అందమైన పూల పానుపు పై
నీ అంతిమ దృశ్యాలు
నాలో ఘనీభవిస్తూంటాయి...
అవసరం తీరిపోయింది కదా
అందరూ తొందర పడి
నిను సాగనంపేసారు
ఎవరూ మిగలలేదు
మనిద్దరం తప్ప...
నువు లేవన్నది
ఎంత అబధ్ధమో
నేను ఉన్నాను అన్నదీ
అంతే అబధ్ధం..
నీ సమాధి మీద
మన పాప నాటిన
తులసి మొక్క
నన్నే చూస్తున్నట్లు ఉంది.
అవును నిజమే
నాకు కనిపిస్తున్నావు
నన్ను రమ్మంటున్నావు
నేను నడుస్తున్నానా !
నాకే తెలియదు..
నాలో నేను లేను
గుప్పెడు సముద్రాన్ని నింపి
నానుండి నన్ను
నువెపుడో తీసుకు పోయావు.
గది నిండా నీ స్మృతులే
కిటికీ తెరచి చూస్తే
అంతా చీకటి..
నీ చిత్తరువు మాత్రం
అదే చిరునవ్వుతో....
చాలా బాగుందండీ.మనస మూగోబోయినట్లయ్యింది విచారాన్ని తలచుకుని.
ReplyDeleteధాంక్యూ భావనగారు,
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు.