Wednesday, December 9, 2009

పెళ్ళి పుస్తకం - 8 (కన్యాదానము)


హిందూ వివాహ ప్రాశస్త్యము
ఎనిమిదవ భాగము
వివాహ విధానం లో అతి ముఖ్యమయినది కన్యాదానము.
ఎన్నో సం.రాలుగా ప్రేమ,మమకారాలతో పెంచుకున్న
కూతురుని ఈ ప్రక్రియతో వరునికి,
అతని కుటుంబానికి
సుఖసౌఖ్యాలను అందించాలనీ, వంశాభివృధ్ధి గావించాలని
సాక్షాత్ లక్ష్మీ సమానురాలైన కన్యని దానం చేయడం జరుగుతుంది.
కన్యాదానము చేయునపుడు కన్యాదాత కొన్ని మంత్రాలను చెపుతాడు.
అష్ట వర్షకన్యా పుత్రవత్పాలితామయా
ఇదానీం తవదాస్యామి దత్తాం స్నేహేన పాలయ II

పుత్రునితో సమానముగా పెంచబడిన ' 8 సం.ల వయస్సు గల
ఈ కన్యను నీకిచ్చుచున్నాను. నీవు ఈమెను
ప్రేమాభిమానాలతో కాపాడుము.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
అమ్మాయి కి 8 సం.రాల వయస్సు వచ్చినంతనే ఆమె
కన్యగా పరిగణించ బడుతుందనీ. ఈ వయస్సు వచ్చునాటికి
కన్యాదానము జరగాలని, మనుధర్మశాస్త్రం చెపుతుంది.
కన్యానం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం II
దాస్యామి విష్టవే తుభ్యం బ్రహ్మలోక జగీషియాII

బ్రహ్మలోకమును సాధించుట కొరకు, సువర్ణ సంపద గలదియు,
సువర్ణాభరణములచే అలంకరింపబడినదియు
అగు ఈ కన్యను సాక్షాత్ విష్ణు స్వరూపుడగు
నీకు ఇచ్చుచున్నాను.
విశ్వంభర: సర్వభూతా: సాక్షిణ్య: సర్వదేవతా:
ప్రదా స్యామి పితృణాం తారణాయవై.

దైవము, పంచభూతములు, సమస్త దేవతల సాక్షిగా
పితరులు తరించుటకు ఈ కన్యను దానము చేయుచున్నాను.
కన్యాం సాలంకృతాం సాధ్వీం. సుశీలాచ,సుధీమతే
ప్రయతోహ్నం ప్రయ చ్చామి ధర్మకామార్ధ సిధ్ధయే II

అలంకారములతో కూడినదియు, సాధుశీలయగు
ఈ కన్యను ధర్మకామార్ధ సిధ్ధి కొరకు పూనుకొని నేను ఈ సుశీలుడగు
బుధ్ధిమంతునుని దానము చేయుచున్నాను.
తుభ్యం ప్రజా సహత్వ ధరంభ్య: ప్రతిపాదయామి
సంతతి ని పొందుటకు, కర్మలకొరకు నీకు ఈ కన్యను నియమించుచున్నాను.
కావున వృణీధ్వం వరింపవలసింది. వృణీమహే: వరించుచున్నాను. అని వరుడు బదులు పలుకుతాడు.
వయోదాత్రే మయోమహ్యం అస్తుప్రతిగృహుత్వే

కన్యనిచ్చిన దాతకును, స్వీకరించిన నాకును బాంధవ్యము కలుగుగాక.

కన్యాదానమందలి మరిన్ని వివరాలు మరో టపాలో

కొసమెరుపు
  1. Marriage is a three ring circus: engagement ring, wedding ring, suffering.
  2. There are two times a man does'nt understand a woman, before marriage and after marriage!

6 comments:

  1. మీరు చూపిన శ్లోకాలలో దోషాలున్నాయేమో ఒక్కమారు పరిశీలించి, ఉంటే సరిచేయగలరు.
    నకు తోచిన మార్పులు సూచుస్తున్నాను:-
    1) అష్ట వర్షా భవేత్ కన్యా (లేదా) అష్ట వర్షాదియంకన్యా.
    2) కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం.
    3) విశ్వంభరః సర్వ భూతా: సాక్షిణ్యః సర్వ దేవతాః
    4) కన్యాం సాలంకృతాం సాధ్వీం. సుశీలాచ,సుధీమతే
    ప్ర్యతోహ్నం ప్రయ చ్చామి ధర్మకామార్ధ సిధ్ధయే II

    ReplyDelete
  2. చింతా రామకృష్ణారావు గారు,
    అచ్చుతప్పులు సవరించినందులకు ధన్యవాదములు
    టపాలో సరిచేసినాను. గమనించగలరు.

    ReplyDelete
  3. ఎక్కడిదండీ ఈ ఇంఫర్మేషన్ అంతా!!! చెప్పానుగా, చాలా పరిశోధనల ఫలితమే ఇది. అవును కదూ...

    ReplyDelete
  4. హాయ్ శ్రీనిక అక్క ... బావున్నారా ? ఈ టపాలన్నీ సేవ్ చేసుకుంటున్న నా పెళ్లి నాటికి నేను తెలుసుకోవాలి కదా :) :)

    అంటే మనుధర్మం రాసే నాటికి అమ్మాయికి 8 సం.రాల వయసుకే పెళ్లి చేసేవారన్న మాట.. ఇంకా స్త్రీ పురుష అసమానతలు ఈ వరకట్నం అనే తెగులు పుట్టినప్పటినుంచి పుట్టిందే కాని ,అంతకు ముందు ఆడపిల్ల పుట్టినా ఆనందమే (ఇప్పుడైనా కొంత మదేలే అలా బాధపడే వాళ్ళు )

    "సాక్షాత్ విష్ణు స్వరూపుడగు
    నీకు ఇచ్చుచున్నాను."

    ఇక్కడ నాకు ఒక చిన్న అనుమానం తీర్చ గలరు అని ఆశిస్తున్నాను...
    మరి ఈ మంత్రాలు శైవులకు చదివేప్పుడు ఇలా చెప్పరు కదా! అంటే అబ్బాయి విష్ణు సమానుడు అవడు కదా!
    ఇక్కడ ఒక కోత + కొంత వేరే చేరుస్తరన్న మాట శైవులకు.. అవి కూడా చెప్తే బావుండు...

    ఇంకొక్క చిన్న విషయం అక్క....
    " దైవము, పంచభూతములు, సమస్త దేవతల సాక్షిగా
    పితరులు తరించుటకు ఈ కన్యను దానము చేయుచున్నాను."

    దీనిలో ' పితరులు తరించుటకు' అనే దాని గురించి వివరించి ఉంటే బావుండేది అక్క ...

    ఇంకా కొసమెరుపు కేక :- There are two times a man doesn't understand a woman, before marriage and after marriage!
    దీని గురించి నా అబిప్రాయం చెప్పనా (కోప్పడ కూడదు మరి :) )
    స్త్రీ మనసు "పుష్పక పుస్తకం" లాంటిది ఎంత చదివినా ఇంకా చదవాల్సిన పేజి ఒకటి మిగిలే ఉంటుంది :) :)

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  5. జయ గారు,
    ముస్లిం, క్రైస్తవ వివాహ ఆచారాలను కూడా అధ్యయనం చేస్తూన్నాను.
    మీ ప్రోత్సాహం వాటి విషయాలను కూడా పోస్ట్ చేయగల ధైర్యాన్నిస్తుంది. ధన్యవాదములతో....

    @ కార్తీక్
    మంచి ప్రశ్న.శైవులకు, వైష్ణవులకు కొన్ని శాఖాపరమయిన వైరుధ్యాలున్నపటికీ, ప్రాధమికంగా ఈ ఆచారాల మూలాలు మాత్రం ఒకేలా ఉండి పరమాత్మ ఒక్కడే అనే భావాన్ని కలుగచేస్తుంది.
    ఉదా. నిత్యధానశీలి పరమేశ్వరుడు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూంటాడు.
    మహోత్కృష్టమయిన మానవ జన్మని ప్రసాదించిన పితరులకు తీర్చుకోవల్సిన ఋణాల్లో వంశాన్ని వృధ్ధి చేయటం ఒకటి.వైవాహిక జీవనం కేవలం వంశాన్ని ప్రాపగేట్ చేయడానికేనని ఇంతకు ముందు టపాల్లో వివరించాను. పితృణములు తీర్చిననాడు పితరులు తరించగలరు.
    పుష్పక పుస్తకం ప్రయోగం బాగుంది.

    ReplyDelete
  6. పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" అని భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.

    ReplyDelete