా కానిచ్చేసాను.
ఈ గోల్డ్ సర్ప్రైజ్ గా ఇద్దామని ముందే డిసైడ్ అయ్యాం.
షాపింగుకి వచ్చామంటే కంపల్సరీగా హోటల్లో
డిన్నర్ చేయాల్సిందే..లేక పోతే అదో పేచీ..
ఇంటికొచ్చేసరికి పదిన్నర...సెలవులు కదా..
మా బాలు రెచ్చిపోయి టి.వి చూసేస్తున్నాడు.
యమున ఊరికనే ఉండదుకదా......
" ఒరేయ్ అన్నయ్యా... నా బడ్డేకి మూడు డ్రస్ లు
తెచ్చుకున్నాన్రా!చూడు ఎంత బాగున్నాయో..
ఛీ..ఛీ ఇవేం బాగున్నాయ్..
హె ! చెత్త సెలక్షన్.. పరమ చెత్త సెలక్షన్...!
(మేం హోటల్లో తినివచ్చాం కదాని వాడికి కుళ్ళు)
ఢాఢాఢాఢాఢాం...అది నాకేసి
కొర కొరా చూస్తోందంటే....
మళ్ళీ కధ మొదలవుతాది..
కొసమెరుపు:
CMR షాపింగ్ మాల్ లో ఏది కొన్నా బిల్ చూపిస్తే
దాదాపు 100 నుండి 150 రూపాయిల విలువ చేసే
తాజా కూరగాయలిస్తున్నారండోయ్..
త్వరపడండి. ఇదే సమ్..క్రాంతి.
బ్లాగ్మిత్రులందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteసమ్..క్రాంతి కూరగాయల బంపర్ ఆఫర్ బాగుంది.
This comment has been removed by the author.
ReplyDeleteయమునా, పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఏం పర్లేదులే, ఈ సారి అన్నయ్యని తీసుకెళ్ళి మళ్ళీ కొత్త సెలెక్షన్ తో మంచి డ్రెస్స్ తీసుకో..ఏం...సో...నీకు పుట్టిన్రోజుకి నాలుగు డ్రెస్సులన్నమాట. వెరీ గుడ్. హ్యాపీ సంక్రంతి. నా సంక్రాంతి విషెస్ మీ మమ్మీ క్కూడా చెప్పేం.
ReplyDelete:) బాగుందండి మీ "సమ్" క్రాంతి...
ReplyDeleteఎంతైనా అమ్మాయిల పుట్టినరోజులకే హడావిడీ, సందడీను.. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి..
ReplyDeleteమీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteశ్రీనిక గారూ !
ReplyDeleteఆడపిల్లకు ఆ మాత్రం తప్పదేమో ! మీ యమునకు అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజెయ్యండి. బాలుకి తన బర్త్ డే కి బెటర్ లక్ అని చెప్పండి
పద్మార్పిత గారు,
ReplyDeleteబడ్డే ఇంకా డిసైడ్ చేయలేదండి...అడ్వాస్డ్ గా తీసుకుంటాను.
జయ గారూ,
బాబోయ్ మీ కామెంటుగాని చూసిందా...కొంప కొల్లేరే..ఈ రోజే మా అత్తగారు కొంచెం లైన్లో పెట్టారు.
మారుతి గారు,
ధన్యవాదాలు.
శ్రీలలిత గారూ,
ధాంక్యూ. అడ్వాంస్గా తీసుకుంటాను.
సునీత గారూ,
ధాంక్యూ. అడ్వాంసే సుమడీ..
డేట్ డెసైడయ్యకా..మళ్ళీ విష్ చేయాలి.
రావు గారూ
ధాంక్యూ సార్.
మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
ReplyDeleteAdvanced Birthday wishes to yamuna..and sankranthi wishes to your family....ee sari birthday ki minimum 5 dresses teesukovali yamuna...emantaru?
ReplyDeleteమీకు సంక్రాంతి శుభాకాంక్షలు .
ReplyDeleteయమున షాపింగ్ గురించి చదువుతుంటే మా అమ్మాయి చిన్నప్పటి బర్త్ డే షాపింగ్ గుర్తొచ్చింది .
happy birth day yamuna .
@ kishen Reddy,
ReplyDeletethank u very much. 5 dresses for 5 b'days o.k.
@ మాలా కుమార్ గారు,
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అమ్మాయి ని కూడా పరిచయం చేయండి. thank u.
@ ధరణీరాయ్ చౌదరి గారు,
ReplyDeleteధన్యవాదములు.
మీకు మీ కుటుంబానికి నూతం సం.ర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.