హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఆరవ భాగము
వివాహ మంత్రాల అర్ధం
వివాహ సమయం లో వధూవరులతో చెప్పించే మంత్రాలను పరిశీలిస్తే మం ప్రాచీనుల దూరదృష్టి, భావ పటిష్టత ప్రతి పదమ్లో కనిపిస్తుంది. కనీసం కొన్ని మంత్రాలకైనా అర్ధాలు కొత్తగా పెళ్ళి చేసుకునేవారు, పెళ్ళి అయిన వారు గ్రహిస్తే మన సంప్రదాయ తత్వం బోధపడి కొన్ని సందేహాలు తొలగిపోయి లోక కళ్యాణం జరుగుతుంది. అందుకే కొన్ని మంత్రాల భావాలను తెలుసుకుందాం. ఇవి కేవలం జనబాహుళ్యం లో ఉన్నవి మాత్రమే కాని.... ఇవే అన్ని మంత్రాలు కాదు.
కాశీ యాత్రకు వెళ్ళునపుడు(ఇది కొన్ని వర్ణాలలో) బంగారు ఆభరణాలు ధరిస్తారు. అందువలన కలిగే లాభములు ఈ మంత్రములో...." ఆయుష్యం,వర్చస్యం రాయస్పోష మౌద్బిదం
ఇదం హిరణ్యం వర్చస్వజైత్రాయా విశతాదిమాం "ఆయుష్షు ను వర్చస్సును, జయమును కలిగించుట కొరకు
నాయందు ఉండుగాక.
" శత శారదా యాయుష్మాన్ జరదృష్టి ర్యదాసత్
మృతాదుర్ల్ప్తప్తం మధువత్ సువర్ణం ధనం జననం
రుణం దార యిషుణం " నూరు సం వత్సరముల వరకు ఆయువు, ముసలినతనం వచ్చువరకు జీవించి యుండునట్లు చేయును గాక !
నేతి నునుపు ఆరకుండునట్లు గా మంచి రంగు సంపద, జయము దృఢత్వము కలుగును.
" ప్రియం మా కురదేవేషు ప్రియం రాజసు
మా కురు ప్రియం విశ్వేషు గోప్ర్తేసు II"నాకు దేవతలతోను, రాజులతోను, లోక రక్షకులతోను, ప్రియ సంబంధము కలిగింపుము.
ఈ విధంగా మనం మంత్రాన్ని బంగారాభరణాలను ధరించుతూ చెపుతారు.
కొసమెరుపు:@ Shaadi ke pehle - Ek Duje Keleye
Shaadi ke baad - Sirf Bachcho Ke Liye@ Shaadi ke pehle - Dilwale Dulhaniya Le
Shaadi ke baad - Baaki Log Sukhi Ho jayenge
@ Shaadi ke pehle - Chandramukhi
Shaadi ke baad - Jwaalamukhi
@ Shaadi ke pehle - Maine Pyar Kiya Shaadi ke baad - Ye Maine Kya Kiya?