Monday, December 31, 2012

"Amanath" Lost.Can Indian Youth change ?



అమానత్ ని కోల్పోయాం. దేశం యావత్తు విషాద చాయల్లో మునిగిపోయింది. యావద్భారతాన్ని కదిలించిన యువత  ఈ నూతన సమ్వత్సర వేడుకలను బహిష్కరిస్తే ఎంత బాగుణ్ణు. పబ్బులకు, క్లబ్బులకు వెళ్ళకుండా రాత్రంతా కొవ్వొత్తుల కాంతులతో సమాజపు నీలి నీడలని ప్రారదోలితే ఎంత బాగుణ్ణు.  పాశ్చాచ్య సంస్కృతి ద్వారా పొందిన  సౌఖ్యాలకన్నా, కోల్పోయిన విలువలని యువత  గుర్తించిననాడే నిజమైన నూతన సం వత్సరం.  
ంక్షి్తూ....


 నివాళి...
నువు ఎవరివో నాకు తెలియదు
కాని మా గుండెల్ని నీ గుండె ధైర్యం తో
నింపి వెళిపోయావు..
నువు చేసిన తప్పేమిటో తెలియదు
కానీ శిక్షా స్మ్రతి పరిధుల్ని మించి
శిక్షించ బడ్డావు..
నువు ఈ లోకమ్లో లేవన్నది
ఎంత నిజమో
అత్యాచార రహిత లోకాలకి
తరలిపోయావన్నది
అంతేనిజం...

Sunday, November 25, 2012

పాఠం పూర్తయ్యాకా....

ఒకోసారి 
అలసిన మనసుకి ఆలంబనవై
మరోసారి 
అమరిన అనుబంధాలకు విఘాతమై
యాభై ఎనిమిదో ఏట 
ఆహ్వానించని అతిధిలా వస్తావు 
ఎపుడొస్తావో తెలుసు అయినా
మరికొంత ఆలశ్యమవాలని...

హాజరు పుస్తకం లో నా చివరి సంతకం 
వేల ప్రశ్నలని సంధిస్తుంది 
రెక్కలుడిగిన నాకు 
పిల్లలు కొత్తరిక్కలు తొడిగి 
తమతో పాటు ఎగరమంటారు
సహకరించని మనసు 
ససేమిరా అంటుంది 

పదవీ విరమణ అంటే 
జీవితపు చరమాంకమనీ
విశ్రాంత యానమని అంటారు 
కానీ నాకు మాత్రం 
జీవితం లో చేయాల్సిన 
నేక పనుల్లో ఒక పని పూర్తయి 
మరో పనిలోకి వెల్తున్నట్లే
ఒక పాఠం పూర్తయ్యాకా
మరో పాఠం నేర్చుకోవడమే..
 
ఇపుడు నాకోసం నేను 
నా సృష్టి కర్తతో 
సంభాషించుకునే అవకాశం 
అతని సన్నిధిలో సేదతీర్చుకునే భాగ్యం 
పదవీ విరమణ ఎవరికేమయినా
నాకు మాత్రం ఓ వరం ...

Sunday, November 18, 2012

కార్డుకధల పోటీ - సృజన..విశాఖ

వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో ప్రతినెలా మూడవ ఆదివారం సాహితీ ప్రియులను ఎంతగానో అలరిస్తోన్న సంస్థ ...విశ ్గ్షికో్స ంద్భంగా  పోస్టు కార్డు కధల పోటీ ని నిర్వహిస్తూంది.

ఇతివృత్తం మీ ఇష్టం.  కధ పోస్టుకార్డుకి ఒక వైపుని మాత్రమే వ్రాయాలి.  వెనుకవైపు క్లుప్తంగా హామీపత్రం, చిరునామా మరియు ఫోను నెంబరు పేర్కొనాలి.  ఒకరు ఒక కధ మాత్రమే పంపించాలి.

బహుమతుల వివరాలు :  పోటీకి పంపిన వాటిలో ఉత్తమ మైన మూడు కధలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి.

జనవరి 2013 ఆఖరి  వారం లో జరుగు మా సంస్థ నాలుగవ వార్షికోత్సవ సభలో విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రం కూడా అందచేయడం జరుగుతుంది.

పోస్టుకార్డు కధలు మాకు చేరాల్సిన ఆఖరు తేది: 20.12.2012. మీ రచనలు పంపాల్సిన చిరునామా:

గుండాన జోగారావు,                                          బొల్లోజు దుర్గాప్రసాదు,
అధ్యక్షులు, సృజన....విశాఖ                                కార్యదర్శి , సృజన....విశాఖ
6-242, శ్రీ సాయి నగర్                                        సెకండ్ ఫ్లోర్ 303, సాయి బాలాజీ హోంస్
సింహాచలం పోస్టు                                               చినముషిడివాడ, సుజాతనగర్ పోస్టు
విశాఖపట్నం - 530 028                                    విశాఖపట్నం - 530 051
సెల్ నెం. 94901 85708                                     సెల్ నెం. 98492 74738

Sunday, May 6, 2012

సమూహం లో నేను..

సమూహం లో నేను
సమూహంలో సంచరిస్తూనే
ఒంటరినై  పోతూంటాను
దేహం లోని రక్తనాళాలన్నీ
హృదయం లోకే చేరుకున్నట్లు
ఒక్కరొక్కరూ నాలో కలసిపోతూంటారు
అపుడు నేను అనేక నేనులుగా
విడిపోయి నన్ను నేను
ఒక్కొక్కరిలో వంపుకుంటూంటాను
నేనంటూ ఏమీ మిగలకుండా..

సమూహం లో సంచరిస్తూనే
నన్ను నేను మొలకెత్తుకుంటూ
పూలని, ముళ్ళనీ పంచిపెడుతూ
నాదికాని ప్రపంచమ్లో
నాకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ
నేనొక చెట్టునవుతాను
నా నీడ నా అస్థిత్వాన్ని ప్రశ్నించినపుడు          
నేనొక శుష్క సౌధాన్నవుతాను..

Thursday, March 22, 2012

నిలువెల్ల కనులై...

చుస్తూన్నా నందనా నీ రాకకోసం
నీ వెన్నంటి వచ్చే వసంతానికై
వాడియైన చేతలతో
ఖరనామ సమ్వత్సరం
మిగిల్చింది వేడివేడి వాతలు
మధ్యతరగతి జీవితాలపై
ధరల వరల మోతలు

కొంగ్రొత్త చిగురుల సోయగాలతో
కనకాంబర అంబరాలలో
ముద్దబంతి మాలలతో
ముచ్చటగా ముద్దులొలికే
ముగ్ధ మనోహర వసంతలక్ష్మీ స్వాగతం

మా మానస వనమ్లో
ఆనంద మందారాలను
విరబూయ నందనా
నీకు స్వాగత వందనం

రాష్ట్రం సుభిక్షమై
నందన నామ ఉగాది
కావాలి అందరి
ఆనందానికి పునాది.

బ్లాగ్మిత్రులందరికీ
శ్రీ నందన నామ శుభాకాంక్షలు

Saturday, January 14, 2012

నది నడచిన జ్ఞాపకం

సంక్రాంతి వచ్చిందంటే
మా ఊరిలో దాచుకున్న
జ్ఞాపకాల మూటని విప్పుకుంటాను
అడుగడుగున గొబ్బెమ్మలు
అందమైన ఆడపడుచులు
గొబ్బెమ్మల ఆటపాటలు
గంగిరెడ్ల నృత్య విన్యాసాలు
డూడూ బసవన్న గంటల గలగలలు
హరిదాసుల హరినామ స్మరణలు
ఇలా ఎన్నో ఎన్నెన్నో
అదృ శ్య దృశ్యాల మీద
నగ్నంగా విహరిస్తూంటాను

నాఊరి గడప గడపనుండి
సంక్రాంతి సంస్కృతీ నది
వీధి వీధినా నడిచిన జ్ఞాపకం....

నగరీకరణ వరదలో
నా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా


బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Sunday, January 1, 2012

నేను చూసిన రెండు రెండు వేల పన్నెండ్లు ...

నిన్న అన్నయ కి బాగాలేదని ఫోన్ వస్తే నేను జ్వరం తో కొద్దిరోజులుగా బాధ పడుతున్నా
కాకినాడ వెళ్ళాను.
రాత్రి 8.00 గంటలకి విశాఖ నాన్ స్టాప్ బస్సెక్కాను. బస్టాండు చాలా తక్కువమంది జనంతో ఏదో కోల్పోయినట్లుంది. నిజమే 2011ని కోల్పోతున్నాం కదా..దాన్ని వేడుక చేసుకునేందుకు ప్రజలందరూ బిజీగా ఉన్నారేమో. (నిరాశా వాదమా ??)
విశాఖ పట్నం ఎన్.ఏ.డి జంక్షన్లో అడుగు పెట్టేసరికి సరిగ్గా రాత్రి 12.00.. అప్పటికే అక్కడ చేరిన యువత కేరింతలతో బాంబుల మోతతో జంక్షన్ దద్దరిల్లుతోంది. జంక్షన్ నుండి నేను పెందుర్తి వైపు వెళ్ళాళి. ఆటో కోసం నిలబడ్డాను. నాలా బస్సు దిగినవాళ్ళు నలుగురైదుగురుం ఉన్నాం. మామూలుగా అయితే ఆ టైములో జంక్షన్ నిర్మానుష్యంగా ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తేనే గాని ఆటో దొరకదు. లక్కీగా ఒక కుర్రాడు ఆటో మా ముందుకి తీసుకొచ్చి ఆపాడు..
అందరం గబగబా ఎక్కేసాం. నరాల్ని కోసే స్తున్నట్లు చల్లగాలి. స్పీకర్లోంచి 100% లవ్ సినిమా సాంగ్స్ సన్నగా, మెలోడియస్ గా వినబడుతున్నాయి.
దారి పొడవునా మత్తులో ఊగిపోతూన్న కుర్రకారు మా ఆటోకి అడ్డంపడి మరీ మా అందరికీ హేపీ న్యూఇయర్ విషెస్ చెపుతూ ఆనందిస్తున్నారు.
మా ఆటో కుర్రాడు మాత్రం పైకి నవ్వుతూ విషెస్ చెపుతున్నా లోపల గంభీరంగా ఉన్నాడని పించింది.
నువు నీ ఫ్రెండ్స్ తో ఈ టైములో ఎంజాయ్ చేయకుండా ఆటో ఎందుకు వేసావ్.. ఉండలేక అడిగాను.
ఏం లేదు సార్... ఈ రోజుతో దీని ఫైనాంస్ తీరిపోయి రేపటి నుండి ఈ ఆటో నా స్వంతమవుతుంది సార్. ఈ రోజు కోసం ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తూన్నాను. నిజానికి ఇలా హేపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది సార్..
భాద్య్తత మరిచి మత్తులో తూలుతూ 2012 లోకి అడుగు పెడుతూన్న యువత ఒకవైపు ...
బాధ్యతని భుజాన్నెత్తుకుని లక్ష్యం దిశగా 2012 లోకి దూసుకు పోతూన్న యువత ఒకవైపు...

బ్లా గ్మిత్రులంద రికీ నూతన సమ్వ త్సర శుభాకాంక్షలు