Sunday, January 17, 2010

బూరె పోయె ...బుధ్ధి వచ్చే !!


ఏవిటి..బూరెపోవడమేంటి బుధ్ధి రావడమేమిటి అనుకుంటున్నారా? ఇది వివరంగా చెప్పాలంటే.... కొంచెం చరిత్రలోకి వెళ్ళి అపుడు వర్తమానం లోకి వస్తాను. చిన్నప్పటినుండి బూరెలంటే నాకు చచ్చేంత ఇష్టం. అసలు..బాగా చిన్నప్పుడయితే బూరి నాకొక మిస్టరీ.
బూరె లోపలికి ఆ పూర్ణం ఎలా వెళ్ళిందబ్బా.... అని.

ఏ సినిమా తీసినా ఐటమ్ సాంగ్ ఎంత కంపల్సరీయో


చిన్నప్పటినుండి మా ఇంట్లో ఏ పండుగ చేసినా
మెన్యూలో
బూరె ఐటమ్ ఉండాల్సిందే.
సో.. అలా నా జీవితం బూరితో తీయని

అనుబంధాన్ని పెనవేసుకుంది.

ఎక్కడ ఏ ఫంక్షనికి వెళ్ళినా నా కళ్ళు బూరెల కోసమే వెతికేవి.
బంధు వర్గాలలో
ఈ విషయం తెలిసిపోయి
చిన్నప్పుడు నన్ను
ఏడిపించేవారు కూడా..
చిన్నప్పటినుండి గారాల పట్టీని కాబట్టి వంట
నేర్పలేదు.(నేర్చుకోలేదు) పైగా సగం జీవితం
చదువులకే సరిపోయింది. బూరెలు
తినడం మీద ఇంట్రస్ట్ పెంచుకున్నానే తప్ప
వాటిని వండడం నేర్చుకోవాలని ఎపుడూ అనుకోలేదు.

పెళ్ళయ్యాకా తెలిసింది మావారికి కూడా బూరెలంటే మహా ఇష్టమని.....
అప్పుడే
నేనో నిర్ణయం తీసేసుకున్నాను.
ఎలాగయినా బూరెలు వండటం నేర్చుకోవాలి.

మరొహటేంటంటే నాకు బూరెలు వండడం

రాదని ఆయనికి తెలిసి పోయింది.

వెంటనే దీని గురించి స్టడీ చేయాలనుకున్నాను.
అయితే ఎలా...?
ఎవర్నయినా అడగాలంటే చిన్నతన మనిపించింది.
మా వారు నా బాధ నర్ధం చేసుకుని..

ఓ రోజు...
నీకో విలువయిన గిఫ్టు తెచ్చానోయ్.
ఏవిటండీ..వంట చేస్తున్నాను..

అబ్బ ! కాసేపు ఆ స్టౌ ఆపి ఇటు రావే
చూద్దువుగాని..
ఇక తప్పేటట్టు లేదు. స్టౌ ఆపి వెళ్ళాను.
ఆయన చేతిలో ఒక గిఫ్టు పాక్.

ఏవిటండీ...నక్లెస్సా !..మొఖం చాటంత చేసుకుని..

ఛీ..ఛీ..అంత కంటే గొప్పదోయ్.
అంటూ నా చేతిలో పెట్టారు.
ఓపెన్ చేయ్...

మెల్ల మెల్లగ ఓపెన్ చేసేసరికి
చేతిలోంచి జారిపడింది...
' అన్నపూర్ణ - వంటలు, పిండివంటలు ' పుస్తకం.
వంటలు రావని భార్యని ఛీదరించుకొని

బాధలు పెట్టిన భర్తలెందరినో చూసాను.

కాని మావారు ఎంత మంచి వారో...వంటల పుస్తకం
తీసుకొచ్చి నేర్చుకోమని అవకాశం
ఇవ్వడం,
ఆయన ప్రోత్సాహం నన్ను
మరింత రెచ్చగొట్టింది.
ఈ రోజెలాగైయినా బూరెలు వండుతానండి...
వంట అయిపో్యాకా బూరెలు ఐటం చదివాను.

ఒక్క సారే మనసంతా తేలికైపోయినట్లయింది..

ఏవండీ చూసారా! బూరెలు వండడం చాలా ఈజీ.
అయితే ఈ రోజు స్పెషల్ ...బూరెలన్నమాట....మావారు..

వెంఠనే పప్పు నానబెట్టేసాను...

సూచనల ప్రకారం ఫాలో అయిపోయాను.

ఆయనయితే వండబోయే బూరెలను తలచుకొని
గాల్లో తేలిపోతునట్లు న్నారు. పిల్లలనిద్దరిని తెగ ఆడించేస్తూన్నారు.
నిజం చెప్పొద్దూ...నా పరిస్థితి అలాగే ఉంది.

ఇంత పెద్ద సమస్య ...ఎంత సింపుల్ గా తీరిపోతుందా ని...

పప్పు గ్రైండర్ లో వేసి పక్కన పెట్టుకున్నాను.

ఇపుడు పూర్ణం తయారీ...

పూర్ణం కలుపుతుంటుంటే
మెల్ల మెల్లగా
అది పలుచగా తయారయింది.

అది వుండలు చేసుకునే వీలు లేదు. అంతా వేస్ట్.

ఎందుకలా తయారయిందో అర్ధం కాలేదు.

మరో ప్రక్క బూరెల వంట ఫెయిలయిందే అన్న బాధ...

వెనకనుంచి మావారు..

నెవర్ మైండ్..ఫస్టైమ్ కదా. నెక్స్టైమ్ బెటర్ లక్...
అంటూ ఆయన బైటకెళ్ళిపోయారు..
నా కోరిక మరింత బలపడింది.
ఈ సారి ఎలాగయినా సాధించాలి.
మరో రోజు...ఒకటికి పదిసార్లు చదివి మొదలు పెట్టాను.
సక్సెస్ ఖాయం అని పిస్తుంది.
నిజమే...సక్సెస్...
దోర దోరగా, వేడి వేడిగా బూరెలు రెడీ....
బూరెను చిదిమి కాసిన నెయ్యిని
మధ్యలో వేసి తింటే...ఆహా ఏమి రుచి !
అని అనుకుంటూంటే...వెనక నుంచి మావారు...
ఎవిటోయ్...చుట్టూ ఉన్న పిండి ఇంత థిక్ గా ఉంది.
ఒకె..ఒకె..నాట్ సో బేడ్..
షిట్ ! మళ్ళీ ఫెయిల్....
No. No. Half lost is half won. అనుకుని
కాన్ఫిడెంస్ బిల్డప్ చేసుకున్నాను.
ఈ సారేమయినా సంక్రాంతికి సాధించాలి.
నా ఫ్రెండ్ సరిత వంటల గురించి
http://www.sailusfood.com/ లోచూడమంది.
ఓహ్.మంచి ఫోటోలతో చాలా బాగుంది సైటు.
ఇంచుమించు ఇందులో కూడా ఒకేలా ఉంది.
చక చకా అన్ని పనులు జరిగి పోయాయ్.
సల సలా కాగుతున్న నూనెలో ఒకటి ఒకటిగా
వేస్తున్నాను....ఝమ ఝమలు ముక్కు
పుటాల్లో గిలిగింతలు పెడుతున్నాయి. ఇంతలో...
ఠాప్...ఠాప్....ఠాప్.....ఠాప్.....?
కట్ చేస్తే....
మంచం మీద నేను..మంచం పక్కన పిల్లలూ
నా పక్కన మావారు.. చేతిలో బర్నాల్....

ముఖం మీద, చేతుల మీద ఆయిల్ చెదిరి

కాలిన బొబ్బలపై బర్నాల్ రాస్తూ.. ఏమోయ్...

Half lost may also be lost forever.
ఇదెందుకో నీకు కలసి రాలేదు.
మనం
హోం ఫుడ్స్ నుండి తెచ్చుకుందామ్లే..
అయినా.. నా హెల్మెట్, నీ కిచెన్ గ్లవ్స్

వేసుకో లేక పోయావా ?

13 comments:

  1. ento ee madya ammayilaki vantale rakunda poyayi kalikaalam.:)
    nenu kuda mi kovaloke vastanu ;).
    oka sari school lo unapudu ma amma idlilu cooker lo petti vandamandi. sare ani cooker lo pettanu kani ma amma dantlo water poyalani cheppaledu. idlilu gattiga vachhay water lekapovadam valla :(
    ee madya baga vantala mida interest perugutundi. nerchukunte easygane anipistundi andi. try cheyandi baga. all the best.

    ReplyDelete
  2. అయ్యో ఎంత పనయ్యింది :(
    అయినా పట్టు వీడకండి. ఎవరైనా బూరెలు వండడం వచ్చిన వాళ్లని ప్రక్కన పెట్టుకుని వడడం మొదలు పెట్టండి. మీరు అడక్క పోయినా వాళ్లే చెప్తారు ఇదిలా కాదమ్మాయ్ ఇలా రుబ్బాలి... ఇలా కలపాలి ... అంటూ. ఇక మీ పని ఈ జీ అవుతుంది. అలా చెప్పడం మొదలు పెట్టిన తరువాత ఓ అమాయకపు మొహం పెట్టి ఇది ఇలాగేనా పిన్ని గారు అని ఓ సారి అడగండి అంతే మీ చెయ్యి పట్టుకుని వండించేస్తారు... తరువాత మరోసారి మీరే సొంతంగా వండుకోవచ్చు. :)

    ReplyDelete
  3. అయ్యో పాపం బాగా కాలిందా ? బహుసా పిండి పేలిం దేమో ! జాగ్రత్త .
    ఓ సారి మీ అమ్మగారి తో చూపిన్చుకొని చేయండి .

    ReplyDelete
  4. బుక్ చదివి టొమేటో బాత్ చేస్తే బాగానే ఒచ్చిందే నాకు! అయినా నేను చేసింది బూరెలు కాదు కదా. బహుశా, బూరెలు చేయటం చాలా కష్టమే అనుకుంటా. అలా మొహం, చేతులు కాల్చేసుకుంటే ఎలాగండి? పోన్లెండి...భయపడకుండా ఈసారి బాగావొచ్చిన వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని, చక్కగా బూరెలు చేసుకొని తినేయండి. All the best.

    ReplyDelete
  5. అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

    http://telugusimha.blogspot.com/

    ReplyDelete
  6. ayyo jagratha andi,vanta dagagra.mukhyamga nune dagagra chala jagrathaga vundali.

    ReplyDelete
  7. అయ్యో..అయ్యో అలా చేతులు కాల్చేసుకుంటే ఎలాగండి!!!

    ReplyDelete
  8. ఆహా...ఏదో అలా చెబుతున్నారు కాని బూరెలు భలేగున్నాయండి ఫోటోలో:).

    ReplyDelete
  9. అయ్యో పాపం. మరీ ఇన్ని బూరె కష్టాలా. అయినా వహ రెహ్ వహ ఉంది గా. అది చూడకపోయారా. నా శ్రీమతి మొత్తం వంటంతా అన్డులోనించే నేర్చుకుంది. మీ టపా చూస్తే నేనెప్పుడో రాసుకున్న బూరెల కవిత గుర్తుకొచ్చింది. http://maanasasanchara.blogspot.com/2009/03/blog-post_7584.html

    ReplyDelete
  10. శ్రీనిక గారూ !
    సాధనమున పనులు............. ! బెటర్ లక్ నెక్స్ట్ టైమ్.

    ReplyDelete
  11. @ శిశిర గారూ,
    ధాంక్యూ....
    @ స్వప్న గారూ,
    నీరు లేకుండా ఇడ్లీ వండేసారా? వెరీ నైస్.
    @ విశ్వ ప్రేమికుడు గారూ,
    మీ ఐడియా బాగుంది.ఈసారి ట్రై చేస్తాను.
    @ మాలా కుమార్ గారూ,
    ధాంక్యూ.
    @ జయ గారూ,
    ఈసారి అలాగే చేస్తాను.
    @ నాగప్రసాద్ గారూ,
    ఏం చేస్తాం? :(
    @ తెలుగు బ్లాగ్ సింహం గారు,
    చూసాను. భలే బాగుంది.
    @ swathimadhav గారూ,
    ధన్యవాదాలు.
    @ ప్రేరణ గారూ,
    ధన్యవాదాలు.
    @ సృజన గారూ,
    అవును నిజమే...
    @ వాసు గారూ,
    ధన్యవాదాలు. బాగుంది.
    @ SRRao గారూ,
    ధాంక్యూ..
    నా మీద ఇంత ఆదరణ చూపిన అందరికీ కృతజ్ఞతలు. బ్లాగ్లోకమ్లో
    ఇంతటి ప్రేమాభిమానాలు ఉంటాయని అనుకోలేదు.ధన్యవాదములతో
    మీ
    శ్రీనిక.

    ReplyDelete